Breaking News
  • నల్గొండ: చండూరు డాన్‌బాస్కో కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య. ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఫస్టియర్‌ విద్యార్థి ప్రకాష్‌. ప్రకాష్‌ ఆత్మహత్యకు ప్రేమ వ్యవహారమే కారణమని అనుమానం. ప్రకాష్‌ స్వస్థలం గుంటూరు జిల్లా .
  • ప.గో: సంజీవయ్య నగర్‌లో కొండచిలువ కలకలం. నివాసాల మధ్యకు వచ్చిన 8 అడుగుల కొండచిలువ. భయబ్రాంతులకు గురైన స్థానికులు కొండచిలువను కొట్టి చంపిన స్థానికులు.
  • ప.గో: పెనుమంట్ర మండలం మార్టేరులో కిసాన్‌ మేళా. కిసాన్‌ మేళాలో పాల్గొన్న వ్యవసాయ మంత్రి కన్నబాబు. మాది రైతు పక్షపాత ప్రభుత్వం-మంత్రి కన్నబాబు. 44 లక్షల రైతు కుటుంబాలకు రైతుభరోసా వర్తింపు. రూ.3లక్షల రుణం తీసుకున్న రైతులకు వడ్డీ లేదు-కన్నబాబు. చిరుధాన్యాలు పండించే రైతులను ప్రోత్సహించేందుకు. త్వరలోనే విధివిధానాలు ప్రకటిస్తాం-మంత్రి కన్నబాబు
  • సంగారెడ్డి: జిల్లాలో పలు అభివృద్ధి పనులకు హరీష్‌రావు శంకుస్థాపన. జోగిపేట, ఆందోల్‌లో రూ.10కోట్ల పనులకు శంకుస్థాపన చేసిన హరీష్‌. మున్సిపాల్టీ ఎన్నికల్లో టీఆర్ఎస్‌ విజయం ఖాయం-మంత్రి హరీష్‌రావు. కాళేశ్వరం, మల్లన్న సాగర్‌ నీళ్లతో సింగూర్‌ను నింపుతాం-హరీష్‌. సాగుకోసం సింగూర్‌ నీరు మెదక్ జిల్లాకు దక్కేలా ప్రణాళికలు రచిస్తాం. సింగూర్‌లో నీళ్లు లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఏర్పాటు చేస్తాం. అదనంగా నిధులు ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు-హరీష్‌రావు.
  • తెలంగాణ భవన్‌లో ముగిసిన టీఆర్‌ఎస్‌పీపీ సమావేశం కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయహోదాపై పోరాడుతాం-ఎంపీ నామా. రాష్ట్రంలో అన్ని ప్రాజెక్ట్‌లకు నిధులు కోరుతాం-ఎంపీ నామా. కాళేశ్వరంపై సుప్రీంకోర్టులో ఏపీ అఫిడవిట్‌ దాఖలు చేయడంపై సీఎం కేసీఆర్‌ స్పందించారు-ఎంపీ నామా నాగేశ్వరరావు. బయ్యారం స్టీల్‌ప్లాంట్‌తో పాటు 30 అంశాలపై చర్చించాం . హామీల సాధన కోసం కేంద్రంపై ఒత్తిడి తెస్తాం-నామా నాగేశ్వరరావు. మిషన్‌ భగీరథ పథకానికి కేంద్రాన్ని నిధులు కోరుతాం-ఎంపీ నామా.
  • హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ ఎంపీలకు కేటీఆర్‌ దిశానిర్దేశం. పార్లమెంట్ సమావేశాల్లో విభజన హామీలు పెండింగ్‌ సమస్యలను లేవనెత్తాలని కేటీఆర్‌ ఆదేశం. బడ్జెట్‌లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు నిధులపై ఇప్పటి నుంచే పనిచేయాలని ఎంపీలకు సూచన. గణాంకాలతో ఎంపీలకు సమగ్ర సమాచారం అందించాలన్న కేటీఆర్‌. దేశ రాజధానిలో అన్ని హంగులతో పార్టీ కార్యాలయం నిర్మిస్తాం. పార్టీ ఆఫీస్‌ నిర్మాణ ప్రక్రియను వేగవంతం చేస్తామన్న కేటీఆర్‌.
  • తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ శ్రీవారి ఉచిత దర్శనానికి 12 గంటల సమయం ఈరోజు శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.88కోట్లు

ఈ సినిమా నాకు సమ్‌థింగ్ స్పెషల్ : అవికా గోర్

‘రాజాగారు గది’ సిరీస్‌లో వస్తున్న మూడవ చిత్రం ‘రాజుగారి గది 3’. హారర్ కామెడీ మూవీగా తెరకెక్కిన ఈ మూవీ ఈనెల 18న విడుదల కానుంది. అశ్విన్ బాబు, అవికా గోర్ ప్రధాన పాత్రలలో నటించగా, ఓంకార్ దర్శకత్వంలో తెరకెక్కింది. మూవీ విడుదల నేపథ్యంలో హీరో అవికా గోర్ మీడియా సమావేశంలో పాల్గొని చిత్ర విశేషాలు పంచుకున్నారు.

1. తెలుగులో చాలా గ్యాప్ వచ్చింది.?

* ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ తర్వాత తెలుగులో కొన్ని ఆఫర్స్‌ వచ్చాయి. కానీ ఆ క్యారెక్టర్స్‌ నన్ను ఉత్సాహపర్చలేదు. పైగా రెండు టివీ షోలు, ఒక సినిమా చేయడం వల్ల ఇక్కడ ఫోకస్‌ పెట్టలేకపోయాను.

2. మరి ‘రాజుగారి గది 3’ సినిమా చేయడానికి కారణం ?

* ‘రాజుగారి గది3’ లో నేను భాగం కావడం, లీడ్‌ క్యారెక్టర్‌ చేయడం హ్యాపీగా ఉంది. ఈ క్యారెక్టర్‌ను తమన్నాతో చేయించాలని అనుకున్నామని డేట్స్‌ కుదర్లేదని ఓంకార్‌ గారు చెప్పారు. అప్పటికి నా డేట్స్‌ కుదరడంతో నలబై నిమిషాలు నాకు స్టోరీ చెప్పారు. కథ విన్న వెంటనే ఒకే చెప్పేసాను. అయితే నాకు ఇలాంటి హార్రర్‌ చిత్రాలంటే భయం. థియేటర్లలో ఫ్రెండ్స్‌తోపాటే చూస్తుంటాను. అలాంటిది ఇలాంటి చిత్రంలో నటించాల్సి రావడం నాకే థ్రిల్‌గా అనిపించింది. దర్శకుడు ఓంకార్‌ కథ చెబుతుండగా క్లయిమాక్స్‌ వచ్చేసరికి ముడుచుకు కూర్చుని కథ విన్నాను. అంతలా ప్రేక్షకుల్ని కూడా భయపెడుతుంది. ఒక్క భయమేకాదు వినోదం కూడా ఇందులో వుంది. సినిమాతో పాటు నా క్యారెక్టర్‌ కూడా ఆడియన్స్‌కి బాగా కనెక్ట్‌ అవుతుందని అనుకుంటున్నాను.

3. అలీ గారీతో కలిసి యాక్ట్ చేస్తున్నప్పుడు ఎగ్జైట్ అయ్యారట?

* అలీ గారు నటించిన చాలా డబ్బింగ్‌ సినిమాలు చూశాను. ఎప్పటికైనా ఆయనతో యాక్ట్‌ చేయాలని మా అమ్మ అంటుండేది. ఈ సినిమాతో ఆ చాన్స్‌ వచ్చింది. ఆయనను ఫస్ట్‌ టైం సెట్స్‌లో కలవగానే చాలా సంతోషపడ్డా. అలాంటి సీనియర్‌ యాక్టర్స్‌తో పనిచేయడం ఓ కిక్‌. ఆ కిక్‌ను ఈ సినిమాతో పొందాను.

4. మీరు సినిమా చెయ్యాలంటే..ఎలాంటి అంశాలు ప్రామాణికంగా తీసుకుంటారు?

* నేను సినిమా చేయాలంటే కథ, క్యారెక్టర్‌తో పాటు టీమ్‌ను కూడా చూస్తాను. ముందుగా టీంను దష్టిలో పెట్టుకునే సినిమా ఒకే చేస్తాను. ఈ సినిమాకు వర్క్‌ చేసిన టీం అందరూ బెస్ట్‌ వర్క్‌ ఇచ్చారు. అందుకే సినిమా తొందరగా ఫినిష్‌ అయింది.

5. పోస్టర్ లోనే మీ లుక్ చాల భయం కలిగించేలా ఉంది. అది చూసినపుడు మీకెలా అనిపించింది ?

* ఫస్ట్‌ టైం దెయ్యం మేకప్‌లో కనిపించగానే నాన్న ‘ఇదీ నువ్వు’ అంటూ ఆట పట్టించారు. నాన్న చేసిన ఆ కామెంట్‌ను కాంప్లిమెంట్‌ గానే తీసుకున్నాను.

6.తమన్నా చేయాల్సిన పాత్రను మీరు చేశారు. నటనలో ఆమెతో పోల్చి చూస్తారనే టెన్షన్ ఉందా ?

లేదు అండి. ఏ క్యారెక్టర్ అయినా దాన్ని ఎవరు చేసినా దర్శకుడి అభిరుచికి తగ్గట్లే చేస్తారు. కాకపోతే, ఎవరి శైలి వారిది. నా వరకూ నేను ఈ సినిమా కోసం సిన్సియర్ గా వర్క్ చేశాను. అందరికి నచ్చుతుంది అనుకుంటున్నాను.

7. మీ నెక్ట్స్ ప్రాజెక్ట్స్ గురించి చెప్పండి?

* తెలుగులో ఇంకో సినిమా సైన్‌ చేశాను. ఆ సినిమా గురించి చెప్పాలనుంది. కానీ మరో పదిహేను రోజుల్లో అనౌన్స్‌ ఉంటుందని చెప్పారు. సో! అప్పటి వరకూ ఆ సినిమా గురించి ఏం చెప్పలేను.