ఇక ‘తెలంగాణ బ్రాండ్‌’ జనరిక్‌ మందుల షాపులు…

Telangana Brand Medical Shops : ప్రజలకు వైద్య సేవలను మరింత విస్తరించేందుకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ జనరిక్‌ మందుల షాపులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో, బయట వీటిని ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది. దీంతో ప్రభుత్వ మెడికల్‌ షాపుల్లో తక్కువ ధరకే ‘తెలంగాణ బ్రాండ్‌’ జనరిక్‌ మందులు లభిస్తాయి. దీనిపై ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ మెడికల్‌ షాపుల్లో అమ్మే […]

ఇక ‘తెలంగాణ బ్రాండ్‌’ జనరిక్‌ మందుల షాపులు...
Follow us

|

Updated on: Oct 30, 2020 | 9:01 PM

Telangana Brand Medical Shops : ప్రజలకు వైద్య సేవలను మరింత విస్తరించేందుకు తెలంగాణ సర్కార్ ప్లాన్ చేస్తోంది. ఇందులో భాగంగా ప్రభుత్వ జనరిక్‌ మందుల షాపులను ఏర్పాటు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వాస్పత్రుల్లో, బయట వీటిని ఏర్పాటు చేయాలని వైద్య, ఆరోగ్యశాఖ సూత్రప్రాయంగా నిర్ణయించింది.

దీంతో ప్రభుత్వ మెడికల్‌ షాపుల్లో తక్కువ ధరకే ‘తెలంగాణ బ్రాండ్‌’ జనరిక్‌ మందులు లభిస్తాయి. దీనిపై ఇటీవల వైద్య, ఆరోగ్య శాఖ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించింది. ప్రభుత్వ మెడికల్‌ షాపుల్లో అమ్మే మందులపై ప్రత్యేకంగా ‘తెలంగాణ ప్రభుత్వ సరఫరా’అని లేబుల్‌ అంటించనున్నారు.

రాష్ట్రంలో ప్రైవేట్‌ ఆసుపత్రుల్లోనూ, బయట కొన్ని మందుల దుకాణాలదే  పెత్తనం నడుస్తోంది. వారు చెప్పిందే ధర. తక్కువకు దొరికే మందులనూ కూడా అధిక ధరకు అనారోగ్యంతో ఉన్నవారికి  అంటగడుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి సమస్యకు అడ్డుకట్ట విధించేందుకు ప్రభుత్వం జనరిక్ మందుల షాపుల ఏర్పాటుపై ఫోకస్ పెట్టింది.

ఇక కొన్ని ప్రభుత్వాస్పత్రుల్లోనూ టెండర్లు పిలిచి ప్రైవేట్‌ వ్యక్తులకే దుకాణాలను కేటాయించనున్నారు.  ప్రభుత్వాస్పత్రులకు ఇచ్చే మందులను మాత్రమే తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (TSMSIDC) సమకూరుస్తోంది.