Kite Flying: సంక్రాంతి పండగ వస్తుందంటే చాలు రెండు, మూడు నెలల ముందు నుంచే ఆకాశంలో గాలిపటాల సందడి నెలకొంటుంది. ఎటు చూసినా గాలిపటాలే దర్శనమిస్తుంటాయి. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు గాలి పటాలు ఎగరవేస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఒకసారి గాలి పటాల చరిత్రను చూస్తే.. దాదాపు రెండువేల సంవత్సరాల కిందట చైనాలో వీటిని తయారు చేశారని తెలుస్తోంది.
మొదట్లో వీటిని ఆత్మరక్షణకు, సమాచారాన్ని పంపించడం కోసం ఉపయోగించేవారట. ఆ తర్వాత సిగ్నలింగ్, మిలటరీ ఆపరేషన్స్‌లోనూ వీటిని వినియోగించారు. ఒకప్పటి గాలిపటాలు మందంగా, దీర్ఘచతురస్రాకారంలో ఉండేవి. క్రీస్తుపూర్వం 206లో చైనాలో హేన్ వంశపు రాజుల చరిత్ర ప్రారంభం కావటానికి గాలిపటమే దోహదం చేసిందని పరిశోధకులు చెబుతారు.
దుర్మార్గుడైన రాజును ఓడించేందుకు హేన్ చక్రవర్తి వచ్చిన ఐడియానే తొలి గాలిపటం. అయితే ఆ రాజు కోటలోకి సొంగాన్ని తవ్వాలనేది ఆలోచన. కానీ ఎంత దూరం తవ్వాలన్న విషయం ఆలోచించి హేన్ చక్రవర్తి ఒకదానిని గాలిపటంలా చేసి దారం కట్టి ఎగరవేశాడు. ఆ దారాన్ని కొలిచే సొరంగం తవ్వి సైనికులను పంపి కోటను వశం చేసుకున్నాడనే కథ ప్రచారంలో ఉంది.
ఆయుర్వేద శాస్త్రంలో ఏముంది..?
ఈగాలి పటాలు ఎగురవేయడం వెనుక చాలా ఆశక్తికరమైన కారణం ఉంది. పూర్వకాలంలో గాలిపటాలను పగలే ఎగరవేయడంలో ఒక ఆరోగ్యపరమైన కారణం కూడ ఉంది. గాలిపటాలు ఎగరేసే టపుడు ఎక్కువ సమయం మన శరీరం సూర్యకిరణాలకు బహిర్గతం అవుతుంది కాబట్టి ఆరోగ్య రీత్యా ఇది చాల మంచి అలవాటు అనీ ఆయుర్వేద శాస్త్రంలో చెపుతారు. శరీరంలో ఉన్న చెడు బాక్టీరియా కొంత వరకు తొలగిపోతుంది. ఇన్ఫెక్షన్లు పోతాయి. ఎండలో ఉండడం వలన వెచ్చని ఆహ్లాదాన్ని మనస్సుకు కలిగిస్తుంది. అందుకే గాలిపటాలు ఎగరవేసే సాంప్రదాయం వచ్చింది.
వివిధ దేశాల్లో..
► థాయ్‌లాండ్‌లో పతంగులు ఎగురవేయాలంటే 78 రకాల నిబంధనలు పాటించాల్సి ఉంటుంది.
► బెర్లిన్ గోడపై నుంచి అవతలికి వెళ్ళే అవకాశం ఉండడంతో భారీ పతంగులను ఎగురవేయడంపై తూర్పు జర్మనీలో నిషేధం విధించారు.
► ఆకాశంలో ఎగిరే గాలిపటాలను చూడటం కంటిచూపును మెరుగుపరుస్తుందని చైనీయుల విశ్వాసం. అలా తల బాగా పైకి ఎత్తి చూసేటపుడు నోరు కొద్దిగా తెరచుకుంటుందని, అది శరీరానికి శక్తిని ఇస్తుందని వారు నమ్ముతారు.
► జపాన్‌లో కొన్ని పతంగుల బరువు కొన్ని కిలోల వరరకు ఉంటుందట.
► జపాన్, యుకె, మలేషియా, ఇండోనేషియా, తైవాన్, థాయ్‌లాండ్, అమెరికా, సింగపూర్‌లో ఒకప్పుడు వీటిని చేపలు పట్టడానికి ఉపయోగించేవారు.
ఇవి కూడా చదవండి: