వాట్సప్ ప్రైవసీ పాలసీ నిబంధన ప్రవేశపెట్టిన క్రమంలో దానిపై పెద్ద ఎత్తున విమర్శలు వెలువడ్డాయి. వాట్సప్ తీసుకువచ్చిన ప్రైవసీ పాలసీ రూల్‌ను అంగీకరిస్తే.. మన వ్యక్తిగత సమాచారం మొత్తం స్టోరేజీ చేసుకుందని.. అలాగే ఫేస్బుక్ యాడ్లకు వినియోగించబోతుందని ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో ఈ యాప్‌ను అన్ ఇన్స్టాల్ చేసేవారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. అంతేకాకుండా డిస్లైక్ చేయడం చేస్తున్నారు. అంతేకాకుండా వాట్సప్‌కు ప్రత్య్నామయంగా వేరే యాప్‌ల వైపు మక్కువ చూపిస్తున్నారు. దీంతో వాట్సప్ యూజర్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయితే ఈ వార్తలపై వాట్సప్ స్పందించింది. ప్రైవసీ పాలసీ గురించి వస్తున్న వార్తలన్నీ రూమర్స్ అని.. వాటికి సమాధానం చెప్పడం తమ బాధ్యత అని సోషల్ మీడియా వేదికగా వాట్సప్ స్పష్టం చేసింది. ఇక ఈ పుకార్లను అధిగమించేందుకు వాట్సప్ ముందుకు వచ్చింది. యూజర్ల వ్యక్తిగత వివరాలు ఎక్కడ స్టోరేజ్ అవ్వవని.. అలాగే వారి భద్రత గోప్యతకు తాము రక్షణగా ఉంటామని ప్రకటించింది.
అంతేకాకుండా అందుకు సంబంధించిన కొన్ని విషయాలను కూడా వెల్లడించింది.
☛ ఫేస్‌బుక్‌కు వాట్సాప్ వివరాలు పంపుతాం అనేది వాస్తవం కాదు. మేము ఎలాంటి వివరాలను షేర్ చేసుకోం. అలాగే వ్యక్తిగత చాట్ వివరాలు షేర్ చేయ్యం.
☛ కొత్తగా ప్రైవసీ పాలసీని రూపొందిస్తున్నాం. కొత్త నిబంధనలను అంగీకరిస్తేనే వాట్సప్ వినియోగానికి అర్హులు. లేదంటే వారి ఖాతాను తొలగించేస్తాం.
☛ కొత్తగా అప్డేట్ చేసిన వెర్షన్‌ను ఫిబ్రవరిలో అమల్లోకి తెస్తాం. వాట్సప్‌కు 400 మిలియన్ల వినియోగదారులు ఉన్నారు.
☛ ఫేస్‌బుక్‌కు మీ కాంటాక్ట్స్ వివరాలను పంచుకోము.
☛ వ్యక్తిగత వివరాలు ఎవరికీ షేర్ చేయము.
☛ మీ వివరాలన్నింటి విషయంలో గోప్యత పాటిస్తాం.
☛ మీరు సందేశాలు కనిపించకుండా చేసుకోవచ్చు.
☛ మీరు పంపిన లోకేషన్స్ కూడా వాట్సప్ పర్యవేక్షించదు.