AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

గోళ్లు ఇలా ఉంటే మీరు అదృష్టవంతులే! సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోంది?

సాముద్రిక శాస్త్రం ప్రకారం, ఒక వ్యక్తి గోళ్లు వారి ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా, వారి అదృష్టాన్ని, ఆర్థిక స్థితిని, వ్యక్తిత్వాన్ని కూడా ప్రతిబింబిస్తాయి. సాముద్రిక శాస్త్రం ప్రకారం, గోళ్ల ఆకృతి, రంగు ఒక వ్యక్తి జీవితంలో విజయాన్ని, సంపదను సూచిస్తాయి. గోళ్లను శుభ్రంగా ఉంచుకోవడం వల్ల సానుకూల శక్తి పెరిగి జీవితంలో శ్రేయస్సు లభిస్తుందని ఈ శాస్త్రం వివరిస్తోంది. ముఖ్యంగా గోళ్ల అడుగు భాగంలో ఉండే తెల్లటి అర్ధ చంద్రాకారపు గుర్తు (Lunula) వారి జీవితంలో ఎక్కువ ప్రభావంతమైనదిగా నిపుణులు చెబుతున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

గోళ్లు ఇలా ఉంటే మీరు అదృష్టవంతులే! సాముద్రిక శాస్త్రం ఏం చెబుతోంది?
Nail Astrology
Jyothi Gadda
|

Updated on: Mar 26, 2026 | 5:40 PM

Share

మనం సాధారణంగా గోళ్లను కేవలం శరీరంలో ఒక భాగంగానే చూస్తాం. కానీ సాముద్రిక శాస్త్రం ప్రకారం, గోళ్లు మన విధిరాతను అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. గోళ్ల ఆకృతి, రంగు ఒక వ్యక్తి జీవితంలో విజయాన్ని, సంపదను సూచిస్తాయి. మీ గోళ్లపై ఉండే గుర్తులు మీకు రాజయోగం ఉందో లేదో తెలియజేస్తాయని నిపుణులు చెబుతున్నారు. అదేలాగో ఇక్కడ తెలుసుకుందాం..

1. అర్ధ చంద్రాకారపు గుర్తు (The Half-Moon Sign): గోళ్ల అడుగున కనిపించే తెల్లటి అర్ధ చంద్రాకారాన్ని లునుల అంటారు. ఇది బొటనవేలుపై స్పష్టంగా ఉంటే, ఆ వ్యక్తి త్వరలో ఏదైనా శుభవార్త వింటారని లేదా ఆకస్మిక ధనలాభం పొందుతారని అర్థం. చూపుడు వేలుపై ఉంటే, ఉద్యోగస్తులకు ప్రమోషన్ లేదా సమాజంలో గౌరవం లభించే సూచన. మధ్య వేలుపై కనిపిస్తే..అది వ్యాపారంలో లాభాలు, ఆదాయ మార్గాలు పెరుగుతాయని సంకేతం.

2. గోళ్ల రంగు – సంపదకు చిహ్నం: గోళ్ల రంగు మీ మానసిక స్థితిని, అదృష్టాన్ని ప్రతిబింబిస్తుంది. గులాబీ/ఎరుపు రంగు గోళ్లకు కూడా ప్రత్యేక సూచికలు ఉన్నాయి. ఈ రంగు గోళ్లు ఉన్నవారు ఆరోగ్యవంతు, ధనవంతులుగా ఉంటారు. వీరు ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. తెల్లటి గోళ్లు ఉన్నవారు ప్రశాంత స్వభావులు, మంచి మేధస్సు కలిగి ఉంటారు.

ఇవి కూడా చదవండి

3. గోళ్లపై తెల్లటి మచ్చలు (White Spots): గోళ్లపై చిన్న చిన్న తెల్లటి మచ్చలు ఉండటం కూడా అదృష్టానికి సంకేతమే. ఇలాంటి మచ్చలు చిటికెన వేలుపై తెల్ల మచ్చ ఉంటే ప్రయాణాలు కలిసి వస్తాయి. విదేశీ యానానికి అవకాశం ఉంటుంది. అది ఉంగరపు వేలుపై ఉంటే, ఇది కళాకారులకు, సృజనాత్మక రంగంలో ఉన్నవారికి అద్భుతమైన గుర్తింపును తెస్తుంది.

4. ఆకృతి, పరిమాణం: చతురస్రాకారపు గోళ్లు ఉన్నవారు కష్టపడే తత్వాన్ని సూచిస్తాయి. వీరు తమ లక్ష్యాలను సాధించడానికి ఎంతటి శ్రమనైనా ఓర్చుకుంటారు. అదే పొడవైన గోళ్లు ఉన్నవారు ఊహాశక్తి ఎక్కువగా ఉన్నవారు. కళాత్మక హృదయం కలవారు.

జాగ్రత్త: గోళ్లపై నలుపు లేదా పసుపు రంగు మచ్చలు ఉండటం ఆరోగ్య సమస్యలకు లేదా రాబోయే కష్టాలకు సూచనగా పరిగణించబడుతుంది. కాబట్టి, గోళ్లను ఎప్పుడూ శుభ్రంగా, ఆరోగ్యంగా ఉంచుకోవడం వల్ల మనలోని సానుకూల శక్తి పెరుగుతుంది.

Note : ఈ వార్తలో చెప్పిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. కేవలం పాఠకుల ఆసక్తి మేరకు, పలువురు పండితుల సూచనలు, వారు తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు.

మరిన్ని లైఫ్ స్టైల్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
టెస్లా కార్లపై ఏకంగా రూ. 9 లక్షల తగ్గింపు.. ఎందుకో తెలుసా?
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
ఒకే టూర్‌లో 7 జ్యోతిర్లింగాల దర్శనం.. సికింద్రాబాద్ నుంచి..
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
వేసవిలో ఈ పండు అమృతం!వడదెబ్బ,డీహైడ్రేషన్ నుండి రక్షణకు బెస్ట్
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
పోస్టాఫీసులో రూ. లక్ష డిపాజిట్‌ చేస్తే రెండేళ్లకు ఎంత వస్తుంది?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఐపీఎల్ హిస్టరీలోనే మోస్ట్ అన్‌లక్కీ ప్లేయర్ ఎవరో తెలుసా?
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..
ఇంటర్ పూర్తి చేశారా? కాలేజీ ఎంపికలో ఈ తప్పులు చేస్తే కెరీర్..
ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అరెస్ట్
ఢిల్లీలో బయటపడ్డ ఐఎస్‌ఐ టెర్రర్ నెట్‌వర్క్‌.. 9 మంది అరెస్ట్
సమ్మర్‌లో గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?
సమ్మర్‌లో గుడ్లు తింటే నిజంగానే వేడి చేస్తుందా.. వాస్తవమేంటి?
సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో
సీఎం విజయ్ బెస్ట్ ఫ్రెండ్ ఆ చిన్నోడు.. ఇండస్ట్రీలోనే క్రేజీ హీరో
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..
పెరుగుతున్న సి-సెక్షన్ ప్రసవాలు.. NFHS నివేదికలో షాకింగ్ నిజాలు..