Dream: ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి కలలు వస్తున్నాయా.? వాటి అర్థం ఏంటంటే..

|

Oct 11, 2024 | 8:13 AM

గర్భిణీలుగా ఉన్న సమయంలో మహిళలకు కలలో జలపాతాలు కనిపిస్తుంటే మీరు సంకుచిత ఆలోచనలతో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత ఎలా అనే ఆలోచనతో ఉంటారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత జరగబోయే పరిస్థితులకు సంబంధించి భయంతో ఉన్నారని అర్థం. అయితే ఎక్కువ శాతం ఇందులో అనవసరమైన...

Dream: ప్రెగ్నెన్సీ టైంలో ఇలాంటి కలలు వస్తున్నాయా.? వాటి అర్థం ఏంటంటే..
Dreams Meaning
Follow us on

కలలు రావడం సర్వసాధారణమైన విషయం. ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వస్తూనే ఉంటాయి. అయితే మనకు వచ్చే ప్రతీ కలకు ఒక అర్థం ఉంటుందని ఇటు పండితులతో పాటు, మానసిక నిపుణులు సైతం చెబుతుంటారు. ఇక గర్భిణీలకు కలలు రావడానికి ఎన్నో అర్థాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. సాధారణంగా గర్భాధారణ సమయంలో మహిళల్లో ఒత్తిడి పెరుగుతుంది ఇది వారి మానసిక ఆరోగ్యంతో పాటు నద్రపై కూడా ప్రభావం చూపుతుంది. దీంతో ప్రెగ్నెన్సీ సమయంలో మహిళలకు రకరకాల కలలు వస్తుంటాయి. అయితే గర్బిణీలకు ఎలాంటి కలలు వస్తే ఎలాంటి అర్థమో ఇప్పుడు తెలుసుకుందాం..

గర్భిణీలుగా ఉన్న సమయంలో మహిళలకు కలలో జలపాతాలు కనిపిస్తుంటే మీరు సంకుచిత ఆలోచనలతో ఉన్నారని అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా పిల్లలు పుట్టిన తర్వాత ఎలా అనే ఆలోచనతో ఉంటారు. బిడ్డకు జన్మనిచ్చిన తర్వాత జరగబోయే పరిస్థితులకు సంబంధించి భయంతో ఉన్నారని అర్థం. అయితే ఎక్కువ శాతం ఇందులో అనవసరమైన భయాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ గర్భిణీలకు కలలో కప్పులు కనిపిస్తే మీలో ఎలాంటి భయం లేదని అర్థం చేసుకోవాలి. రాబోయే పరిస్థితులను మీరు సంతోషంగా ఆహ్వానిస్తున్నారని అర్థం. పుట్టబోయే బిడ్డల బాధ్యల గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నాని అర్థం. అదే విధంగా ఇలాంటివి కలలో కనిపిస్తే మీకు ఎదురయ్యే పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నారని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

ఒకవేళ గర్భధారణ సమయంలో బిల్డింగ్స్ , కార్లు కనిపిస్తే కడుపులోని బిడ్డ ఆరోగ్యంగా పెరుగుతోందని అర్థం. ఇది మీ బిడ్డ, మీ ఎదుగుదలని చూపిస్తుంది. ఇక ప్రయాణం చేస్తున్నట్లు కలలో కనిపిస్తే జాగ్రత్తగా ఉండాలని అర్థం చేసుకోవాలి. మరీముఖ్యంగా ప్రయాణం చేస్తున్న సమయంలో ప్రమాదం జరిగినట్లు కనిపిస్తే అలర్ట్‌ అవ్వాలని అంటున్నారు. ఏదో ప్రమాదం జరగబోతుందని ఈ కల చెబుతుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు పండితులు, శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..