AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

విక్రమార్కుడు – బేతాళుడు కథ.. మీ తెలివి తేటలకు పదును బెట్టే చిక్కుప్రశ్న

రాజు విక్రమార్కుడికి బేతాళుడు విసిరిన ఆసక్తికరమైన చిక్కుప్రశ్న ఇది. ఒకే అమ్మాయిని కాపాడిని ముగ్గురు యువకులలో నిజమైన భర్త ఎవరు అనే ప్రశ్నకు సమాధానం చెప్పగలరా? మీ తెలివితేటలు, తార్కిక ఆలోచనకు పదును పెట్టే ఈ కథ చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగుతుంది. ఈ ముగ్గురిలో ఆ అమ్మాయికి నిజమైన భర్తగా రాజు ఎవరిని ఎంపిక చేస్తాడు?" అనే ప్రశ్నకు మీ సమాధానం ఏమిటి?

విక్రమార్కుడు – బేతాళుడు కథ.. మీ తెలివి తేటలకు పదును బెట్టే చిక్కుప్రశ్న
Vikram And Betal Story
Srilakshmi C
|

Updated on: Jun 01, 2026 | 6:00 AM

Share

ఉజ్జయిని రాజ్యాన్ని పరిపాలిస్తున్న విక్రమార్కుడు ధైర్యసాహసాలకు ప్రసిద్ధి చెందాడు. ఒక రోజు ఓ తపస్వి రాజసభకు వచ్చి, శ్మశానవాటికలో ఉన్న ఒక చెట్టుపై వేలాడుతున్న బేతాళుడిని తన దగ్గరకు తీసుకురావాలని కోరాడు. రాజు అంగీకరించి అర్ధరాత్రి శ్మశానానికి బయలుదేరాడు. కారుచీకట్లో అడవిని దాటి, భయంకరమైన శ్మశానవాటికకు చేరుకున్న విక్రమార్కుడు చెట్టుపై వేలాడుతున్న బేతాళుడిని తన భుజంపై వేసుకుని తిరిగి ప్రయాణం ప్రారంభించాడు. అయితే భుజంపై వేలాడుతున్న ఆ శవంలో బేతాళుడు అనే ఆత్మ ఉండేది. బేతాళుడు చాలా తెలివైనవాడు. ప్రయాణం సాగుతుండగా రాజుకు ఒక కథ చెప్పడం మొదలుపెట్టాడు.

ఒక రాజుకు ముగ్గురు యువకులు సేవకులుగా ఉండేవారు. వారిలో ఒకడు అసాధారణ జ్ఞానవంతుడు, మరొకడు అపార ధైర్యవంతుడు, ఇంకొకడు యుద్ధవిద్యలో నిపుణుడు. ఒకసారి రాజకుమార్తెను రాక్షసుడు అపహరించాడు. రాజకుమార్తెను వెదకి తీసుకొచ్చిన వారికి ఆమెను ఇచ్చి వివాహం జరిపిస్తానని రాజు ప్రకటించాడు. దీంతో ఆ ముగ్గురు యువకులు కలిసి ఆమెను వెతికారు. జ్ఞానవంతుడు రాజకుమార్తె ఎక్కడ ఉందో కనుగొన్నాడు. యుద్ధవీరుడు రాక్షసుడితో పోరాడి అతన్ని సంహరించాడు. ధైర్యవంతుడు ప్రాణాలకు తెగించి రాజకుమార్తెను సురక్షితంగా తీసుకొచ్చాడు. కథ ముగిసిన తర్వాత బేతాళుడు విక్రమార్కుడిని “ఈ ముగ్గురిలో రాజకుమార్తెను వివాహం చేసుకోవడానికి నిజంగా అర్హుడు ఎవరు?” అని ప్రశ్నించాడు.

సమాధానం తెలిసి కూడా మౌనంగా ఉంటే విక్రమార్కుడి తల వెయ్యి ముక్కలవుతుందని తెలుసుకున్న విక్రమార్కుడు.. “రాక్షసుడిని సంహరించిన యుద్ధవీరుడే ఆమెను వివాహం చేసుకోవడానికి అర్హుడు. ఎందుకంటే జ్ఞానవంతుడు దారి చూపాడు. ధైర్యవంతుడు సహాయం చేశాడు. కానీ ప్రమాదాన్ని ఎదుర్కొని విజయాన్ని సాధించినవాడు మాత్రమే యుద్ధవీరుడు” అని చెప్పాడు. వెంటనే బేతాళుడు నవ్వి, “నువ్వు మాట్లాడావు కాబట్టి నేను మళ్లీ చెట్టుపైనే ఉంటాను” అంటూ ఎగిరిపోయాడు. విక్రమార్కుడు మళ్లీ చెట్టు దగ్గరకు వెళ్లి బేతాళుడిని తీసుకువచ్చాడు. ఇలా ప్రతి సారి బేతాళుడు ఒక కథ చెప్పి చివర్లో ప్రశ్న అడిగేవాడు. విక్రమార్కుడు తన జ్ఞానం, చాతుర్యంతో సమాధానం చెప్పి ప్రమాదాన్ని తప్పించుకునేవాడు.

నీతి:

ధైర్యంతో పాటు తెలివి, న్యాయబుద్ధి ఉంటే ఎలాంటి సమస్యనైనా అధిగమించవచ్చు.

Follow Us