AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Colour Chicks: ఈ రంగురంగుల కోడి పిల్లల్ని చనిపోకుండా పెంచడం ఎలా..? ఇలా చేయండి

రంగు కోడిపిల్లలను ఇంట్లో పెంచడానికి సరైన దాణా, నీరు, బ్రూడింగ్ పద్ధతులు అవసరం. ఇవి సాధారణంగా లేయర్ కోడిపిల్లలైనప్పటికీ, సరదాగా పెంచుకోవడానికి అనుకూలం. సహజ సిద్ధమైన దాణాతో పాటు బెల్లం నీరు, పసుపు నీరు అందించి, బ్రూడింగ్ సదుపాయం కల్పిస్తే ఇవి ఆరోగ్యంగా పెరుగుతాయి.

Colour Chicks: ఈ రంగురంగుల కోడి పిల్లల్ని చనిపోకుండా పెంచడం ఎలా..? ఇలా చేయండి
Colour Chicks
Ram Naramaneni
|

Updated on: Feb 15, 2026 | 7:24 PM

Share

రంగు కోడిపిల్లలను ఇంట్లో పెంచడం అనేది పిల్లలకు, పెద్దలకు ఎంతో ఆహ్లాదకరమైన అనుభూతినిస్తుంది. అయితే, వీటిని సరదాగా పెంచుకోవడానికి మాత్రమే పరిగణించాలి. ఇవి సాధారణంగా లేయర్ కోడి జాతికి చెందినవి, వాటికి ఆకర్షణీయమైన రంగులు వేసి విక్రయిస్తారు. వీటిని గిరిరాజా, టర్కీ లేదా ఇతర నాటు జాతులుగా తప్పుగా పొరపాటు పడకండి. సరైన పెంపకం పద్ధతులు పాటించకపోతే, వీటిలో 80% వరకు చనిపోయే అవకాశం ఉంది. అందువల్ల, వాటి సంరక్షణకు సంబంధించి కొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకోవడం అవసరం.

కోడిపిల్లల ఎంపిక, ఖర్చు: రంగు కోడిపిల్లలు సాధారణంగా రూ.10 నుంచి రూ.20 చొప్పున అమ్ముతారు. వీటిని చిన్నపిల్లలు ఇష్టపడతారు కాబట్టి, విక్రేతలు లాభాపేక్షతో వీటిని ఇంటింటికీ తిరిగి అమ్ముతుంటారు. కొనుగోలు చేసేటప్పుడు ఇవి ఏ జాతివి అని అడిగితే రకరకాల తప్పుడు సమాధానాలు చెబుతుంటారు. కానీ, ఇవి కేవలం సరదాగా పెంచుకోవడానికి మాత్రమే ఉద్దేశించినవని గుర్తించాలి. వీటి ఒరిజినల్ రంగు తెలుపు .

దాణా (ఫీడింగ్):  కోడిపిల్లల ఆరోగ్యకరమైన ఎదుగుదలకు సరైన దాణా చాలా ముఖ్యం. ప్రారంభ దశలో, అంటే మొదటి 20-25 రోజుల వరకు, సహజసిద్ధమైన దాణాను అందించవచ్చు. సజ్జలు, నూకలు, కొద్దిగా రాగులు కలిపి ఇవ్వడం వల్ల ఇవి ఇష్టంగా తింటాయి. ఈ ఆర్గానిక్ దాణా ద్వారా ఎదుగుదల నెమ్మదిగా ఉన్నప్పటికీ, చికెన్ నాణ్యత బాగుంటుంది. నాటు కోళ్ల మాదిరిగా ఇవి పెద్దగా పెరగవు. వేగవంతమైన ఎదుగుదల కోసం మరియు గుడ్లు పెట్టడానికి కంపెనీ ఫీడ్ అవసరం. కంపెనీ ఫీడ్‌లో అన్ని పోషకాలు కలిపి ఒక నిర్దిష్ట ఫార్ములా ప్రకారం తయారు చేస్తారు. మాంసం కోసం పెంచే వాటికి, గుడ్ల కోసం పెంచే వాటికి వేర్వేరు రకాల ఫీడ్ ఉంటుంది. చిక్స్ మొదటి మూడు రోజులు కేవలం నూకలు మాత్రమే తినడానికి అలవాటు పడితే, కంపెనీ ఫీడ్ తినడానికి రెండు రోజులు పట్టవచ్చు. కంపెనీ ఫీడ్ తింటే గ్రోత్ త్వరగా వస్తుంది.

నీరు (వాటరింగ్): కోడిపిల్లలకు శుభ్రమైన నీరు అందించడం చాలా అవసరం. నీటిలో కొద్దిగా బెల్లం ముక్క వేసి ఇవ్వడం వల్ల కాల్షియం లభిస్తుంది, తిన్నది త్వరగా జీర్ణం అవుతుంది. కోడిపిల్లలు ఆరోగ్యంగా, చురుకుగా ఉంటాయి. వారానికి రెండు లేదా మూడు సార్లు పసుపు నీళ్లు తాగించడం వల్ల ఇది సహజ యాంటీబయాటిక్‌గా పనిచేసి, రోగనిరోధక శక్తిని పెంచుతుంది. వ్యాక్సిన్‌లు వేయని ఈ కోడిపిల్లలకు ఇది చాలా ఉపయోగపడుతుంది. వాటర్ ఫీడర్‌ను ఉపయోగించడం వల్ల నీరు కలుషితం కాకుండా ఉంటుంది. ఒక ప్లేట్‌పై మరో చిన్న ప్లేట్‌ను బోర్లించి, దాని అంచుల్లో నీరు పోస్తే కోడిపిల్లలు సులభంగా తాగుతాయి. రోజుకు కనీసం మూడు సార్లు నీటిని మార్చాలి.

బ్రూడింగ్: కోడిపిల్లలకు మొదటి 10 నుంచి 12 రోజుల వరకు బ్రూడింగ్ చాలా ముఖ్యం. చలి కాలంలో ఇది తప్పనిసరి. బ్రూడింగ్ అంటే కేజ్ చుట్టూ రేకు లేదా గోనె సంచిని చుట్టి, దాని పైన 60 వాట్స్ బల్బును అమర్చడం. ఈ బల్బు వెలుగు, వేడి కోడిపిల్లలను చలి నుండి రక్షిస్తుంది. వాటిని చురుకుగా ఉండేలా చేస్తుంది. పగటిపూట బ్రూడింగ్ అవసరం లేకపోయినా, రాత్రిపూట తప్పనిసరిగా ఏర్పాటు చేయాలి. బ్రూడింగ్ లేకపోతే కోడిపిల్లలు డల్ అయిపోయి, ఎదుగుదల మందగిస్తుంది.

సంరక్షణ, సవాళ్లు: ఈ కోడిపిల్లలు తల్లి లేకుండా పెంచడం వల్ల మనుషులతో త్వరగా అలవాటు పడతాయి. అయితే, చిన్నపిల్లలు వీటిని ముద్దుగా పట్టుకుని నలిపేసే అవకాశం ఉంది, దీనివల్ల అవి చనిపోవచ్చు. కాకులు, పిల్లులు, కుక్కల వంటి వాటి నుండచి రక్షించడానికి వీటిని కేజ్‌లో ఉంచడం మంచిది. కేజ్‌లో పెంచుతూ, అప్పుడప్పుడు బయట తిప్పడం వల్ల అవి చురుకుగా ఉంటాయి. ఉష్ణోగ్రతలో ఏ మాత్రం తేడా వచ్చినా ఇవి సులభంగా డల్ అయిపోతాయి కాబట్టి, నిరంతరం జాగ్రత్త అవసరం. కాలక్రమేణా వీటి రంగు షేడ్ అయిపోయి, పూర్తి తెల్లగా మారుతాయి. ఇవి లేయర్ హెన్స్‌లా మారతాయి, అంటే ఫారం కోళ్లలాగా కనిపిస్తాయి.

Also Read: గడ్డి వాము వద్ద అదే పనిగా అరుస్తున్న గిన్ని కోళ్లు.. ఏంటా అని వెళ్లి చూడగా..