Internet: ప్రపంచంలో ఇంటర్నెట్‌ అందుబాటులో లేని ప్రదేశం ఏంటో తెలుసా.?

|

Nov 15, 2024 | 10:48 AM

ఇంటర్నెట్‌ లేని దేశం ఏదైనా ఉందా అంటే అస్సలు నమ్మలేని పరిస్థితి ఉంటుంది కదూ! అయితే ఇప్పటికీ ప్రపంచంలో ఓ దేశంలో ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేవని మీకు తెలుసా.? ఇంతకీ ఇంటర్నెట్‌ సేవలు లేని ఆ దేశం ఏది.? అక్కడి ప్రభుత్వం ఆ నిర్ణయాన్ని ఎందుకు తీసుకుంది. లాంటి ఆసక్తికర విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం..

Internet: ప్రపంచంలో ఇంటర్నెట్‌ అందుబాటులో లేని ప్రదేశం ఏంటో తెలుసా.?
No Internet
Follow us on

ప్రస్తుతం ఇంటర్నెట్‌ లేని ప్రపంచాన్ని ఊహించుకోవడం కష్టం. మారుమూల గ్రామాలకు సైతం ఇంటర్నెట్ సేవలు అందుబాటులోకి వచ్చాయి. టెలికంతో పాటు బ్రాడ్‌బ్యాండ్ సేవల ద్వారా ఇంటర్నెట్ లభిస్తోంది. ఇక ఎలాన్‌ మస్క్‌ ఏకంగా శాటిలైట్‌ ఆధారంగా ఇంటర్నెట్‌ అందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతలా ప్రపంచం ఫాస్ట్‌ ఫార్వర్డ్‌లో దూసుకుపోతుంటే ఓ దేశంలో మాత్రం ఇప్పటికీ ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో లేవంటే నమ్ముతారా.?

అవును ప్రపంచంలో 0 శాతం ఇంటర్నెట్‌ను ఉపయోగించే దేశం ఉందని మీకు తెలుసా.? ఆ దేశం మరెదో కాదు ఉత్తర కొరియా. ప్రపంచంలో అత్యంత రహస్యమైన దేశంగా ప్రపంచాన్ని ఈ దేశంగా చెబుతుంటారు. ఈ దేశంలో ఏం జరుగుతుందో ప్రపంచానికి చాలా విషయాలు తెలియదు. ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్‌.. వ్యవహారశైలిపై ప్రపంచవ్యాప్తంగా చర్చ సాగుతుంది. ఇక ఈ దేశంలో ఇంటర్నెట్‌పై నియంత్రణ ఉంటుంది.

సామాన్య ప్రజలకు ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉండదు.ఈ దేశంలో ఇంటర్నెట్‌కు బదులుగా ఇంట్రానెట్‌ అందుబాటులో ఉంటుంది. ఇందులో కేవలం ప్రభుత్వం ఆమోదించిన వెబ్‌సైట్లు, సమాచారం మాత్రమే అందుబాటులో ఉంటుంది. సోషల్‌ మీడియా అనే ప్రస్తావననే ఉండదు. ఉత్తర కొరియా ప్రభుత్వం ఇంటర్నెట్‌ను పరిమితం చేయడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైనవి.. ఇంటర్నెట్‌ ప్రజల మనస్సుల్లో తప్పుడు ఆలోచలను సృష్టిస్తుందని, ఇది పాలనా వ్యవస్థను బలహీనపరుస్తుందని ప్రభుత్వం నమ్ముతుంది.

ప్రపంచంలోని ఇతర దేశాల్లో ఏం జరుగుతుందో తమ దేశ ప్రజలకు తెలియకూడదని ఉత్తర కొరియా ప్రభుత్వం భావిస్తుంది. ఇంటర్నెట్ వల్ల దేశ సంస్కృతి, సంప్రదాయాలకు ముప్పు వాటిల్లుతుందని ప్రభుత్వం భావిస్తోంది. అందుకే ఇక్కడి ప్రజలు ఇంటర్నెట్‌ను ఉపయోగించడాన్ని నిషేధించింది. అయితే ప్రపంచంలో ఎన్నో దేశాలు ఇలాంటి నియంత పాలన నుంచి బయటకు వచ్చాయి. కానీ ఉత్తరకొరియా ప్రజలు మాత్రం ఇంకా ఇలాంటి నిర్భంధాల్లోనే ఉన్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..