Chilli In Eye Home Remedy: కారంపొడి అనుకోకుండా కళ్లలో పడితే నో టెన్షన్.. మంటను ఇలా తొలగించుకోవచ్చు

|

Jan 09, 2023 | 8:45 PM

"సర్వేంద్రియాణాం నయనం ప్రధానం". కళ్ళు మనకు చాలా విలువైనవి. ఇందులో మంట వచ్చినా తట్టుకోలేం.. కారం పడితే ఇంకేమైనా ఉందా.. అది చాలా ఇబ్బందిని కలిగిస్తుంది. కాబట్టి అటువంటి సమయంలో.. మీరు వెంటనే అవసరమైన ఇంటి నివారణలను తీసుకోవాలి.

Chilli In Eye Home Remedy: కారంపొడి అనుకోకుండా కళ్లలో పడితే నో టెన్షన్.. మంటను ఇలా తొలగించుకోవచ్చు
Chili Powder In Your Eyes
Follow us on

మీరు కిచెన్‌లో స్పైసీ ఫుడ్ తయారు చేస్తున్నప్పుడు చాలా సార్లు ఇలా జరుగుతుంది. పొరపాటున మిరపకాయలకు కట్ చేసిన తర్వాత అదే చేతి కళ్లను టచ్ చేస్తే ఇక చూడాలి ఆ మంట మరోలా ఉంటుంది. అటువంటి సమయంలో.. ఏ వ్యక్తి అయినా చాలా కలత చెందుతారు. ఆ మంట నుంచి బయట పడటం అంత ఈజీ కాదు. ఆ బాధ నుంచి బటయ పడేందుకు అన్ని రకాల ప్రయత్నాలు చేస్తే కాని తగ్గదు.  అందుకే “కంటి నలుసు కాలి ముల్లు” అనే సామెత అందుకే వచ్చింది. ఎందుకంటే కళ్లలో కారం పడినప్పుడు కళ్ళు ఎర్రగా మారుతాయి. దాని నుండి నీరు రావడం మొదలవుతుంది. అయితే భవిష్యత్తులో ఇదే జరిగితే అస్సలు ఆందోళన చెందకండి. కొన్ని హోం రెమెడీస్ ద్వారా కళ్లలో చికాకును సులభంగా తొలగించుకోవచ్చు.

అటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మొదట వాష్ బేసిన్ వైపు పరుగెత్తండి. సబ్బుతో లేదా మంచి హ్యాండ్ వాష్ లిక్విడ్‌తో బాగా కడగాలి. ఇప్పుడు మీ కళ్లలో చల్లటి నీళ్లు చల్లుకోండి. ఇలా చేయడం వల్ల బర్నింగ్ సెన్సేషన్ నుంచి త్వరగా ఉపశమనం లభిస్తుంది. కళ్లలో పూసిన మసాలా కూడా కొట్టుకుపోతుంది.

కొన్నిసార్లు ఒకఊదండి..

కళ్ళు మంట చాలా ఎక్కువగా ఉంటే.. అటువంటి పరిస్థితిలో కేవలం నీటితో కడగడం సరిపోదు. ఒక కాటన్ గుడ్డ లేదా శుభ్రమైన టవల్‌ని కొద్దిగా వేడి చేసి కంటిపై నెమ్మదిగా అద్దండి. ఈ విధానాన్ని పదే పదే చేయడం వల్ల మంట తగ్గుతుంది.

పాలతో కడిగేయండి

కళ్లలో కారం పొడి వల్ల కలిగే మంటను తొలగించడానికి పాల ఉపశమనం పొందవచ్చు. మీరు కాటన్ బాల్స్ తీసుకొని పాలలో ముంచి.. తర్వాత కళ్లలో అప్లై చేయాలి. ఈ విధానాన్ని చాలాసార్లు రిపిట్ చేస్తూ ఉండండి. చివరగా కళ్లను శుభ్రమైన నీటితో కడగాలి.

నెయ్యి సహాయం తీసుకోండి..

కంటి చికాకును దేశీ సహాయంతో సులభంగా తొలగించవచ్చు. దీని కోసం, ముందుగా ఒక దూదికి కొన్ని చుక్కల నెయ్యి, చల్లటి నీటిని అప్లై చేసి.. ప్రభావితమైన కళ్లపై కాసేపు ఉంచండి. త్వరలో ఈ సమస్య నుంచి ఉపశమనం పొందుతారు.

మరిన్ని హ్యూమన్ ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం