రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా..? ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా!

వన్ గ్రామ్, రోల్డ్ గోల్డ్ ఆభరణాలు వాడేకొద్దీ తమ సహజ సిద్ధమైన మెరుపును కోల్పోయి నల్లగా మారుతుంటాయి. వీటిని తిరిగి మెరిపించడానికి బయట పాలిష్ చేయించాలంటే డబ్బు ఖర్చుతో కూడుకున్న పని. అయితే, మన వంటగదిలో ఉండే కొన్ని వస్తువులతోనే ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చని తెలిస్తే ఎగిరి గంతేస్తారు. అదేలాగో పూర్తి డిటెల్స్‌ ఇప్పుడు చూద్దాం..

రోల్డ్ గోల్డ్ నగలు నల్లబడ్డాయా..? ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే కొత్తవాటిలా మెరిపించండిలా!
Diy Jewelry Cleaning At Home

Updated on: Apr 20, 2026 | 3:00 PM

సమ్మర్‌ ఎండలు మాత్రమే కాదు.. బంగారం ధరలు కూడా భగ్గుమంటున్నాయి. సామాన్యులకు పసిడి కొనాలంటే షాక్‌ తగేలేలా ఉంది. అందుకే గోల్డ్‌ కొనలేని వారంతా ఇప్పుడు వన్‌గ్రామ్‌ గోల్డ్‌ నగలనే ఎక్కువగా ధరిస్తున్నారు. అయితే, ఈ రోల్డ్ గోల్డ్, వన్ గ్రామ్ బంగారు ఆభరణాలు వాడిన కొద్ది రోజులకే రంగు మారి నల్లబడిపోతుంటాయి. వాటికి తిరిగి పాలిష్‌ చేయించాలంటే ప్రతి సారి డబ్బు ఖర్చుతో కూడుకున్న పని. కానీ, వాటి రంగు మారినా లేదా మెరుపు తగ్గినప్పుడు రూపాయి ఖర్చు లేకుండా ఇంట్లోనే వాటిని కొత్తవాటిలా మెరిపించే సులభమైన పద్ధతి ఇక్కడ ఉంది.

దీనికి కావలసిన పదార్థాలు:

బేకింగ్ సోడా (1 స్పూన్)

ఇవి కూడా చదవండి

నిమ్మరసం (అర చెక్క)

లిక్విడ్ డిటర్జెంట్ లేదా విమ్ (1 స్పూన్)

ఉప్పు (1 స్పూన్)

వెనిగర్ (అర టీ గ్లాస్)

పసుపు (1 టీ స్పూన్)

ఇప్పుడు ఒక స్టీల్ బౌల్ తీసుకుని అందులో మీరు శుభ్రం చేయాలనుకుంటున్న నగలను ఉంచండి. నగలు ఉన్న గిన్నెలో బేకింగ్ సోడా, నిమ్మరసం, డిటర్జెంట్, ఉప్పు, వెనిగర్ వేయండి. వెనిగర్ వేయగానే ఈ మిశ్రమం పొంగుతుంది. ఈ గిన్నెను స్టవ్ మీద పెట్టి సిమ్ నుండి మీడియం మంటలో సుమారు 10 నిమిషాల పాటు ఉడికించాలి. ఉడికించడం మొదలుపెట్టిన 7 నిమిషాల తర్వాత ఒక టీ స్పూన్ పసుపును అందులో కలపాలి. మిగిలిన 3 నిమిషాలు పసుపుతో పాటు ఉడికించాలి.

10 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసి, మిశ్రమం గోరువెచ్చగా అయ్యే వరకు వేచి ఉండాలి. అనంతరం నగలను తీసి స్వచ్ఛమైన నీటిలో ఒకటికి రెండుసార్లు శుభ్రంగా కడగాలి. చివరగా ఒక పొడి కాటన్ వస్త్రంతో నగలను సున్నితంగా తుడవాలి. ఇలా చేయడం వల్ల ఎంత నల్లబడిన లేదా పాచి పట్టిన కృత్రిమ ఆభరణాలైనా అప్పుడే షాపు నుండి కొనుగోలు చేసిన బంగారు నగల్లాగా తళతళలాడతాయి. పసుపు వాడటం వల్ల నగలకు సహజమైన బంగారు ఛాయ వస్తుంది.

ఈ సింపుల్‌ చిట్కా ద్వారా మహిళలు తమ పాత నగలను తక్కువ సమయంలోనే కొత్తవాటిలా మార్చుకోవచ్చు. వారానికోసారి లేదా నగలు రంగు మారుతున్నాయని అనిపించినప్పుడు ఈ పద్ధతిని పాటిస్తే ఆభరణాలు ఎక్కువ కాలం మెరుస్తూ ఉంటాయి.

మరిన్ని హ్యుమన్‌ ఇంట్రెస్ట్‌ వార్తల కోసం క్లిక్ చేయండి..

Loading...
Unable to load recommendations.
Follow Us