ATM నుంచి డబ్బులు డ్రా చేసినప్పుడు చిరిగిపోయిన నోట్లు వచ్చాయా ? అయితే వాటిని ఇలా మార్చుకోవచ్చు..

|

Aug 31, 2021 | 1:21 PM

ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా.. టెక్నాలజీని వాడడంకో భారత ప్రజలు ముందున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ డిజిటల్ మార్కెట్ డిజిటలైజేషన్

ATM నుంచి డబ్బులు డ్రా చేసినప్పుడు చిరిగిపోయిన నోట్లు వచ్చాయా ? అయితే వాటిని ఇలా మార్చుకోవచ్చు..
Atm
Follow us on

ప్రస్తుతం మారుతున్న కాలానికి అనుగుణంగా.. టెక్నాలజీని వాడడంకో భారత ప్రజలు ముందున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా భారతీయ డిజిటల్ మార్కెట్ డిజిటలైజేషన్ జరిగినప్పటి నుంచి ప్రతి పనిని సులభతరం అయింది. ముఖ్యంగా బ్యాంక్ సంబంధించిన పనులు చాలా వరకు సులభమయ్యాయి. మనీ ట్రాన్స్‏ఫర్, విత్ డ్రా వంటి అన్ని చర్యలు డిజిటలైజేషన్ అయ్యాయి. ప్రస్తుతం డబ్బులు కావాలంటే బ్యాంకుకు వెళ్లాల్సిన పనిలేకుండా.. నేరుగా ఏటీఎంకు వెళ్లి నగదు విత్ డ్రా చేస్తున్నారు. ఏటీఎంల వద్ద డబ్బులు తీసుకునే వారి సంఖ్య అధికమయ్యింది. అయితే ఏటీఎం నుంచి డబ్బులు డ్రా చేసినప్పుడు చిరిగిన నోట్లు చాలా సందర్భాల్లో వస్తుంటాయి. అయితే ఆ నోట్లను ఎలా మార్చుకోవాలో చాలా మందికి తెలియదు. ఇలాంటి సమయంలో మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాలి.

చిరిగిన నోట్లను మార్చుకోవడానికి ఏటీఎం నుంచి డబ్బు విత్ డ్రా చేసిన బ్యాంకుకు దరఖాస్తు చేసుకోవాలి. డబ్బు విత్ డ్రా చేసిన ఏటీఎం, తేదీ, విత్ డ్రా స్లిప్ జతచేసిన సమయం, స్థానాన్ని అందులో పేర్కోవలసిన ఉంటుంది. ఒకవేళ ఆ స్లిప్ లేకపోతే.. మీ ఫోన్ లో వచ్చిన మెసేజ్ వివరాలను చూప్సించాల్సి ఉంటుంది. ఆర్బీఐ నిబంధనల ప్రకారం చిరిగిన నోట్లను మార్చలేరు… కానీ వినియోగదారుడి ఫిర్యాదును ట్విట్టర్ ఖాతాలో పేర్కొంటూ.. ఆ సమయంలో కస్టమర్ ఎలాంటి చర్యలు తీసుకోవాలో తెలిపింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోట్లను ఏటీఎంలలో లోడ్ చేసే ముందు అత్యాధునిక నోట్ సార్టింగ్ యాంత్రాల ద్వారా తనిఖీ చేస్తామని మీరు ముందుగా గుర్తించాలి. అందువలన చిరిగిన నోట్లను మార్చలేము. కానీ మీరు వారి సదరు బ్రాంచ్‏ల ద్వారా మార్చుకోవచ్చు అని సూచించింది.

ఇక స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నిబంధనల ప్రకారం సదరు వ్యక్తి చిరిగిన నోట్ల గురించి https://crcf.sbi.co.in/ccf/ జనరల్ బ్యాంకింగ్, నగదు సంబంధిత కేటగిరి కింద ఫిర్యాదు చేయవచ్చు. ఈ లింక్ అనేది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏటీఎం ఫిర్యాదుల కోసం ప్రవేశపెట్టింది. అయితే కొన్నిసార్లు.. ఏటీఎం నుంచి వచ్చిన చిరిగిన నోట్లను కొన్ని బ్యాంకులు మార్చవు. అయితే ఇలా నిబంధనలు ఉల్లంఘించిన బ్యాంకులు, బ్యాంకు ఉద్యోగులపై చర్యలు తీసుకోవడానికి అవకాశాలున్నాయి. కస్టమర్ ఫిర్యాదు ఆధారంగా బ్యాంకు కూడా 10,000 వరకు నష్టపరిహారాన్ని చెల్లించాల్సి ఉంటుంది.

Also Read: Bapu: తెలుగువారి సంస్కృతిలో భాగమయిన బాపు బొమ్మలు.. నేడు బహుముఖ ప్రజ్ఙాశీలుని వర్థంతి.. ఫొటో గ్యాలరీ

Payal Sarkar: డైరెక్టర్ పేరుతో ఆకతాయిల వేధింపులు.. సైబర్ క్రైమ్‏కు ఫిర్యాదు చేసిన హీరోయిన్..

Gautham Ghattamaneni: పుత్రోత్సాహంతో పొంగి పోతున్న సూపర్‌ స్టార్‌.. నువ్వు ఎదగుతున్న తీరు చూడడం నాకెంతో సంతోషాన్నిస్తుంది అంటూ.