Vastu: ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలా.? ఈ వాస్తు లోపాలు ఉండొచ్చు..

|

Nov 04, 2024 | 4:22 PM

వాస్తుకు ఎంతటి ప్రాధాన్యత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వాస్తు కేవలం ఆర్థికంగానే కాకుండా మనిషి ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతనుందని పండితులు చెబుతున్నారు. అందుకే వాస్తు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలని అంటున్నారు. ముఖ్యంగా ఆరోగ్యపరమైన సమస్యలు తగ్గాలంటే ఇంట్లో కొన్ని వాస్తు నియమాలను పాటించాలని అంటున్నారు..

Vastu: ఇంట్లో తరచూ అనారోగ్య సమస్యలా.? ఈ వాస్తు లోపాలు ఉండొచ్చు..
Vastu Tips
Follow us on

ఎలాంటి కారణం లేకుండా ఇంట్లో కొందరికీ నిత్యం అనారోగ్య సమస్యలు వేధిస్తుంటాయి. ఎన్ని రకాల వైద్య పరీక్షలు చేసినా ఏం తేలదు. అదే విధంగా తగ్గినట్లే తగ్గి మళ్లీ మరో సమస్య వేధిస్తుంటుంది. అయితే ఇలా నిత్యం అనారోగ్య సమస్యలు రావడానికి వాస్తు దోషాలు కూడా కారణమవుతాయని పండితులు చెబుతుంటారు. ఇంట్లో కొన్ని దోషాల కారణంగా ఇలా జరుగుతుందని అంటున్నారు. అయితే వాస్తు ప్రకారం కొన్ని సూచనలు పాటించడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ చిట్కాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వంటగదిలో ఉండే వాస్తు దోషాలు కారణంగా అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుందని వాస్తు పండితులు అంటున్నారు. కిచెన్‌ ఎల్లప్పుడూ ఆగ్నేయం దిశలోనే ఉండాలని సూచిస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో ఈశాన్యంలో వంట గది ఉండకూడదు. ఈశాన్యంలో కిచెన్‌ ఉంటే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయని పండితులు చెబుతున్నారు.

* వాస్తు ప్రకారం ఫర్నిచర్‌ లేకపోయినా సమస్యలు వస్తాయని అంటున్నారు. బెడ్ రూమ్‌లో పనికిరాని వస్తువులను అస్సలు పెట్టుకోకూడదు. ముఖ్యంగా బెడ్‌ కింద దేవుళ్ల ఫొటోలు, చనిపోయిన వారి ఫొటోలు పెట్టుకోకూడదని చెబుతున్నారు. బెడ్ రూమ్‌లో మురికిగా ఉన్నా వాస్తు దోషం వెంటాడుతుందని అంటున్నారు. ఇక బెడ్ రూమ్‌ నైరుతులో ఉండేలా చూసుకోవాలి. అలాగే బెడ్ అద్దంలో పడకుండా చూసుకోవాలి.

* పడుకునే దిశ సరిగా లేకపోయినా సమస్యలు తప్పవని అంటున్నారు. వాస్తుప్రకారం మీరు నిద్రించే దిశ ఎప్పుడూ దక్షిణాభిముఖంగా ఉండేలా చూసుకోవాలి. అలాగే మంచం గోడకు కనీసం మూడు నుంచి నాలుగు అంగుళాల దూరంలో ఉండేలా చూసుకోవాలి. ఇక చెక్కతో చేసిన మంచాలను మాత్రమే ఉపయోగించాలి.

* ఇంట్లో గొడవలకు వేసుకునే పెయింట్స్‌ విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. డార్క్‌ కలర్స్‌కు దూరంగా ఉండాలి. వీలైనంత వరకు ప్రతీ గదిలో లైట్‌ కలర్స్‌ వేసుకోవాలి.

* ఇక ఇంట్లో విరిగిన అద్దాలు లేదా కిటికీలు ఉండకుండా చూసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. పగిలిన గ్లాస్ ఐటమ్స్ ఆందోళన, ఒత్తిడి లక్షణాలకు దారి తీస్తాయని అంటున్నారు.

నోట్: పైన తెలిపిన విషాయలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..