AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కుక్కలకు ఆత్మలు కనిపిస్తే ఏం చేస్తాయో తెలుసా..? షాకింగ్ విషయాలు మీకోసం..!

మీ పెంపుడు కుక్క ఒక్కో సారి గాలి లోకి మొరుగుతూ ఖాళీగా ఉన్న చోటునే చూస్తూ.. కొన్ని గదుల్లోకి వెళ్లడానికి భయపడుతుందా..? ఇది మామూలు గా జరిగేది కాదు అని చెప్పే జ్యోతిష్య సంకేతాలు కొన్ని ఉన్నాయి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

కుక్కలకు ఆత్మలు కనిపిస్తే ఏం చేస్తాయో తెలుసా..? షాకింగ్ విషయాలు మీకోసం..!
Dog Strange Behaviour
Prashanthi V
|

Updated on: Jul 31, 2025 | 8:14 PM

Share

పురాతన కాలం నుండి కుక్కలను భూలోకం, ఆత్మలోకం మధ్య వారధిగా చూశారు. చాలా సంస్కృతుల్లో కుక్కలు ఆధ్యాత్మిక శక్తులను గ్రహించగలవని నమ్ముతారు. అంతేకాదు జ్యోతిష్యశాస్త్రం ప్రకారం కొన్ని గ్రహాల కదలికలు ఈ రెండు లోకాల మధ్య తెరను పలచబరుస్తాయి. అప్పుడు ఆత్మల ఉనికి మరింత స్పష్టంగా తెలుస్తుంది. మీ కుక్క వింతగా ప్రవర్తిస్తుంటే.. ఈ ఐదు జ్యోతిష్య సంబంధిత సంకేతాలను ఓసారి గమనించండి.

కేతువు 4వ లేదా 8వ ఇంట్లో తిరిగినప్పుడు

జ్యోతిష్యశాస్త్రంలో కేతువు మోక్షం, బంధరాహిత్యం, ఆత్మవిశ్లేషణకు ప్రతీక. ఈ గ్రహం 4వ ఇంట్లో (ఇల్లు, భావోద్వేగాలు) లేదా 8వ ఇంట్లో (మరణం, రహస్యాలు, మార్పులు) సంచరించినప్పుడు, ఆత్మ సంబంధిత అనుభవాలు పెరుగుతాయి.

ఈ సమయంలో మీ కుక్క ఏం చేస్తుందో తెలుసా..?

  • కొన్ని గదుల్లోకి వెళ్లడానికి ఇష్టపడదు.
  • మూలల్లో లేదా చీకటి ప్రాంతాల్లో మొరుగుతుంది.
  • భయంగా లేదా అసౌకర్యంగా కనిపిస్తుంది.

ఈ గ్రహ సంచారం పాత కర్మలను, మరణం తర్వాత వచ్చే శక్తులను ప్రేరేపిస్తుంది. మీ కుక్క చూపే చిన్నచిన్న ప్రవర్తనలు నిజానికి బలమైన ఆధ్యాత్మిక స్పందనలు కావచ్చు.

అమావాస్య రాత్రులు

భారతీయ క్యాలెండర్ ప్రకారం అమావాస్య అంటే చంద్రుడు కనిపించని రాత్రి నిశ్శబ్దానికి ప్రతీక. ఇది ఆత్మపరిశీలన, విశ్రాంతికి సమయం. కానీ చాలా సంప్రదాయాల్లో ఈ రాత్రిని ఆత్మల కార్యకలాపాలకు అనుకూలమైనదిగా భావిస్తారు.

ఈ సమయంలో మీ కుక్క ఏం చేస్తుందో తెలుసా..?

  • రాత్రిపూట ఎక్కువగా మొరుగుతుంది.
  • నిద్ర పట్టక ఇబ్బంది పడుతుంది.
  • మామూలుగా ఉండే చోట్ల ఉండకుండా దూరంగా ఉంటుంది.

ఈ రోజు పూర్వీకులకు గౌరవం ఇచ్చే సమయం. కుక్కలు శక్తి మార్పులను సహజంగానే గ్రహిస్తాయి. కాబట్టి ఇది ఆత్మల ఉనికిని సూచించవచ్చు.

8వ ఇంట్లో చంద్రుడు ఉన్నప్పుడు

చంద్రుడు మన మనస్సు, భావోద్వేగాలను సూచించే గ్రహం. చంద్రుడు 8వ ఇంట్లో ఉన్నప్పుడు మన లోపలి భయాలు, గతానికి సంబంధించిన లోతైన భావోద్వేగాలు బయటపడతాయి.

ఈ సమయంలో మీ కుక్క ఏం చేస్తుందో తెలుసా..?

  • అకస్మాత్తుగా మొరుగుతుంది.
  • వింతగా ఆందోళనగా లేదా ఇబ్బందిగా కనిపిస్తుంది.
  • ఎక్కువసేపు నిద్ర పట్టక బాధపడుతుంది.

8వ ఇల్లు రహస్య భావాలను బయటపెట్టే శక్తిని కలిగి ఉంటుంది. కుక్కలు ఈ భావోద్వేగ మార్పులను సులభంగా అర్థం చేసుకుంటాయి.

12వ ఇంట్లో రాహువు తిరిగినప్పుడు

రాహువు ఆకర్షణ, మాయ, భ్రమలను సూచించే గ్రహం. ఈ గ్రహం 12వ ఇంట్లో (కలలు, తెలియనివి, మోక్షం) సంచరించినప్పుడు, ఆధ్యాత్మికంగా కొంత గందరగోళం ఏర్పడవచ్చు.

ఈ సమయంలో మీ కుక్క ఏం చేస్తుందో తెలుసా..

  • గదిలో ఏదో శక్తి ఉన్నట్లుగా స్పందిస్తుంది.
  • కొన్ని చోట్ల ఉండటానికి అస్సలు ఇష్టపడదు.
  • నిశ్శబ్దంగా ఉండి కాపలాదారులా ప్రవర్తిస్తుంది.

12వ ఇల్లు భౌతిక ప్రపంచ సరిహద్దులను చెరిపేస్తుంది. రాహువు ఆత్మల ప్రయాణాలను కలపగలడు. ఈ శక్తులను కుక్కలు స్పష్టంగా గుర్తిస్తాయి.

గ్రహణాలు (ముఖ్యంగా చంద్రగ్రహణం)

గ్రహణాల సమయంలో విశ్వంలో సహజ శక్తి ప్రవాహం తగ్గుతుంది. అందుకే చాలా సంప్రదాయాల్లో ఆధ్యాత్మిక పనులు ఆపేస్తారు. ఇది పెంపుడు జంతువుల ప్రవర్తనపై స్పష్టమైన ప్రభావాన్ని చూపుతుంది.

ఈ సమయంలో మీ కుక్క ఏం చేస్తుందో తెలుసా..

  • ఆకాశం వైపు చూసి మొరుగుతుంది.
  • చాలా ఆందోళనగా కనిపిస్తుంది.
  • తిండి తినదు.. నీటిని తాగదు.

చంద్రుడి ప్రభావం మనోభావాలను మారుస్తుంది. గ్రహణం అతని శక్తిని తలకిందులు చేస్తుంది. దీని వల్ల కుక్కలు భయంగా, వింతగా ప్రవర్తించవచ్చు.

మీ కుక్క ఆందోళనగా ఉన్నప్పుడు అది కేవలం భయంగా ఉందని మీరు అనుకోవచ్చు. కానీ కొన్నిసార్లు అది మీకు తెలియని శక్తులను గమనిస్తూ ఉండవచ్చు. పైన చెప్పిన జ్యోతిష్య సంకేతాలను గమనించండి. అప్పుడు మీ పెంపుడు జంతువు ఎందుకు అలా ప్రవర్తిస్తుందో మీకు అర్థమవుతుంది.