జీన్స్.. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆదరణ లభించిన దుస్తుల్లో ఒకటి. యువత మొదలు పెద్దల వరకూ జీన్స్‌ను ఉపయోగిస్తుంటారు. కాలానుగుణంగా జీన్స్ అప్‌డేట్ అవుతూ వచ్చాయి. డిజైన్, స్టైల్స్ మారుస్తూనే వచ్చాయి. అయితే జీన్స్ పాకెట్స్‌పై రాగి బటన్‌లను గమనించే ఉంటాం. అయితే రాగి బటన్స్‌ను మాత్రమే ఎందుకు ఉపయోగిస్తారని ఎప్పుడైనా ఆలోచించారా.? దీని వెనకాల ఓ చారిత్రాత్మక కారణం ఉందని మీకు తెలుసా.? ఇంతకీ జీన్స్‌పై ఉండే ఈ రాగి బటన్స్ అసలు ఉద్దేశం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
జీన్స్‌ను కనిపెట్టిన ఘనత జాకబ్ డేవిస్‌కే దక్కుతుంది. 19వ శతాబ్దం మధ్యలో డేవిస్ వ్యవసాయ కార్మికుల కోసం ధృడమైన ప్యాంటు తయారు చేయాలనుకున్నారు. ఆ సమయంలో వ్యవసాయ కార్మికుల దుస్తులు చిరిగిపోవడాన్ని ఆయన గమనించాడు. ముఖ్యంగా బరువైన వస్తువులను జేబులో వేసుకోవడం వల్ల జేబుల చుట్టూ చిరగడాన్ని గమనించిన ఆయ.. ఈ సమస్యకు పరిష్కారం దిశగా ఆ నిర్ణయం తీసుకున్నాడు.
జేబు దృఢంగా ఉండేందుకు గాను డేవిస్ రాగి రివెట్‌లను ఉపయోగించడం ప్రారంభించాడు. దీంతో పాకెట్ చిరగకుండా రాగి బటన్స్ అడ్డుకున్నాయి. అయితే ఇందుకోసం రాగి బటన్స్‌ను మాత్రమే ఉపయోగించడానికి కారణం కూడా ఉందడోయ్. సాధారణంగా రాగి తుప్పు పట్టదు. దుస్తులను నీటిలో శుభ్రం చేస్తుంటారు. అయితే స్టీల్ బటన్స్ ఉండే అవి తుప్పు పట్టి పాడయ్యే ప్రమాదం ఉంటుంది. అందుకే రాగి బటన్స్‌ను ఉపయోగించారు. ఇలా కాల క్రమేణా జీన్స్ ప్యాంట్లకు రాగి బటన్స్ ఉపయోగించడం ఒక ఆనవాయితీగా వస్తోంది.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..