ఇంట్లో ఒకరి దుస్తులు మరొకరు వేసుకోవడం సర్వసాధారణమైన విషయం. కేవలం ఇంట్లో వారివి మాత్రమే కాకుండా బంధువుల దుస్తులు కూడా వేసుకుంటుంటాం. ముఖ్యంగా చిన్న పిల్లలకు వేరే వారి దుస్తులను ఎక్కువగా వేస్తుంటారు. అయితే ఇలా ఇతరులు దుస్తులు వేసుకోవడం మంచిదేనా.? దీనివల్ల ఎలాంటి ఫలితాలు వస్తాయి.? లాంటి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం..
మనం ధరించే దుస్తులకు, మనకు మధ్య ఒక రకమైన ఎనర్జీ క్రియేట్ అవుతుంది. అందుకే ఒకరి దుస్తులు మరొకరి వేసుకోవద్దని పండితులు చెబుతున్నారు. ఇలా ఇతరుల దుస్తులను వేసుకోవడం వల్ల ప్రతికూల ప్రభావం ఏర్పడే అవకాశం ఉంటుందని అంటున్నారు. ఇక మన పాత దుస్తులను కూడా ఇతరులకు ఇవ్వడం మంచిది కాదని చెబుతున్నారు.
ఒకవేళ తప్పనిసరిగా మీరు ఇతరుల దుస్తులు వాడాల్సి వస్తే కొన్ని రకాల చిట్కాలను పాటించాలని చెబుతున్నారు. ఇందుకోసం ముందుగా ఒక బకెట్‌లో నీటిని తీసుకొని దాంట్లో ఉప్పు వేయాలి. ఆ తర్వాత దుస్తులను ఒక రోజు మొత్తం నానబెట్టి, తర్వాతి రోజు శుభ్రంగా ఉతకాలి. ఆ తర్వాత ఎండలో ఆరబెట్టి వేసుకుంటే కొంతలో కొంత దోషాలు తొలగిపోతాయని పండితులు సూచిస్తున్నారు. ఇలా చేయడం వల్ల దుస్తుల నుంచి మనుషులకు ఉండే బాండింగ్ బ్రేక్ అవుతుందని అంటారు.
ఇక దుస్తులను దానం చేసే విషయంలో కూడా పలు రకాల జాగ్రత్తలు తీసుకోవాలని పండితులు చెబుతున్నారు. దుస్తులను ఎవరికైనా దానం చేసే ముందు కూడా వాటిని ఉప్పు నీటిలో ఉతికిన తర్వాతే ఇవ్వాలని చెబుతున్నారు. ఇక నిపుణుల అభిప్రాయం ప్రకారం దుస్తులను గురువారం దానంగా ఇవ్వకూడదని అంటున్నారు. అలాగే దుస్తులను ఇచ్చే సమయంలో డబ్బులు తీసుకోవడం కూడా మంచిది కాదని అంటున్నారు. ఇలాంటి కొన్ని చిట్కాలను పాటించాలని సూచిస్తున్నారు.
మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..