Dream: కలలో మద్యం తాగినట్లు కనిపించిందా.. అర్థం ఏంటో తెలుసా.?

|

Oct 05, 2024 | 6:05 PM

మీరు స్నేహితులతో సరదాగా బీర్‌ను షేర్‌ చేసుకుంటే నియంత్రణతో ఆల్కహాల్ సేవిస్తున్నట్లు కలల కనిపిస్తే. అది మంచికి సంకేతమని భావించాలి. రాబోయే విజయానికి ఇది సంకేతంగా చెప్పొచ్చు. త్వరలోనే మీకు ఏదో మంచి జరగబోతోందని అర్థం చేసుకోవచ్చు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే ముందు ఇలాంటి కలలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు...

Dream: కలలో మద్యం తాగినట్లు కనిపించిందా.. అర్థం ఏంటో తెలుసా.?
Dream
Follow us on

కలలు రావడం సర్వసాధారణమైన విషయం. దాదాపు ప్రతీ ఒక్కరికీ ఏదో ఒక సమయంలో కలలు వచ్చే ఉంటాయి. అయితే మన ప్రమేయం లేకుండా వచ్చే కలలకు ఎన్నో అర్థాలు ఉన్నాయని మీకు తెలుసా.? స్వప్న శాస్త్రం ప్రకారం కలలో వచ్చే ఒక్కో అంశానికి ఒక్కో అర్థం ఉంటుంది. అలాంటి ఒక కల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ మీకు కలలో ఆల్కహాల్‌ సేవిస్తున్నట్లు, లేదా బార్‌లో కూర్చొని ఆల్కహాల్‌ సేవిస్తున్నట్లు కలలో కనిపిస్తే. అది దేనికి సంకేతమంటే..

మీరు స్నేహితులతో సరదాగా బీర్‌ను షేర్‌ చేసుకుంటే నియంత్రణతో ఆల్కహాల్ సేవిస్తున్నట్లు కలల కనిపిస్తే. అది మంచికి సంకేతమని భావించాలి. రాబోయే విజయానికి ఇది సంకేతంగా చెప్పొచ్చు. త్వరలోనే మీకు ఏదో మంచి జరగబోతోందని అర్థం చేసుకోవచ్చు. విజయాన్ని సెలబ్రేట్ చేసుకునే ముందు ఇలాంటి కలలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇక ఒళ్లు మరిచి తాగినట్లు కలలో కనిపిస్తే మాత్రం అలర్ట్‌ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. అనాలోచిత నిర్ణయాలు తీసుకోకూడదు. జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించాలి.

బాగా మద్యం సేవిస్తున్నట్లు కలలో కనిపిస్తే మీలో అణిచివేసుకున్న ఎమోషన్స్‌కు ప్రతిబింబంగా చెప్పొచ్చు. మనసులో ఏవైనా భావోద్వేగాలను దాచుకుంటే కలలో మద్యం సేవిస్తున్నట్లు కనిపిస్తాయని అంటున్నారు. మూలన కూర్చుని మద్యం సేవిస్తున్నట్లు కల వచ్చినా, ఒంటరిగా కూర్చొని మద్యం సేవిస్తున్నట్లు కలలో కనిపించినా మీరు ఒంటరితనంతో ఇబ్బందిపడుతున్నారని అర్థం చేసుకోవాలి. మీరు కుటుంబం, స్నేహితులు లేదా మీ సొంత అంతరంగం నుండి కూడా డిస్‌కనెక్ట్ అయినట్లు అర్థం చేసుకోవాలి.

ఇక కలలో ఒకవేళ వైన్ షాప్‌ కనిపిస్తే మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఇలా కనిపిస్తే అప్పులు పెరిగే అవకాశం ఉంటుందని అంటున్నారు. వ్యాపారంలో నష్టపోయే అవకాశాలు కూడా ఉంటాయని అర్థం. అదే విధంగా ఆర్థిక సంక్షోభం ఎదుర్కునే అవకాశాలు ఉంటాయని అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలని అంటున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు పలువురు నిపుణుల అభిప్రాయాల మేరకు అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..