Rain: వర్షం కురిసే ముందే వచ్చే వాసనకు అసలు కారణం ఏంటో తెలుసా.?

|

Nov 04, 2024 | 5:13 PM

వర్షం కురిసే ముందు వచ్చే మట్టి వాసన ఎంత బాగుంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ వాసనను మాటల్లో వర్ణించలేము. అయితే ఇంతకీ ఈ వాసన రావడానికి అసలు కారణం మట్టి కాదని మీకు తెలుసా.? అవును ఈ వాసనకు మట్టి కాకుండా మరో కారణం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ ఆకారణం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

Rain: వర్షం కురిసే ముందే వచ్చే వాసనకు అసలు కారణం ఏంటో తెలుసా.?
Rain Smell
Follow us on

తొలకరి చినుకులు వస్తున్నాయంటే ఆ మజానే వేరుగా ఉంటుంది. మరీ ముఖ్యంగా వర్షం వచ్చే ముందు, వర్షం పడడం ప్రారంభం కాగానే వచ్చే మట్టి వాసన మాటల్లో వర్ణించలేము. ఇప్పుడైతే అన్నీ కాంక్రీట్ రోడ్ల కారణంగా మట్టి లేకుండా పోయింది. కానీ ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం కురిసే ముందు అదే మట్టి పరిమళం వెదజల్లుతుంటుంది. ఇంతకీ వర్షం కురిసే ముందు మంటి వాసన రావడానికి అసలు కారణం ఏంటో ఎప్పుడైనా ఆలోచించారా.? ఈ వివరాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

వర్షం కురిసే ముందు వచ్చే మట్టి వాసన ఎంతో బాగుంటుంది. సాధారణంగా అయితే మట్టి నీటితో కలవడం వల్ల ఈ వాసన వస్తుందని మనమంతా భావిస్తుంటాం. అయితే నిజానికి వాసనకు, మట్టికి ఎలాంటి సంబంధం లేదని మీకు తెలుసా.? అవును నిజమే.. ఆ వాసనకు మట్టికి సంబంధం లేదని నిపుణులు చెబుతున్నారు. వర్షం కురిసే ముందు వాసన రావడానికి ఒక బ్యాక్టీరియా కారణమని నిపుణులు చెబుతున్నారు. యాక్టినోమోసైట్స్ అనే వర్గానికి చెందిన స్టరెప్టోమీసైట్స్ అనే బ్యాక్టీరియా కారణంగానే ఈ వాస్తన వస్తుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.

వర్షం కురిసే సమయంలో ఈ బ్యాక్టీరియా సువాసనను వెధజల్లుతుందని చెబుతుంటారు. అయితే ఈ వాసన మరీ ముఖ్యంగా వేడి వాతవరణం ఉన్న మట్టిలో ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు. దీనికి కారణం ఇలాంటి మట్లిలో ఆ బ్యాక్టీరియా ఎక్కువగా ఉండడమే. సాధారణ సమయంలో కాకుండా కేవలం వర్షం కురిసే సమయంలో ఈ వాసనను వెదజల్లుతాయి. తొలకరి వర్షం కారణంగా ఈ సూక్ష్మజీవులు మీథైల్ ఐసో బోర్నీయోల్, జయోస్మిన్ వంటి రసాయనాలను వదులుతాయి. దీనినే మనం మట్టి వాసనగా భావస్తామని అంటున్నారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్ చేయండి..