Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులు కచ్చితంగా ఉండాల్సిందే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే

|

Jul 07, 2024 | 9:34 PM

వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులకు కూడా వర్తిస్తుందని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంట్లో కుటంబ సభ్యుల మధ్య తత్సంబంధాలు ఉండాలన్నా, ఆరోగ్యాలు బాగుండాలన్నా.....

Vastu Tips: ఇంట్లో ఈ వస్తువులు కచ్చితంగా ఉండాల్సిందే.. వాస్తు శాస్త్రం ఏం చెబుతోందంటే
Vastu
Follow us on

వాస్తు అనేది కేవలం ఇంటి నిర్మాణానికి మాత్రమే పరిమితం కాదని, ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువులకు కూడా వర్తిస్తుందని పండితులు చెబుతుంటారు. ముఖ్యంగా ఇంట్లో ఏర్పాటు చేసుకునే వస్తువుల విషయంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని చెబుతున్నారు. ఇంట్లో కుటంబ సభ్యుల మధ్య తత్సంబంధాలు ఉండాలన్నా, ఆరోగ్యాలు బాగుండాలన్నా, ఆర్థిక పరిస్థితులు మెరుగ్గా ఉండాలన్నా కచ్చితంగా కొన్ని రకాల వస్తువులను ఇంట్లో పెట్టుకోవాలని చెబుతున్నారు. ఇంతకీ ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన ఆ వస్తువులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

* వాస్తు పండితుల అభిప్రాయం ప్రకారం ఇంట్లో కచ్చితంగా ఉండాల్సిన వస్తువుల్లో నెమలి ఈక ఒకటి. దీనివల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ పెరుగుతుంది. హాల్‌లో అందరికీ కనిపించేలా నెమలి ఈకను పెట్టుకోవాలి. అయితే ఎట్టి పరిస్థితుల్లో బెడ్‌రూమ్‌లో మాత్రం పెట్టుకోకూడదు.

* ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరిగి, అన్ని పరిస్థితులు అనుకూలించాలంటే అక్వేరియంను ఏర్పాటు చేసుకోవాలి. ఈశాన్యం లేదా తూర్పు దిశలో అక్వేరియం ఏర్పాటు చేసుకోవడం వల్ల ఇంట్లో ఉండే వారికి ఒత్తిడి దూరమవుతుంది, మానసిక సమస్యలు ఉంటే తొలగిపోతాయి.

* ఇంట్లో కచ్చితంగా తులసి మొక్క ఉండేలా చూసుకోవాలి. హిందువులు దైవంగా భావించే తులసిని ప్రతీ రోజూ పూజిండచం వల్ల ఆర్థికంగా బలోపేతమవుతారని వాస్తు పండితులు చెబుతున్నారు. హిందూ పురాణాల ప్రకారం తులసి ఇంట్లో ఉంటే ఆ ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఎప్పటికి ఉంటుంది. తూర్పు దిశలో తులసి మొక్క ఏర్పాటు చేసుకుంటే మంచి జరుగుతుంది.

* ఇక ఇంట్లో తాబేలు బొమ్మ పెట్టుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. దీనివల్ల ఇంట్లో నెగిటివిటీ తొలగిపోతుంది ఆరోగ్యం అదృష్టానికి కూడా తీసుకువస్తుంది.

* ఇంట్లో పాజిటివ్‌ ఎనర్జీ పెరగాలంటే విండ్‌ చైమ్స్ ఏర్పాటు చేసుకోవాలని వాస్తు పండితులు చెబుతున్నారు. వీటి నుంచి వచ్చే శబ్ధం ఇంట్లో ఉన్న వారి మానసిక స్థితిని మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

* ఇంట్లో ఎలాంటి అశాంతి లేకుండా. మానసికంగా ప్రశాంతంగా ఉండాలంటే బుద్ధుని విగ్రహం లేదా పోస్టర్‌ను వేసుకోవాలి. హాల్‌లో నిత్యం కనిపించే ప్రదేశంలో బుద్ధుడి ఫొటో ఏర్పాటు చేసుకుంటే సుఖ, సంతోసాలు వెళ్లి విరుస్తాయి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. ఇందులో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం క్లిక్‌ చేయండి..