Facts Octopus: అక్టోపస్‌కు 9 మెదడులు ఉంటాయని మీకు తెలుసా? మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..

|

Nov 22, 2021 | 6:10 AM

Facts Octopus: సముద్ర జీవుల గురించి మాట్లాడితే ఆక్టోపస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అయితే, దానికి ముందు మీరు అక్టోపస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అందుకోసం

Facts Octopus: అక్టోపస్‌కు 9 మెదడులు ఉంటాయని మీకు తెలుసా? మరిన్ని ఇంట్రస్టింగ్ విషయాలు మీకోసం..
Octopus
Follow us on

Facts Octopus: సముద్ర జీవుల గురించి మాట్లాడితే ఆక్టోపస్ గురించి ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. అయితే, దానికి ముందు మీరు అక్టోపస్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలి అందుకోసం దాని ఫోటోలను పరిశీలించడం ఉత్తమం. చూడటానికి దీని రూపం వింతంగా ఉంటుంది. ఆ రూపమే దానికి ప్రత్యేక గుర్తింపునిచ్చింది. సముద్ర జీవులన్నింటిల్లో ఈ జీవి ప్రత్యేకమైనది. దీనిలో విచిత్ర లక్షణాలు ఉన్నాయి. అవేంటో తెలిస్తే మీరు కచ్చితంగా షాక్ అవుతారు. మరి ఆక్టోపస్‌లో ఉన్న ప్రత్యేకతలేంటో ఇప్పుడు తెలుసుకుందాం..

1. ఈ జీవిలో మీరు చూసే చేతులు దాని కాళ్ళు కావు. చాలా మంది దాని కాళ్ళు అని అనుకుంటారు. కానీ కాదు. దాని ప్రతి చేతిలో ఒక మెదడును కలిగి ఉంటుంది. మొత్తంగా ఇది 9 మెదడులను కలిగి ఉంటుంది.
2. అంటే, ఒక ప్రధాన మెదడు, ఎనిమిది చేతుల్లో మరో ఎనిమిది మెదడులను కలిగి ఉంటుంది. ఇది మాత్రమే కాదు, ఆక్టోపస్ శ్వాసను నియంత్రించడానికి మూడు హృదయాలను కలిగి ఉంటుంది. దీంతో పాటు, దాని రక్తం కూడా నీలం రంగులో ఉంటుంది. అందుకే అక్టోపస్ ఇతర జీవుల కంటే పూర్తి భిన్నమైనది అని చెబుతారు.
3. దీనికున్న చేతులు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇతర జీవి నుండి తనను తాను రక్షించుకోవడానికి ప్రతి వైపు ఒక కన్ను వేసి ఉంచుతుంది. కానీ, ఆక్టోపస్ తన మనసుకు అనుగుణంగా పర్యావరణం లేకపోతే.. విసుక్కుంటుంది. ఆ క్రమంలో తన చేతులను తానే కొరుక్కుంటుంది.
4. ఇది సముద్రంలో నివసించగలదు. ఇంట్లోనూ నివసించగలదు. అయితే, బాటిల్ ఉన్నా, పెట్టె ఉన్నా, రాళ్ల మధ్య కాస్త ఖాళీ ఉన్నా దానినే తన ఇల్లుగా మార్చుకుంటుంది ఆక్టోపస్. ఇది బతకడానికి ఒక మూల కావాలంతే.
5. ఆక్టోపస్ స్వతహాగా చాలా ప్రత్యేకమైనది. కానీ దాని జీవిత కాలం పెద్దగా లేదు. అక్టోపస్‌లు 6 నెలల్లో చనిపోతాయి. అంటే వాటి వయస్సు 6 నెలలు అన్నమాట.

Also read:

Viral Video: ఫోన్‌ వాడటం మొదలెడితే.. మాకన్న ఎవరూ వాడలేరంటున్న కోతులు.. ఫన్నీ వీడియో

Beware: ఫ్రీజ్‌లో ఆ 8 ఆహార పదార్థాలను ఎప్పుడూ ఉంచవద్దు.. ఎందుకో తెలిస్తే షాకే..

AP Rains: ప్రయాణికులకు అలెర్ట్‌.. భారీ వర్షాల కారణంగా 18 రైళ్లు రద్దు.. పలు సర్వీసులు దారి మళ్లింపు..