AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Side Effects: నోటికి కమ్మగా అనిపించినా.. మామిడి పండు, పెరుగు కాంబినేషన్ తెచ్చే హెల్త్ రిస్క్స్ ఇవే!

ఎండలు మండిపోయే వేసవి కాలంలో చల్లచల్లని పెరుగు, తీపి తీపి మామిడి పండ్లు.. ఈ రెండూ అమృతంలా అనిపిస్తాయి. చాలామంది మామిడి పండు ముక్కలను పెరుగులో కలుపుకుని తినడానికి, లేదా 'మ్యాంగో లస్సీ', 'మ్యాంగో స్మూతీస్' లాంటివి తాగడానికి అమితంగా ఇష్టపడతారు. అయితే, నాలుకకు ఎంతో రుచిగా అనిపించే ఈ కాంబినేషన్ మీ శరీరానికి మాత్రం తీవ్రమైన నష్టాన్ని కలిగిస్తుందని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం కొన్ని ఆహార పదార్థాలను కలిపి తీసుకోకూడదు. వాటినే 'విరుద్ధ ఆహారం' అంటారు.

Side Effects: నోటికి కమ్మగా అనిపించినా.. మామిడి పండు, పెరుగు కాంబినేషన్ తెచ్చే హెల్త్ రిస్క్స్ ఇవే!
Mango And Curd Combination Side Effects
Bhavani
|

Updated on: May 27, 2026 | 7:30 PM

Share

ఆరోగ్య నిపుణులు ఆయుర్వేద నిపుణుల ప్రకారం.. ప్రతి ఆహార పదార్థానికి ప్రత్యేకమైన గుణం, స్వభావం జీర్ణక్రియ అనంతర ప్రభావం ఉంటాయి. విభిన్న స్వభావాలు ఉన్న రెండు పదార్థాలను కలిపి తిన్నప్పుడు జీర్ణవ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. ఈ విరుద్ధ ఆహారాల జాబితాలో మామిడి-పెరుగు కాంబినేషన్ కూడా ఒకటి. ఈ రెండింటినీ కలిపి తీసుకోవడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయి, ఎలాంటి అనారోగ్య సమస్యలు వస్తాయో ఇప్పుడు చూద్దాం.

మామిడి, పెరుగు కలిపి తింటే వచ్చే నష్టాలు ఇవే:

1. టాక్సిన్స్ (విషపూరిత వ్యర్థాలు) పేరుకుపోవడం: మామిడి పండు శరీరంలో వేడిని కలుగజేస్తుంది. పెరుగు శరీరానికి చలవ చేస్తుంది. ఈ వేడి, చలవ చేసే విరుద్ధ గుణాలు కలిగిన ఆహారాలను ఒకేసారి తిన్నప్పుడు మన శరీరంలోని జీర్ణక్రియ మందగిస్తుంది. దీనివల్ల ఆహారం సరిగ్గా అరగక శరీరంలో ‘ఆమ్లం’ అంటే విషపూరిత వ్యర్థాలు లేదా టాక్సిన్స్ పేరుకుపోతాయి.

2. చర్మ సమస్యలు మొటిమలు: ఈ కాంబినేషన్ వల్ల శరీరంలో ‘పిత్త’, ‘కఫ’ దోషాలలో అసమతుల్యత ఏర్పడుతుంది. రక్తంలో టాక్సిన్స్ పెరిగిపోవడం వల్ల చర్మంపై ఎలర్జీలు, దద్దుర్లు, దురదలు మరియు ముఖంపై విపరీతంగా మొటిమలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చర్మం త్వరగా నూనెగా మారుతుంది.

3. జీర్ణక్రియ లోపాలు : ఈ రెండు పదార్థాలు కలిసి కడుపులో కిణ్వ ప్రక్రియకు గురవుతాయి. దీనివల్ల సున్నితమైన జీర్ణవ్యవస్థ ఉన్నవారిలో కడుపు ఉబ్బరం, గ్యాస్, ఎసిడిటీ మరియు కడుపులో మంట వంటి ఇబ్బందులు తలెత్తుతాయి. కొంతమందిలో వికారం, వాంతులు కూడా కావచ్చు.

4. జలుబు, దగ్గు తీవ్రమవడం: ఆయుర్వేదం ప్రకారం చల్లటి పెరుగుతో తీపి పండ్లను కలపడం వల్ల శరీరంలో కఫం పెరుగుతుంది. ఇప్పటికే జలుబు, దగ్గు, సైనస్ లేదా ఉబ్బసం వంటి శ్వాసకోశ సమస్యలతో బాధపడేవారు ఈ కాంబినేషన్ తింటే ఆ సమస్యలు మరింత తీవ్రమవుతాయి.

నిపుణులు ఇచ్చే సలహా ఏంటంటే: మామిడి పండ్లు, పెరుగు ఆరోగ్యానికి ఎంతో మేలు చేసేవే అయినప్పటికీ, వాటిని విడివిడిగా తీసుకోవడమే మంచిది. మామిడి పండు తిన్న తర్వాత కనీసం 30 నుండి 45 నిమిషాల గ్యాప్ ఇచ్చి పెరుగు లేదా మజ్జిగ తీసుకోవడం సురక్షితం.

గమనిక : ఇది కేవలం సమాచారం మాత్రమే. పైన పేర్కొన్న అంశాలు ఆయుర్వేద నిపుణుల నివేదికలు, ఆరోగ్య విశ్లేషణలు మరియు ఇంటర్నెట్ సమాచారం ఆధారంగా అందించబడ్డాయి. చర్మ లేదా జీర్ణసంబంధిత సమస్యలు ఉన్నవారు ఏదైనా ఆహార నియమాలను మార్చుకునే ముందు డాక్టర్ లేదా డైటీషియన్‌ను సంప్రదించడం శ్రేయస్కరం. దీనికి సంస్థ ఎలాంటి బాధ్యత వహించదు.

Follow Us
పెరుగన్నంలో మామిడిపండు వేసుకుని తింటున్నారా?.. ఎంత డేంజరో..
పెరుగన్నంలో మామిడిపండు వేసుకుని తింటున్నారా?.. ఎంత డేంజరో..
ఐపీఎల్‌లో ఎంత బాదినా భారత జట్టులో పటిదార్‌కు చోటు కష్టమే ?
ఐపీఎల్‌లో ఎంత బాదినా భారత జట్టులో పటిదార్‌కు చోటు కష్టమే ?
మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్‏గా నేనే చేయాల్సింది.. కానీ..
మిస్టర్ ఫర్ఫెక్ట్ సినిమాలో హీరోయిన్‏గా నేనే చేయాల్సింది.. కానీ..
పాన్ ప్రియులరా హెచ్చరిక! కిళ్లీ అందరికీ సెట్ కాదు,వీరికి డేంజర్
పాన్ ప్రియులరా హెచ్చరిక! కిళ్లీ అందరికీ సెట్ కాదు,వీరికి డేంజర్
టాలీవుడ్‏లో ఆ ముగ్గురు హీరోలు అంటే చాలా ఇష్టం..
టాలీవుడ్‏లో ఆ ముగ్గురు హీరోలు అంటే చాలా ఇష్టం..
అప్పుల బాధతో భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
అప్పుల బాధతో భార్య పిల్లలతో కలిసి ఆత్మహత్య చేసుకున్న వ్యక్తి
రాసిపెట్టుకోండి.. హైదరాబాద్‌పై బుడ్డోడు రెచ్చిపోవడం ఖాయమట..!
రాసిపెట్టుకోండి.. హైదరాబాద్‌పై బుడ్డోడు రెచ్చిపోవడం ఖాయమట..!
ప్రేమ వల్ల చదువు పాడవుతోందా?.. లవర్స్ కు అదిరిపోయే టిప్..
ప్రేమ వల్ల చదువు పాడవుతోందా?.. లవర్స్ కు అదిరిపోయే టిప్..
కుస్తీలు పడే పనిలేదు.. ఈ చిట్కాలతో క్షణాల్లో వెల్లుల్లి వలవొచ్చు
కుస్తీలు పడే పనిలేదు.. ఈ చిట్కాలతో క్షణాల్లో వెల్లుల్లి వలవొచ్చు
తాతతో ఆ ఏడాది బంధం జన్మజన్మల జ్ఞాపకం
తాతతో ఆ ఏడాది బంధం జన్మజన్మల జ్ఞాపకం