మెడ భాగంలో బటర్ ఫ్లై ఆకారంలో ఉండే థైరాయిడ్ గ్రంథి అనేక శారీరక విధులకు కీలకంగా పనిచేస్తుంది. మెట్టబోలిజంను ఇంప్రూవ్ చేయడంలో ఎనర్జీ లెవెల్స్ కంట్రోల్ చేయడంలో పాటు మిగతా శరీరా అవయవాళ్ళ పనితీరులో కీ రోల్ పోషిస్తుంది. అందుకే ఈ థైరాయిడ్ గ్రంధికి ఏమైనా అయితే ఓవరాల్ హెల్త్‌పై ఎఫెక్ట్ పడుతుంది. థైరాయిడ్ హార్మోన్‌ని రిలీజ్ చేసే ఈ గ్రంధి సరిగా పనిచేయకపోతే హైపోథైరాయిడిజం సమస్యకు దారితీస్తుంది.
ఈ థైరాయిడ్ సమస్యకు పరిష్కారం కోసం చాలామంది వివిధ రకాల మెడిసిన్స్ ఎప్పటికప్పుడు వాడుతూనే ఉంటారు. కానీ పెద్ద ఖర్చ లేకున్నా కేవలం కొత్తిమీర ద్వారా థైరాయిడ్ సమస్యకు చెక్ పెట్టొచ్చని నిపుణులు చెప్తున్నారు. వంటలో గార్నిష్ చేయడానికి కొత్తిమీర ఎక్కువగా వాడుతుంటాం. ఇది వంటలకు స్పెషల్ ఫ్లేవర్ అందించడంతోపాటు హెల్త్‌కి బెనిఫిట్స్ అందిస్తుంది కూడా. దీనిలో కీలకమైన విటమిన్లు.. ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. థైరాయిడ్ హార్మోన్ లెవెల్స్ బ్యాలెన్స్ చేయడంలో ఇవి ముఖ్యమైన పాత్ర పోషిస్తాయి. అందుకే థైరాయిడ్ సమస్యకు కొత్తిమీర పవర్ఫుల్ రెమిడీగా పనిచేస్తుంది.
కొత్తిమీరను వివిధ రకాలుగా డైట్లో చేర్చుకోవచ్చు. రెగ్యులర్‌గా చేసే వంటల్లో యాడ్ చేసుకుంటే ప్రయోజనం ఉంటుంది. అయితే కూరల్లో మిగతా మసాలాలు కూడా ఉంటాయి కాబట్టి అవి కొత్తిమీర ప్రభావాన్ని కాస్త తగ్గించే అవకాశం లేకపోలేదు. అందుకే కొత్తిమీర బెనిఫిట్స్ నేరుగా పొందేందుకు కొన్ని టిప్స్ పాటించాలి. కొత్తిమీర పేస్టుతో మంచి ప్రయోజనాలు పొందవచ్చు. కొత్తిమీర పేస్టుని గోరువెచ్చని నీటిలో కలిపి తాగాలి. ప్రతిరోజు ఈ డ్రింక్ ఓ గ్లాస్ తాగితే థైరాయిడ్ ఆరోగ్యం బాగుపడుతుంది. కొత్తిమీరతో చాయ్ చేసుకుంటే థైరాయిడ్ గ్రంథి ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెబుతున్నారు. కొత్తిమీర ఆకులను నీటిలో వేసి మరిగించి చల్లారిన తర్వాత వడగట్టి తాగవచ్చు.
కొత్తిమీర ఆకులకు బదులుగా వాటి విత్తనాలు తింటే అవే బెనిఫిట్స్ పొందవచ్చు. ఓ నెలపాటు ఇలా చేస్తే మరిన్ని ప్రయోజనాలు అందుతాయి ఎలాంటి మెడికల్ ఖర్చు లేకుండా సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా సింపుల్‌గా థైరాయిడ్ సమస్యకు చెప్పే సొల్యూషన్ ఇదని నిపుణులు సూచిస్తున్నారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
(నోట్: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)