Copper Vessel Benefits: రాగి పాత్రలో ఉంచిన నీరు తాగితే మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..

|

Apr 16, 2022 | 6:00 AM

పురాతన కాలంలో దాదాపు అందరు మట్టి పాత్రలు, రాగి(Copper) పాత్రలు వాడే వారు. కానీ క్రమంగా అభివృద్ధి చెందుతున్నాకొద్ది స్టీల్, ప్లాస్టిక్‌ కొత్తగా వచ్చి చేరాయి...

Copper Vessel Benefits: రాగి పాత్రలో ఉంచిన నీరు తాగితే మంచిదేనా.. నిపుణులు ఏం చెబుతున్నారు..
Copper Vessel
Follow us on

పురాతన కాలంలో దాదాపు అందరు మట్టి పాత్రలు, రాగి(Copper) పాత్రలు వాడే వారు. కానీ క్రమంగా అభివృద్ధి చెందుతున్నాకొద్ది స్టీల్, ప్లాస్టిక్‌ కొత్తగా వచ్చి చేరాయి. ముఖ్యంగా ముఖ్యంగా ప్లాస్టిక్‌(Plastic) వల్ల మన ఆరోగ్యానికి మంచిది కాదు. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం(Health)పై శ్రద్ధ పెరుగుతుండడంతో మళ్లీ రాగి పాత్రలు వాడడం మొదలు పెడుతున్నారు. ముఖ్యంగా తాగునీరును రాగి సీసాల్లో నిల్వ చేసుకుంటున్నారు. అయితే ఈ రాగి పాత్రలను ఉపయోగించడం వల్ల మానవులకు ఎలాంటి హానికరమైన రోగాలు రాకుండా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం ఈ రాగి పాత్రలను ఉపయోగించి వంటలను వండుతున్నారు.

ప్రస్తుతం చాలా మంది రాత్రంతా నీటిని రాగి పాత్రల్లో నిల్వ ఉంచుకొని ఉదయాన్నే తాగుతున్నారు. ఎందుకిలా తాగుతున్నారని చాలా మందిలో ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అయితే రాత్రి రాగి పాత్రల్లో నీటిని నిల్వ ఉంచి ఉదయాన్నే తాగితే ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద నిపుణులు, పూర్వికులు చెబుతున్నారు. ఇవి మానవ శరీరంలో కఫ, వాత, పిత్త దోషాలను సమానంగా చేయడానికి ఎంతో ఉపయోగపడుతుందని ఆయుర్వేద శాస్త్రం శాస్త్రం చెబుతుంది.

ప్రస్తుతం మానవుల్లో సోకే వ్యాధులన్ని ఎక్కువగా నీటి నుంచే వస్తుంటాయి. నీటిని రాగి పాత్రలో లేదా చెంబులో నిల్వ ఉంచి తాగితే ఆరోగ్య ప్రయోజనాలతో పాటు.. శరీర రోగ నిరోధక వ్యవస్థ కూడా పెరుగుతుంది. ప్రస్తుతం నీటి ద్వారా రోగాల బారినపడకుండా వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరిఫయర్లు వాడుతున్నారు.. ఈ అంశం పై పరిశోధనల్లో తాజాగా ఆశ్చర్య పోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. వాటర్ ఫిల్టర్లు, ఆర్వో ఫ్యూరిఫయర్లు కంటే రాగి పాత్రల్లో నీటిని నిల్వ చేస్తే సహజంగానే శుద్ధి అవుతుందట..

గమనిక: ఈ కథనంలో పేర్కొన్న పద్ధతులు, చిట్కాలు కేవలం సమాచారం కోసం మాత్రమే. వీటిని అనుసరించే ముందు కచ్చితంగా డాక్టర్ సలహాలు తీసుకోవడం మంచిది.