AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పుచ్చకాయ కిడ్నీలను క్లీన్ చేస్తుందా..? ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు..

వేసవిలో ప్రజలు పుచ్చకాయ తినడానికి ఇష్టపడతారు. ఇది శరీరంలో నీటిని కూడా నింపుతుంది. అంతేకాకుండా.. డీహైడ్రేషన్ బారి నుంచి కాపాడుతుంది.. పుచ్చకాయ GAI సూచిక ఎక్కువగా ఉండదు.. కానీ పుచ్చకాయ మూత్రపిండాలకు ప్రయోజనకరమా లేదా హానికరమా అనే విషయంపై పోషకాహార నిపుణులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం..

పుచ్చకాయ కిడ్నీలను క్లీన్ చేస్తుందా..? ఎవ్వరికీ తెలియని ఆసక్తికర విషయాలు..
Watermelon Good For Kidneys
Shaik Madar Saheb
|

Updated on: Apr 22, 2026 | 11:56 AM

Share

ఎండలు దంచికొడుతున్నాయి.. దీంతో చాలా మంది కడుపులో చల్లగా ఉండేందుకు పలు రకాల పండ్లను తింటారు. అలాంటి ఆరోగ్యకరమైన పండ్లలో పుచ్చకాయ ఒకటి.. వేసవి కాలంలో నీటిశాతం ఎక్కువగా ఉన్న పుచ్చకాయ తినడం చాలా ప్రయోజనకరమని భావిస్తారు. పుచ్చకాయ శరీరానికి నీటిని అందించడంతోపాటు.. తియ్యగా ఉంటుంది. అయితే పుచ్చకాయ మూత్రపిండాలకు మేలు చేస్తుందా? దానివల్ల మూత్రపిండాలకు ఏమైనా హాని కలుగుతుందా? ఈ విషయాల గురించి ఆరోగ్య నిపుణులు ఏం చెబుతున్నారు.. అనే వివరాలను ఈ కథనంలో తెలుసుకుందాం.

ఢిల్లీలోని జీటీబీ హాస్పిటల్ మాజీ డైటీషియన్ డాక్టర్ అనామిక గౌర్, పుచ్చకాయను సరైన మోతాదులో తినడం ఆరోగ్యానికి మేలు చేస్తుందని వివరిస్తున్నారు. మూత్రపిండాల ఆరోగ్యం విషయంలో, పుచ్చకాయ తినడం వల్ల వాటికి హాని జరగదు. నిజానికి, ఇది ప్రయోజనకరంగా ఉంటుంది. పుచ్చకాయలో నీటి శాతం ఎక్కువగా ఉండి, అనేక ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. అందువల్ల ఇది మూత్రపిండాలకు మేలు చేస్తుంది. పుచ్చకాయలో 90 శాతం నీరే ఉంటుంది కాబట్టి, ఇది శరీరానికి తేమను అందిస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా ఉంటుంది. ఇది చర్మానికి మేలు చేస్తుంది. పుచ్చకాయలో పొటాషియం కూడా ఉంటుంది.. ఇది కూడా అన్ని విధాలుగా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.

మూత్రపిండాల వ్యాధి ఉన్న రోగులు పుచ్చకాయ తినవచ్చా?

పుచ్చకాయలో మంచి మొత్తంలో అమైనో ఆమ్లాలు కూడా ఉంటాయని డాక్టర్ అనామిక వివరిస్తున్నారు. ఈ అమైనో ఆమ్లాలు మూత్రపిండాలకు చాలా మేలు చేస్తాయి.. వాటిపై భారాన్ని తగ్గిస్తాయి. ఈ అమైనో ఆమ్లాలు మూత్రపిండాల్లో రాళ్ల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తాయి. అందువల్ల, కిడ్నీ రోగులు తమ వైద్యుని సలహా మేరకు పరిమిత పరిమాణంలో పుచ్చకాయను తీసుకోవచ్చు. దీనివల్ల కిడ్నీ రోగులకు ఎలాంటి తీవ్రమైన హాని జరగదు. అయితే, తీవ్రమైన మూత్రపిండ వ్యాధులు ఉన్నవారు వైద్యుని సలహా మేరకు మాత్రమే పుచ్చకాయను తీసుకోవాలి.

పుచ్చకాయలో నీరు ఎక్కువగా ఉంటుంది.. మరి అది మూత్రపిండాలను శుభ్రపరుస్తుందా?

పుచ్చకాయలో నీరు ఉంటుందని, కానీ అది మూత్రపిండాలను శుద్ధి చేస్తుందనేది ఒక అపోహ అని డాక్టర్ అనామిక అంటున్నారు. మూత్రపిండాలు వాటంతట అవే శుభ్రపడతాయి. దీని కోసం పుచ్చకాయ తినాల్సిన అవసరం లేదు. పుచ్చకాయ శరీరానికి నీటిని అందించి, పోషణను చేకూర్చినప్పటికీ, అది ఏ మూత్రపిండాల వ్యాధినీ తగ్గించదు లేదా మూత్రపిండాలను శుభ్రపరచదు.. అని తెలిపారు.

అయితే.. ఏమైనా అనారోగ్య సమస్యలున్నా.. సందేహాలున్నా.. వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us