Throat Pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా..  ఎంతో సులభమైన ఈ చిట్కాలు పాటించి క్షణాల్లో ఉపశమనం పొందండి..

కొన్ని వ్యాధులు మినహిస్తే చాలా వరకు సీజనల్ వ్యాధులు కాలానుగుణంగా వస్తుంటాయి. వాతావరణం మారితే వచ్చే జబ్బులతో పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు.. అలా అని సీజనల్ వ్యాధుల పట్ల అజాగ్రత్త వహిస్తే మాత్రం పెను ప్రమాదం..

Throat Pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా..  ఎంతో సులభమైన ఈ చిట్కాలు పాటించి క్షణాల్లో ఉపశమనం పొందండి..
Throat Pain

Updated on: Dec 05, 2022 | 8:35 PM

కొన్ని వ్యాధులు మినహిస్తే చాలా వరకు సీజనల్ వ్యాధులు కాలానుగుణంగా వస్తుంటాయి. వాతావరణం మారితే వచ్చే జబ్బులతో పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు.. అలా అని సీజనల్ వ్యాధుల పట్ల అజాగ్రత్త వహిస్తే మాత్రం పెను ప్రమాదం తప్పదంటున్నారు ఆరోగ్య నిపుణులు. సాధారణంగా చలి కాలంలో జలుబు, దగ్గుతోపాటు.. గొంతు నొప్పి సమస్యలతో ఎక్కువ మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. చాలా మంది. ముఖ్యంగా గొంతు నొప్పిని తగ్గించుకునేందుకు ఈ పద్ధతులు పాటించాలి. విపరీతమైన వేడి గాలుల నుంచి ఒక్కసారిగా చల్లని గాలులతో చాలా మంది గొంతు నొప్పి సమస్య తీవ్రంగా వేధిస్తుంది. ఈ గొంతు నొప్పి సమస్యను తగ్గించుకోవడానికి ఇంట్లో ఉండే పదార్థాలను ఉపయోగించ వచ్చు. వేడి నీటిలో ఉప్పు వేసి పుక్కిలించాలి. రోజుకు రెండుసార్లు క్రమం తప్పకుండా ఇలా చేయడం వలన గొంతు నొప్పి తగ్గుతుంది. ఇది నోటిలో ఉండే బ్యాక్టీరియాను నాశనం చేస్తుంది. ఒక కప్పు వేడి నీటిలో అర టీస్పూన్ ఉప్పు కలిపి పుక్కిలించడం వలన ఈ సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.

హాట్ హెర్బల్ టీ.. వివిధ రకాల హెర్బల్ టీలను ఉపయోగించడం వలన గొంతు నొప్పి తగ్గించవచ్చు. లవంగం టీ, గ్రీన్ టీ ఈ సమస్యను తగ్గిస్తాయి. హెర్బల్ టీలలో యాంటీ బ్యాక్టీరియల్.. యాంటీ ఇన్ప్లమేటరీ లక్షణాలు ఉంటాయి. తేనెలో సహజ యాంటీ బాక్టీరియల్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది గొంతు నొప్పిని తగ్గించడంలో సహయ పడుతుంది. బ్యాక్టీరియాను తొలగించడమే కాకుండా వైరల్ ఇన్ఫెక్షన్ల నుంచి రక్షిస్తుంది. అలాగే సైనస్ నొప్పిని తగ్గించడానికి హ్యూమిడిఫైయర్ సహయపడుతుంది.

వేడి నీటిలో హైడ్రోజన్ పెరాక్సైడ్ ద్రావణాన్ని వేసి టవల్ కప్పి.. ఆ నీటి ఆవిరిని పీల్చుకోవాలి. నిమ్మకాయ కూడా గొంతు నొప్పిని తగ్గించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. గొంతులో శ్లేష్మాన్ని తొలగించడం… నొప్పిన తగ్గించడంలో సహయపడుతుంది. ఇందులో విటమిన్ సి ఉంటుంది. ఇది రోగ నిరోధక శక్తిని పెంచడంలో సహయపడుతుంది. అంతేకాకుండా.. ఇన్ఫెక్షన్ల నుంచి రక్షించడానికి..శక్తిని పెంచడానికి సహయ పడుతుంది. వేడి నీటిలో టీస్పూన్ నిమ్మరసం కలిపి తీసుకోవడం మంచిది. హాట్ సాస్.. గొంతు నొప్పిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. పచ్చి మిరపకాయలతో తయారు చేసిన సాస్ లో క్యాప్సైసిస్ ఉంటుంది. ఇది వాపు తగ్గించడంలో సహయపడుతుంది. ఒక గ్లాసు నీటిలో కొన్ని చుక్కల హాట్ సాస్ వేసి బాగా కలిపి తీసుకోవాలి.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..

Follow Us