AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధారపడాల్సిన పనిలేదు.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి..!

ప్రస్తుత రోజుల్లో చాలా మంది ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని శాకాహార జీవనశైలిని ఎంచుకుంటున్నారు. ఇలాంటి ఆహారపు అలవాట్లు ఎన్నో ఆరోగ్య సమస్యలను నివారించడంలో సహాయపడతాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, క్యాన్సర్ వంటి తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది.

ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధారపడాల్సిన పనిలేదు.. ఈ ఫుడ్స్ ట్రై చేయండి..!
Protein Rich Veggies
Prashanthi V
|

Updated on: Jun 29, 2025 | 12:03 PM

Share

శరీరానికి కావాల్సిన పోషకాలు అందడంలో శాకాహారం పెద్ద పాత్ర పోషిస్తుంది. చాలా మంది మాంసాహారానికి బదులుగా వెజిటేరియన్ లేదా వీగన్ డైట్ తీసుకుంటున్నారు. వీరు గుడ్లు, మాంసం లేదా పాలు వంటి ప్రోటీన్ ఎక్కువగా ఉండే పదార్థాలు తీసుకోలేకపోతున్నారు. అలాంటి వారికి శాకాహారంతో కూడా మంచి ప్రోటీన్ అందించగల కొన్ని అద్భుతమైన ఆహారాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పనీర్ శాకాహారంలో ప్రోటీన్ ఎక్కువగా ఉండే అద్భుతమైన ఆహారం. 100 గ్రాముల పనీర్‌ లో సుమారు 11 గ్రాముల ప్రోటీన్ ఉంటుంది. దీన్ని కూరల్లో, సలాడ్లలో లేదా బ్రెడ్‌ తో కలిపి తింటే మంచి పోషణ లభిస్తుంది.

రాజ్మా (కిడ్నీ బీన్స్) ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఎక్కువగా వాడే శాకాహార పదార్థం. దీనిలో పీచుపదార్థాలు, ఐరన్, ఫోలేట్ ఇంకా ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. దీన్ని కూరగాయలతో కలిపి తింటే ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.

బాదం ఆరోగ్యానికి ఎంతో మంచిదని మనందరికీ తెలుసు. ఇందులో విటమిన్ E, మెగ్నీషియం వంటి ముఖ్యమైన పోషకాలు ఉంటాయి. బాదం నేరుగా తినడం లేదా పాలలో కలిపి తీసుకోవడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.

క్వినోవా అనే గ్లూటెన్ లేని ధాన్యంలో శరీరానికి కావాల్సిన 9 రకాల అమినో యాసిడ్లు ఉంటాయి. దీనిని అన్నానికి బదులుగా లేదా సలాడ్లలో వాడుకోవచ్చు. క్వినోవాలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు కూడా ఉండటం వల్ల గుండె మెదడు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఇది సహాయపడుతుంది.

మొలకలు ప్రోటీన్‌ తో పాటు విటమిన్ Cను కూడా అందిస్తాయి. ఉదయాన్నే మొలకలు తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులో ఉండే విటమిన్ A కంటిచూపును మెరుగుపరచడంలో ఉపయోగపడుతుంది.

పెసర పప్పులో ఫైబర్, ప్రోటీన్‌ తో పాటు ఇతర పోషకాలు అధికంగా ఉంటాయి. ఇది తేలికగా జీర్ణమవుతుంది. రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకుంటే బలాన్ని ఇచ్చే ఆహారంగా మారుతుంది.

మసూర్ దాల్ ఎక్కువగా భారతీయులు వాడే పప్పులలో ఒకటి. చింతపండులా రుచిగా ఉండే ఈ పప్పు అధికంగా ప్రోటీన్ కలిగి ఉండటం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. దీన్ని ప్రతిరోజూ వంటల్లో ఉపయోగిస్తారు.

సోయాబీన్స్‌ తో తయారయ్యే టోఫులో అధికంగా ప్రోటీన్ ఉంటుంది. ఇది తక్కువ కేలరీలతో ఉండటం వల్ల బరువు తగ్గాలనుకునే వారికి చాలా అనుకూలంగా ఉంటుంది. టోఫును కూరల్లో లేదా స్టర్‌ ఫ్రై రూపంలో వాడుకోవచ్చు.

టెంపె (Tempe) ఇది పులియబెట్టిన సోయాబీన్స్‌ తో తయారైన ఇండోనేషియన్ ఆహారం. టెంపె మంచి ప్రొబయోటిక్ ఆహారంగా కూడా గుర్తించబడుతుంది. ఇది జీర్ణవ్యవస్థకు మంచిది. ప్రోటీన్, పీచుపదార్థాలు ఇంకా ఖనిజాలతో సమృద్ధిగా ఉంటుంది.

వెజిటేరియన్లు ప్రోటీన్ కోసం గుడ్లపై ఆధారపడాల్సిన అవసరం లేదు. పైన చెప్పిన శాకాహార పదార్థాలు ప్రోటీన్‌ తో పాటు ఇతర అవసరమైన పోషకాలను కూడా పుష్కలంగా అందిస్తాయి. శారీరక శక్తిని పెంచడంలో, రోగనిరోధకతను మెరుగుపరచడంలో ఇవి సహాయపడతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
లిఫ్ట్‌లో అద్దాలు ఎందుకు ఉంటాయో తెలుసా? 99 శాతం మందికి తెలియదు..!
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
AP POLYCET 2026 కౌన్సెలింగ్ ప్రారంభం.. సీటు పొందాలంటే ఇలా చేయండి
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
కెనడా ప్లేయర్ కాలు విరగ్గొట్టిన ఖతార్ ప్లేయర్ పై నిషేధం
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
నోట్లో వేస్తే ఇట్టే కరిగిపోవాల్సిందే.. హెల్తీ ‘బెల్లం రవ్వ లడ్డు
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
భారీగా పెరిగిన కూరగాయల ధరలు.. తెలుగు రాష్ట్రాల్లో ఇలా..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ముడుచుకుందంటే పులులు, సింహాలు కూడా ఏం చేయలేవ్..
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
ఆ ఇద్దరి ఎఫెక్ట్.. ఇంగ్లాండ్ సిరీస్ నుంచి వైభవ్ ఔట్.. ఎందుకంటే?
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
గంగమ్మ కస్టోడియల్ డెత్ కేసు ట్విస్ట్.. హైకోర్టు కీలక ఆదేశాలు
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
క్రెడిట్ కార్డులు వాడేవారికి పెద్ద ఊరట.. ఆర్బీఐ పెద్ద ఊరట..
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!
ఇదే మీ ముగ్గురికి ఫైనల్ ఛాన్స్.. తుస్సుమంటే టీంను గెంటేసుడే..!