AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gut Health: మీ గట్‌ ను ఆరోగ్యంగా ఉంచే 3 అద్భుతమైన సీడ్స్ ఇవే..!

మన గట్ ఆరోగ్యంగా ఉంటేనే మొత్తం శరీరం సజీవంగా ఉంటుంది. గట్‌ లో జీర్ణక్రియ బాగా జరిగితే మెదడు కి కూడా మంచి శక్తి అందుతుంది. మన గట్ హెల్త్ బాగుండాలంటే కొన్ని సహజ విత్తనాలు చాలా బాగా పని చేస్తాయి.

Gut Health: మీ గట్‌ ను ఆరోగ్యంగా ఉంచే 3 అద్భుతమైన సీడ్స్ ఇవే..!
Gut Health
Prashanthi V
|

Updated on: Aug 05, 2025 | 10:33 PM

Share

మన గట్ ఆరోగ్యంగా ఉంటేనే మన మెదడు, శరీరం కూడా ఆరోగ్యంగా ఉంటాయి. గట్ అనారోగ్యంగా ఉంటే.. అది మన మెదడుపై, శరీరంపై చాలా ప్రభావం చూపుతుంది. అందుకే గట్‌ను శుభ్రంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. మీ గట్ ఆరోగ్యాన్ని మెరుగుపరిచే మూడు ముఖ్యమైన సీడ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

చియా సీడ్స్

ఈ విత్తనాలలో కరిగే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. వీటిని నీటిలో నానబెట్టినప్పుడు జెల్ లాగా మారతాయి. ఇది రక్తంలో చక్కెర స్థాయిలు పెరగకుండా చేస్తుంది. మలాన్ని మెత్తగా చేసి పేగును శుభ్రపరచడంలో సాయపడతాయి. చియా విత్తనాలను ఎప్పుడూ నానబెట్టి మాత్రమే తినాలి. వాటిని బెర్రీలు, పెరుగు, బాదం పాలు లాంటి వాటితో కలిపి తీసుకోవచ్చు.

సబ్జా గింజలు

సబ్జా గింజలు చియా విత్తనాలకు సమానమే కానీ మరింత చల్లదనాన్ని ఇస్తాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరచి, శరీరానికి చలవ చేస్తాయి. వీటిని ఓట్‌మీల్, బాదం పాలు లేదా బాదం పెరుగు లాంటి వాటితో కలిపి తినొచ్చు.

అవిసె గింజలు (Flax seeds)

అవిసె గింజలు చిన్నగా ఉన్నా ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్లు ఎక్కువగా ఉంటాయి. వీటిని పొడి చేసి మాత్రమే తినాలి. అప్పుడు మాత్రమే శరీరానికి పూర్తి పోషకాలు లభిస్తాయి. వీటిలోని పోషకాలు శరీరంలో వాపును తగ్గించడంలో, హార్మోన్లను సమతుల్యంగా ఉంచడంలో, కొలెస్ట్రాల్‌ను అదుపులో ఉంచడంలో సాయపడతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నానేరుగా వైద్య నిపుణులను సంప్రదించడం మంచిది)

Follow Us
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
తక్కువ మసాలాలతో అదిరిపోయే మటన్ సుక్కా.. అదిరిపోయే రెసిపీ
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
ప్రియురాలు మృతి.. విశాఖలో సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ ఆత్మహత్య..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
బ్యాంకు నుంచి వచ్చే మెసేజ్‌లను డిలీట్ చేస్తున్నారా? ఎంత డేంజరో..
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
పాక్‌ వైమానిక దాడులపై ప్రతీకారం తీర్చుకుంటాం.. తాలిబన్ల వార్నింగ్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
9వ తరగతి విద్యార్థులకు ఇస్రో యువికా 2026 ఆహ్వానం.. డైరెక్ట్ లింక్
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
మ‌హావ‌తార్ నరసింహను బీట్ చేసే రేంజ్‌లో మరో యానిమేషన్ సినిమా
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
సకల శుభాలను తెచ్చే.. స్కంద షష్టి వ్రతం ఎలా చేయాలో తెలుసా..?
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
భారత్- దక్షిణాఫ్రికా మ్యాచ్‌కు వర్షం ముప్పు ఉందా? వెదర్ రిపోర్ట్
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీ డబ్బును ఒకే బ్యాంక్‌లో పెడుతున్నారా?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?
మీరు SBIలో రూ.50 లక్షల హోమ్‌ లోన్‌ తీసుకుంటే EMI ఎంత కట్టాలి?