Health: మీకు షుగర్ ఉందా..? అయితే ఇలా చేయకపోతే ప్రమాదంలో పడ్డట్లే…

ఇటీవల గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరిగింది. గుండె రక్తాన్ని సమర్ధవంతంగా పంప్ చేయకపోతే, అది అనేక హృదయ సంబంధ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. గుండెపోటుకు అనేక కారణాలు ఉన్నాయి. మధుమేహం వంటి ఇతర సమస్యలు కూడా దీనికి కారణం కావచ్చు. కాబట్టి, మీకు కూడా డయాబెటిస్ సమస్య ఉంటే, మీ గుండె ఆరోగ్యాన్ని కూడా జాగ్రత్తగా చూసుకోండి.

Health: మీకు షుగర్ ఉందా..? అయితే ఇలా చేయకపోతే ప్రమాదంలో పడ్డట్లే...
Diabetes
Follow us

|

Updated on: Apr 29, 2024 | 4:59 PM

మీకు షుగర్ ఉందా…? అయితే బీ అలర్ట్.. షుగర్ లేనివారి కంటే.. ఉన్నవారు.. గుండె జబ్బులు లేదా స్ట్రోక్‌తో బాధపడే అవకాశం 2 రెట్లు ఎక్కువ అని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ మధ్య చిన్నవయసులోనే చాలామంది షుగర్ వ్యాధి బారిన పడుతున్నారు. అందుకే అప్రమత్తంగా ఉండటం అవసరం. రక్తంలో చక్కెర స్థాయిలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటే.. కాలక్రేమేణ రక్త నాళాలు,  న్యూరాన్లకు నష్టం కలుగుతుంది. అయితే షుగర్ ఉన్నవారు లైఫ్ స్టైల్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే.. గుండెపోటు ప్రమాదం నుంచి బయటపడొచ్చు.

రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచండి:

డయాబెటిస్‌ అదుపులో ఉంచడానికి,  గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడానికి రక్తంలో చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడం చాలా ముఖ్యం. కాబట్టి, మీ రక్తంలో షుగర్‌ లెవల్‌పే క్రమం తప్పకుండా మోనిటర్ చేయండి. మందులు లేదా ఇన్సులిన్ వాడకం కోసం మీ వైద్యుని సిఫార్సులను ఫాలో అవ్వండి. తక్కువ గ్లైసెమిక్ ఇండెక్స్ ఆహారాలు, తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లను తినండి.

గుండెకు మేలు చేసే ఆహారాలు తినండి:

పూర్తిగా, ప్రాసెస్ చేయని ఆహారాన్ని తినడం చాలా అవసరం. హృదయానికి మేలు చేసే చేపలు, పౌల్ట్రీ, బీన్స్, టోఫు వంటి లీన్ ప్రోటీన్లను మీ ఆహారంలో భాగం చేసుకోండి. ఆలివ్ ఆయిల్, అవకాడోస్, నట్స్ వంటి ఆరోగ్యకరమైన కొవ్వులు తినండి. . తృణధాన్యాలు, కూరగాయలు, పండ్లు వంటి ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం పెంచండి.

రెగ్యులర్ వర్కవుట్స్:

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మీ హృదయానికి చాలా అవసరం. వారానికి కనీసం 150 నిమిషాల సాధారణ ఏరోబిక్ యాక్టివిటీని చేయండి. మీ కండరాల బలం, మొత్తం ఫిట్‌నెస్‌ని మెరుగుపరచడానికి మీ దినచర్యకు వ్యాయామాన్ని జోడించండి.

వెయిల్ విషయంలో అలెర్ట్:

బాగా వెయిట్ ఉంటే ఆరోగ్యకరంగా తగ్గేందుకు ప్రయత్నించండి. మీ హార్ట్ బాగుండాలంటే కొవ్వు తగ్గాల్సిందే. అధిక బరువు గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. సమతుల్య ఆహారం, సాధారణ శారీరక శ్రమపై దృష్టి పెట్టండి.

రక్తపోటు, కొలెస్ట్రాల్ విషయంలో జాగ్రత్త:

మధుమేహం ఉన్నవారిలో అధిక రక్తపోటు, అసాధారణ కొలెస్ట్రాల్ స్థాయిలు సాధారణం. ఇవి గుండె జబ్బుల ప్రమాదానికి దోహదం చేస్తాయి. మందులు, జీవనశైలి మార్పుల ద్వారా మీ రక్తపోటు, కొలెస్ట్రాల్ స్థాయిలను పరిధిలో ఉంచుకోండి. తక్కువ సోడియం ఆహారం తీసుకోండి. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని పరిమితం చేయండి. చేపలు, అవిసె గింజలు, వాల్‌నట్‌లలో ఉండే ఒమేగా-3 ఆమ్లాలు వంటి గుండె-ఆరోగ్యకరమైన కొవ్వులను మీ ఆహారంలో చేర్చండి.

మరిన్ని ఆరోగ్య సంబంధిత కథనాల కోసం క్లిక్‌ చేయండి.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.