Kidney Stones Signs: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే వెంటనే అలర్ట్‌ అవ్వండి.. కిడ్నీలో రాళ్లు ఉండొచ్చు.

| Edited By: Ravi Kiran

Jul 21, 2021 | 9:16 AM

Kidney Stones Signs: మారుతోన్న జీవన శైలి, తీసుకుంటోన్న ఆహారం వెరసి.. ఇటీవల కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువవుతోంది. తగినంత నీరు తాగకపోవడం, కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఎక్కువగా...

Kidney Stones Signs: మీలో ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.? అయితే వెంటనే అలర్ట్‌ అవ్వండి.. కిడ్నీలో రాళ్లు ఉండొచ్చు.
Kidny Stones
Follow us on

Kidney Stones Signs: మారుతోన్న జీవన శైలి, తీసుకుంటోన్న ఆహారం వెరసి.. ఇటీవల కిడ్నీలో రాళ్ల సమస్య ఎక్కువవుతోంది. తగినంత నీరు తాగకపోవడం, కాల్షియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం, ఎక్కువగా మందులను వాడడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడుతుంటాయి. మూత్రంలో కాల్షియం, ఆగ్జలేట్‌, యూరిక్ యాసిడ్ స్థాయిలు ఎక్కువైతే సహజంగా బయటకు పోకుండా.. అవి మూత్ర పిండాల్లో పేరుకుపోయి రాళ్లు ఏర్పడుతాయి. అయితే కిడ్నీలో రాళ్లు మొదట్లో గుర్తిస్తే చాలా సులభంగా తగ్గించుకోవచ్చు. అలా కాకుండా ఆలస్యమైతే మాత్రం నొప్పి తీవ్రమవుతుంది. మరి కొన్ని ముందస్తు లక్షణాల ఆధారంగా కిడ్నీలో రాళ్లు ఉన్నాయా? అన్న విషయాన్ని తెలుసుకోవచ్చు.. అవేంటంటే..

* మూత్రం పోసే సమయంలో దుర్వాసన ఎక్కువగా ఉంటే మూత్ర పిండాల్లో రాళ్లు ఉన్నాయని అర్థం చేసుకోవాల్సిందే. అలాగే మూత్రం రంగు కూడా డార్క్‌గా మారుతుంది.
* కొందరిలో మూత్ర పిండాల్లో రాళ్లు ఉంటే కొన్ని సందర్భాల్లో రక్తం వస్తుంది. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే అలర్ట్‌ కావాలి.
* కిడ్నీల్లో రాళ్లు ఉన్న వారికి ముందు నుంచే వెన్ను నొప్పి ఉంటుంది. కాబట్టి ఎక్కువ రోజుల పాటు వెన్ను నొప్పితో బాధపడుతుంటూ వైద్యులను సంప్రదించడం ఉత్తమం.
* కిడ్నీల్లో రాళ్లు ఉంటే కొందరిలో జ్వరం వస్తుంది. తరచుగా జ్వరం వస్తూ పోతుంటే జాగ్రత్త పడాల్సి ఉంటుంది.
* బొడ్డు కింది భాగంలో రెండు వైపులా నొప్పి ఉంటుంది. వీపు భాగంలోనూ ఇలాంటి నొప్పే వస్తుంది.
* కిడ్నీలో రాళ్లు ఉన్నవారిలో కొంద‌రికి వాంతికి వ‌చ్చిన‌ట్లు అనిపిస్తుంది. కొన్ని ప‌దార్థాల వాస‌న‌లు చూస్తే క‌డుపులో తిప్పిన‌ట్లు అనిపిస్తుంది. వాంతి అవుతుంది కూడా.. కాబట్టి ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి.

Also Read: Stomach Pain : కడుపునొప్పికి కారణం మీరు చేసే ఈ 7 తప్పులే..! ఏంటో కచ్చితంగా తెలుసుకోండి..

Leggings-StyleTips: లెగ్గింగ్స్ కొంటున్నారా.. అయితే ఈ టిప్స్ పాటిస్తే.. అందానికి అందం..సౌకర్యానికి సౌకర్యం

Orange Benefits: నారింజ ప్రయోజనాలు తెలిస్తే షాకే.. సులువుగా బరువు తగ్గొచ్చు.. మరెన్నో లాభాలు