Coronavirus: ఎక్కువ నిద్రతో కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువ.. తాజా అధ్యయనంలో తేల్చిన శాస్త్రవేత్తలు

|

Mar 26, 2021 | 7:36 PM

Coronavirus: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నిగనిరోధక శక్త లేనివారిపై త్వరగా వ్యాప్త చెందే అవకాశాలున్నాయని.

Coronavirus: ఎక్కువ నిద్రతో కరోనా సోకే అవకాశాలు చాలా తక్కువ.. తాజా అధ్యయనంలో తేల్చిన శాస్త్రవేత్తలు
More Sleep
Follow us on

Coronavirus: ప్రస్తుతం కరోనా మహమ్మారి ప్రతి ఒక్కరిపై ప్రభావం చూపుతోంది. అయితే ఇప్పటి వరకు కరోనా వైరస్‌ నిగనిరోధక శక్త లేనివారిపై త్వరగా వ్యాప్త చెందే అవకాశాలున్నాయని గుర్తించారు. అలాగే ఇతర దీర్ఘకాలిక వ్యాధులున్నవారికి, వయసు పైబడిన వారికి త్వరగా సోకే అవకాశాలున్నాయని గుర్తించారు. అయితే సరిగ్గా నిద్రపోని వారికి కరోనా వ్యాప్తి చెందే అవకాశాలున్నాయని శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే తగినంత సమయం నిద్రపోతే శారీరకంగా, మానసికంగా ఎన్నో ప్రయోజనాలున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

తాజాగా మంచి నిద్ర వల్ల కరోనా సోకే అవకాశాలు తగ్గుతాయని ఓ అధ్యయనంలో తేలింది. బీఎంజే న్యూట్రిషన్‌ ప్రివెన్షన్‌ అండ్‌ హెల్త్‌ జర్నల్‌లో ఈ మేరకు నివేదికను ప్రచురించారు. నిద్రలేమి, మానసిక ఒత్తిళ్ల వల్ల శరీరంలో కరోనా వైరస్‌ సులువుగా ప్రవేశించే అవకాశం ఉందని చెబుతున్నారు. దీంతో పాటు తీవ్రమైన జబ్బులు, వాటి నుంచి కోలుకోవడానికి దీర్ఘకాలం సమయం పట్టవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

కోవిడ్‌ సోకడంలో నిద్ర ప్రభావంపై పరిశోధన కోసం ఫ్రాన్స్‌, జర్మనీ, ఇటలీ, స్పెయిన్‌, యూకే, అమెరికా దేశాల్లో కరోనా బాధితులకు చికిత్సలకు అందిస్తూ కరోనా బారిన పడిన హెల్త్‌ కేర్‌ వర్కర్లపై సర్వే నిర్వహించారు. వారు ఎంతసేపు నిద్రిస్తారనే విషయంపై దృష్టి సారించి అధ్యయనం చేయగా, 40 శాతం మంది నిద్రలేమి, మాససిక ఒత్తిళ్ల ప్రభావంతో కరోనా సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. అయితే తగినంత నిద్రపోవడం ఎంతో ముఖ్యమని, రోజువారి నిద్ర కంటే గంట ఎక్కువగా నిద్రపోయినా.. ఒక్కో గంటకు కరోనా సోకే అవకాశాలు 12 శాతం చొప్పున తగ్గుతాయని శాస్త్రవేత్తలు అధ్యయనం ద్వారా తేల్చారు.

ఇవీ చదవండి :

Health Check-up Benefits: మార్చి 31లోపు ఇలా చేయండి.. రూ.50 వేల వరకు ప్రయోజనం పొందే అవకాశం..!

Corona Virus Second Wave: కోవిడ్ సెకండ్ వేవ్ స్టార్ట్.. భయం వద్దు.. ఈ జాగ్రత్తలు తీసుకోండి అంటున్న నిపుణులు