Black Lips: నల్లటి పెదాలతో బాధపడుతున్నారా.. ఈ ఆయిల్‌ వాడితే బెస్ట్‌ రిజల్ట్‌..!

|

Mar 19, 2022 | 5:50 AM

Black Lips: ప్రతి మహిళ అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అయితే అందంగా కనిపించడంలో పెదవుల పాత్ర ముఖ్యమైంది. చూడగానే పెదవులే ముందుగా ఎవరినైనా ఆకర్షిస్తాయి.

Black Lips: నల్లటి పెదాలతో బాధపడుతున్నారా.. ఈ ఆయిల్‌ వాడితే బెస్ట్‌ రిజల్ట్‌..!
Lips
Follow us on

Black Lips: ప్రతి మహిళ అందంగా కనిపించాలని కోరుకుంటుంది. అయితే అందంగా కనిపించడంలో పెదవుల పాత్ర ముఖ్యమైంది. చూడగానే పెదవులే ముందుగా ఎవరినైనా ఆకర్షిస్తాయి. ఈ పరిస్థితిలో మీరు పెదవుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవడం అవసరం. పెదవుల సంరక్షణ కోసం మహిళలు అనేక ఉత్పత్తులను ఉపయోగిస్తారు. కాని ఇవి పెదాలను నల్లగా మార్చడమే కాకుండా చాలా సైడ్‌ ఎఫెక్ట్స్‌ కలిగి ఉంటాయి. అందుకే సహజసిద్దమైన పద్దతులని అనుసరించడం బెటర్. ఆయుర్వేదం ప్రకారం పెదవుల నలుపును పోగొట్టడానికి నువ్వుల నూనె బాగా ఉపయోగపడుతుంది. దీని కోసం అర టీస్పూన్ నువ్వుల నూనె, చిటికెడు పసుపు తీసుకొని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. దీనిని పెదవులపై అప్లై చేయాలి. 30 నిమిషాల తర్వాత శుభ్రమైన నీటితో కడగాలి. ఇది మీ పెదవుల సహజ రంగును తిరిగి తీసుకువస్తుంది.

కొబ్బరి, నువ్వుల నూనె

దీని కోసం ఒక చిన్న చెంచా నువ్వుల నూనె, అర చెంచా కొబ్బరి నూనె తీసుకోవాలి. ఒక గిన్నెలో వేసి రెండు నూనెలను బాగా కలపాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మీ పెదాలపై అప్లై చేయాలి. ఈ మిశ్రమంతో మీ పెదాలను రోజుకు రెండుసార్లు మసాజ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పెదవుల నలుపు పోతుంది.

చక్కెర, నువ్వుల నూనె

ఈ మిశ్రమాన్ని తయారు చేయడానికి ఒక టీస్పూన్ చక్కెర, అర టీస్పూన్ నువ్వుల నూనె తీసుకోవాలి. వీటిని బాగా మిక్స్‌ చేయాలి. తర్వాత పెదాలకి అప్లై చేయాలి. కొద్ది సేపు మసాజ్‌ చేయాలి. ఆరిన తర్వాత శుభ్రమైన నీటితో శుభ్రం చేసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.

గమనిక : అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం మంచిది.

Andhra Pradesh: బందరులో తీవ్ర ఉద్రిక్తత.. పొలిటికల్ టర్న్ తీసుకున్న నాగలక్ష్మి ఆత్మహత్య..

Clouds: మేఘాలు నలుపు రంగులో ఉంటాయి.. కానీ దీని వెనుక దాగున్న సీక్రెట్‌ ఏంటో తెలుసా..?

IND vs AUS: ఆస్ట్రేలియాని ఓడించడం అంత సులువు కాదు.. ఎందుకంటే ఈ 5గురు ప్లేయర్లు చాలా డేంజర్..!