AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అకస్మాత్తుగా జుట్టు రాలుతుందా..? అయితే.. ఈ వ్యాధుల లక్షణం కావొచ్చట..

ఈ రోజుల్లో జుట్టు రాలడం తీవ్రమైన సమస్యగా మారుతోంది. దీనిని నివారించడానికి ప్రజలు కూడా వివిధ చర్యలు తీసుకుంటున్నారు. షాంపూ, నూనెతో పాటు మందులు కూడా వాడుతున్నారు. మీకు కూడా జుట్టు రాలిపోతుంటే దానిని తేలికగా తీసుకోకండి.. జుట్టు ఎందుకు రాలుతుంది.. ఏయే వ్యాధులలో రాలుతుంది..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు ..? ఈ వివరాలను తెలుసుకోండి..

అకస్మాత్తుగా జుట్టు రాలుతుందా..? అయితే.. ఈ వ్యాధుల లక్షణం కావొచ్చట..
మీకూ తరచుగా జుట్టు రాలుతుందా? పూర్తిగా బట్టతల వచ్చేస్తుందా? ఎన్ని మందులు, నూనెలు వాడినా పనిచేయడం లేదా? ఈ ప్రశ్నలకి మీ సమాధానం అవును అయితే.. మీకో శుభవార్త. మీ తలపై అన్ని వెంట్రుకలు పూర్తిగా ఊడిపోకముందే ఈ అద్భుత చిట్కాలను ప్రయత్నించండి. అందుకు ఏం చేయాలంటే..
Shaik Madar Saheb
|

Updated on: May 22, 2025 | 6:01 PM

Share

సాధారణంగా జుట్టు రాలడం సమస్య వయసు పెరిగే కొద్దీ మొదలవుతుంది. యవ్వనంలో జుట్టు రాలుతుంటే దాని వెనుక అనేక కారణాలు ఉండవచ్చు. ఇది జుట్టు సంబంధిత వ్యాధి లేదా మరేదైనా వ్యాధి వల్ల కూడా కావచ్చు. మీకు ప్రతిరోజూ జుట్టు రాలుతున్నట్లు అనిపిస్తే, వెంటనే దాన్ని తనిఖీ చేసుకోవాలి. ఏదైనా వ్యాధి ఉంటే దానిని గుర్తించవచ్చు లేదా జుట్టుకు సంబంధించిన ఏదైనా సమస్య ఉంటే దానిని ప్రారంభ దశలోనే నిర్ధారించవచ్చు. అయితే.. జుట్టు అకస్మాత్తుగా ఎందుకు రాలడం ప్రారంభమవుతుంది..? వైద్య నిపుణులు ఏం చెబుతున్నారు..? ఈ వివరాలను ఈ కథనంలో తెలుసుకోండి..

జుట్టు రాలడం అనే వ్యాధిని సాధారణంగా అలోపేసియా అరేటా అని ఎయిమ్స్ ఢిల్లీలోని డెర్మటాలజీ విభాగానికి చెందిన డాక్టర్ నిఖిల్ మెహతా వివరించారు. ఇది ఒక ఆటో ఇమ్యూన్ వ్యాధి.. దీనివల్ల శరీర రోగనిరోధక వ్యవస్థ వెంట్రుకల కుదుళ్లపై దాడి చేసి, జుట్టు రాలడానికి దారితీస్తుంది. ఇది కాకుండా, జుట్టు రాలడానికి అనేక ఇతర కారణాలు ఉన్నాయి. వీటిలో కొన్ని జన్యుపరంగా కూడా ఉంటాయి. జుట్టు రాలడం సమస్యను వెంటనే గుర్తించడానికి ప్రయత్నాలు చేయడం ముఖ్యం. తద్వారా వ్యాధిని నివారించవచ్చు.. జుట్టు రాలడాన్ని ఆపవచ్చు..

జుట్టు రాలడానికి ఇవే కారణాలు..

అలోపేసియా అరేటాతో పాటు, చర్మ వ్యాధులు, ఒత్తిడి, థైరాయిడ్, పోషకాహార లోపం.. కొన్ని రకాల మందులు తీసుకోవడం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. ఈ సమస్య శాశ్వతంగా లేదా తాత్కాలికంగా ఉండవచ్చు. వీటితో పాటు, టెలోజెన్ ఎఫ్లూవియం వల్ల కూడా జుట్టు రాలడం జరుగుతుంది. ఇది సాధారణంగా ఒత్తిడి, ఇన్ఫెక్షన్, మందుల ప్రభావాల వల్ల సంభవిస్తుంది. దీనివల్ల జుట్టు వేగంగా రాలిపోతుంది. థైరాయిడ్ సంబంధిత హైపోథైరాయిడిజం, హైపర్ థైరాయిడిజం కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి. హెయిర్ స్టైల్స్, ట్రీట్మెంట్స్ కూడా జుట్టు రాలడానికి కారణమవుతాయి.

నిరంతరం జుట్టు రాలుతుంటే ఏం చేయాలి..

నిరంతరం జుట్టు రాలడం అనే సమస్యను.. ఎప్పుడూ విస్మరించవద్దు. దీన్ని నిర్ధారించడానికి, మీరు వెంటనే ఒక ప్రత్యేక వైద్యుడిని సంప్రదించాలి. వారు జుట్టు రాలడానికి ఖచ్చితమైన కారణాన్ని డాక్టర్ కనుగొంటారు. ఖచ్చితమైన కారణం తెలిసిన తర్వాతే చికిత్స సాధ్యమవుతుంది.

ఏదైనా వ్యాధి వల్ల జుట్టు రాలుతుంటే, ఆ వ్యాధి నియంత్రణలోకి వచ్చిన తర్వాత జుట్టు రాలడం ఆగిపోతుంది. అలోపేసియా అరేటా శాశ్వతం కాదు, చికిత్స లేకుండా కూడా దాదాపు ఒక సంవత్సరంలో నయమవుతుంది.

కొన్ని సందర్భాల్లో పలు పరీక్షలు చేయడం ద్వారా.. వైద్యులు చికిత్సను సూచిస్తారు.. కావున జుట్టు రాలుతుంటే ఎప్పుడూ విస్మరించకండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us