
ముందుగా మజ్జిగను తయారు చేసుకోవాలి : ఒక గిన్నెలో కొంచం పెరుగు తీసుకుని దానిలో కొద్దిగా నీళ్లు పోసి, ఉండలు లేకుండా మజ్జిగలా బాగా కలుపుకోవాలి.

వీటిని బాగా వేయించుకోవాలి: ఇప్పుడు పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆయిల్ వేసి, అది వేడయ్యాక కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, మెంతులు, నాలుగు ఎండు మిర్చి, ఐదు కరివేపాకు ఆకులు , పచ్చిమిర్చి, అల్లం పేస్ట్, చిన్న ఉల్లిపాయ ముక్కలను వేసి బాగా వాటిని వేయించాలి.

పోపు పెట్టుకోవాలి : పోపు బాగా వేగిన తర్వాత, దానిలో అర టేబుల్ స్పూన్ పసుపు, కొద్దిగా కారం కూడా వేసి చివర్లో మజ్జిగ కూడా పోసి, దానిలో కొద్దిగా ఉప్పును వేసి బాగా కలపాలి.

ఈ మజ్జిగను తీసుకుని ఉల్లిపాయ ముక్కలున్న పాత్రలో పోసి మీడియం మంటపై పెట్టి పది నిముషాలు పాటు వాటిని బాగా ఉడికించాలి. అయిత, ఉల్లిపాయ ముక్కలకు మజ్జిగ రసం పట్టించాలి.

చివర్లో మళ్ళీ పాన్ తీసుకుని దానిలో కొద్దిగా ఆవాలు, అర టేబుల్ స్పూన్ జీలకర్ర, 10 ఎండుమిర్చి ముక్కలు , కొద్దిగా ఇంగువ, నాలుగు కరివేపాకు ఆకులు వేసి బాగా వేయించి ఈ ఉల్లిపాయ మజ్జిగలో వేసుకుని తినడమే. మీకు ఇంకా తియ్యగా కావాలంటే దీనిలో చక్కెర కూడా వేసుకోవచ్చు.