Kidney Healthy: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 హెల్తీ ఫుడ్స్ డెయిలీ తినాల్సిందే.. అవేంటంటే..

|

Nov 23, 2021 | 6:36 AM

Kidney Healthy: మనిషి శరీరంలో కిడ్నీ అత్యంత ముఖ్యమైన భాగం. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే.. వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది.

Kidney Healthy: కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే ఈ 5 హెల్తీ ఫుడ్స్ డెయిలీ తినాల్సిందే.. అవేంటంటే..
Kidney
Follow us on

Kidney Healthy: మనిషి శరీరంలో కిడ్నీ అత్యంత ముఖ్యమైన భాగం. మూత్రపిండాలు ఆరోగ్యంగా ఉంటేనే.. వ్యక్తులు ఆరోగ్యంగా ఉంటారు. లేదంటే అనేక ఆరోగ్య సమస్యలను ఫేస్ చేయాల్సి వస్తుంది. ఆరోగ్యకరమైన జీవనశైలి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ద్వారా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుకోవాలి. కిడ్నీ మన శరీరంలోని టాక్సిన్‌లను తొలగించడంలో సహాయపడుతుంది. మీరు రోజూ అనారోగ్యకరమైన వాటిని తీసుకుంటే, అది శరీరానికే కాకుండా మూత్రపిండాలకు కూడా హాని చేస్తుంది. కిడ్నీ చెడిపోతే శరీరంలో గుండె సంబంధిత వ్యాధులు కూడా మొదలవుతాయి. అందుకే శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవడం చాలా ముఖ్యం. యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే ఆహారాలు మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి. మరి.. కిడ్నీని ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడే కొన్ని ఆహారాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1. చేప..
కిడ్నీకి చేపలు మేలు చేస్తాయి. చేపలలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఇవి శరీరాన్ని అనేక వ్యాధుల నుండి దూరంగా ఉంచుతాయి. చేపలను ఆహారంలో చేర్చుకుంటే కిడ్నీ సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

2. ఆపిల్..
ప్రతి ఒక్కరూ యాపిల్ తినడానికి ఇష్టపడతారు. ఆపిల్ ఆరోగ్యానికి అత్యంత ప్రయోజనకరమైన పండ్లలో ఒకటి. యాపిల్స్‌లో పెక్టిన్ అనే ఫైబర్ ఉంటుంది. ఇది కిడ్నీలకు మేలు చేస్తుంది.

3. వెల్లుల్లి..
వెల్లుల్లి వల్ల కలిగే ప్రయోజనాలు అన్నీ ఇన్ని కావు. కిడ్నీలో సోడియం, పొటాషియం, ఫాస్పరస్ పరిమాణం సమపాళ్లలో ఉంచుతుంది. తద్వారా మూత్రపిండాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. రోజూ ఒక వెల్లుల్లిని తీసుకుంటే కిడ్నీని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు.

4. క్యాప్సికమ్..
క్యాప్సికమ్‌లో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ సి క్యాప్సికమ్‌లో కూడా లభిస్తుంది. కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో క్యాప్సికమ్ సహాయపడటానికి ఇదే కారణం.

5. క్యాబేజీ..
క్యాబేజీ కూరగాయలను సాధారణంగా చలికాలంలో తింటారు. క్యాబేజీలో ఫైటోకెమికల్స్, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కిడ్నీలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడతాయి.

Also read:

Puneet Rajkumar: నాటు నాటు పాటకు పునీత్ స్టెప్పులు.. నెట్టింట్లో వైరల్‌గా ‘అప్పు’ ఫ్యాన్‌ మేడ్‌ వీడియో..

Vijayashanthi: చెల్లాచెదురైన జీవితాలు త్వరితగతిన గాడిన పడాలి.. భారీ వర్షాలపై విజయశాంతి ట్వీట్

Suryakantham: తపాలా కవరుపై గయ్యాళి అత్త ముద్ర.. వీడియో