Skin Care Tips: వేసవిలో అందంగా కనిపించాలంటే ఈ హోమ్‌మేడ్ ఫేస్ ప్యాక్‌లని ట్రై చేయాల్సిందే..!

|

May 29, 2022 | 7:36 AM

Skin Care Tips: మండే వేడికి చర్మం నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమయాల్లో చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. దీనికోసం రకరకాల ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. వీటిని సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేయాలి.

Skin Care Tips: వేసవిలో అందంగా కనిపించాలంటే ఈ హోమ్‌మేడ్ ఫేస్ ప్యాక్‌లని ట్రై చేయాల్సిందే..!
Beautiful
Follow us on

Skin Care Tips: మండే వేడికి చర్మం నిర్జీవంగా మారుతుంది. ఇలాంటి సమయాల్లో చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. దీనికోసం రకరకాల ఫేస్ ప్యాక్‌లను ఉపయోగించవచ్చు. వీటిని సహజసిద్ధమైన పదార్థాలతో తయారుచేయాలి. ఈ పదార్థాలు చర్మంపై శీతలీకరణ ప్రభావాన్ని చూపుతాయి. వేసవి కాలంలో ఈ ఫేస్ ప్యాక్‌లు మొటిమలు, నల్ల మచ్చలను తొలగించడంలో సహాయపడతాయి. ఇవి వేడి గాలి నుంచి చర్మాన్ని రక్షిస్తాయి. వీటిని ఇంట్లోనే ఎలా తయారుచేసుకోవాలో తెలుసుకుందాం.

పుచ్చకాయ ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి మీకు పుచ్చకాయ రసం, దోసకాయ రసం, పాలపొడి, పెరుగు అవసరం. ముందుగా ఒక గిన్నెలో 2 టేబుల్ స్పూన్ల దోసకాయ, పుచ్చకాయ రసం తీసుకోండి. దానికి 1 టీస్పూన్ పాల పొడి, పెరుగు బాగా కలపండి. దీన్ని ముఖం, మెడపై రాయండి. 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి. తర్వాత చల్లటి నీటితో కడగండి. వేసవిలో మెరిసే చర్మానికి ఇది పర్ఫెక్ట్ హోంమేడ్ ఫేస్ ప్యాక్.

ఇవి కూడా చదవండి

చందనం ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి మీకు చందనం పొడి, రోజ్ వాటర్ అవసరం. ఒక చెంచా చందనం పొడిలో రోజ్ వాటర్ కలపండి. దీన్ని ముఖం, మెడపై రాయండి. ఆరిపోయే వరకు చర్మంపై ఉంచండి. ఆ తర్వాత గోరువెచ్చని నీటితో కడగండి. ఈ ఫేస్ ప్యాక్ వేసవికి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఫేస్ ప్యాక్ మచ్చలను తొలగించడంలో సహాయపడుతుంది.

పుదీనా ఫేస్ ప్యాక్

దీని కోసం మీకు పసుపు పొడి, పుదీనా ఆకులు అవసరం. ఈ రెండింటిని కలిపి పేస్ట్‌లా చేసుకోవాలి. దీన్ని 15 నిమిషాల పాటు ముఖంపై అప్లై చేయాలి. ఆ తర్వాత చల్లటి నీటితో కడగాలి. ఈ ఫేస్ ప్యాక్ మండే వేడిలో చర్మాన్ని చల్లబరుస్తుంది. దీంతో చర్మం పొడిబారడం తగ్గుతుంది.

ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్

ఈ ఫేస్ ప్యాక్ చేయడానికి మీకు ముల్తానీ మట్టి, రోజ్ వాటర్ అవసరం. ఈ రెండింటిని ఒక గిన్నెలో వేసి బాగా కలపాలి. తర్వాత దీన్ని ముఖం, మెడపై అప్లై చేయాలి. 20 నుంచి 25 నిమిషాల పాటు ఆరనివ్వాలి. ఆ తర్వాత చల్లటి నీటితో ముఖాన్ని కడుక్కోవాలి. ముల్తానీ మట్టి ముఖంలో మెరుపును తీసుకురావడానికి పనిచేస్తుంది.

గమనిక :- అధ్యయనాలు.. ఆరోగ్య నిపుణుల సూచనలు.. ఇతర ఆరోగ్య సంబంధిత నివేదికల ప్రకారం ఈ వివరాలను అందించాం. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమే. ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలపట్ల నిర్ణయాలను తీసుకునే ముందు వైద్యులను సంప్రదించండి.

మరిన్ని హెల్త్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి