Turmeric Water: పసుపు నీరు తాగుతున్నారా..? ఇది తెలుసుకోకుంటే మీ హెల్త్ ప్రమాదంలో పడినట్లే..?

Turmeric Water Side Effects: ఉదయంపూట పసుపు నీరు తాగడం అందరికీ మంచిది కాదంటున్నారు వైద్య నిపుణులు. కొంత మేరకు మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనీ అనుకుంటారు. కానీ, కొంతమంది అధికంగా తీసుకుంటే లేదా నిర్దిష్ట పరిస్థితుల్లో ఇది ప్రతికూల ప్రభావాలకి కారణం అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయంపై వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

Turmeric Water: పసుపు నీరు తాగుతున్నారా..? ఇది తెలుసుకోకుంటే మీ హెల్త్ ప్రమాదంలో పడినట్లే..?
turmeric water side effects

Updated on: Feb 07, 2026 | 2:50 PM

చాలా మంది ఉదయంపూట గోరువెచ్చని నీరు తాగుతుంటారు. ఇది ఆరోగ్యానికి మంచిది. అయితే, ఇంకొందరు మాత్రం ఆ నీటిలో పసుపును కలిపి తాగుతుంటారు. పసుపు నీరు (Turmeric Water) ని ఉదయంపూట తాగడం ఆరోగ్యానికి మంచిదనే అనుకుంటారు. అయితే, పసుపులోని కర్కుమిన్ అనే సమ్మేళనం శరీరంలో యాంటీ‑ఇన్ఫ్లమేటరీ, యాంటీ‑ఆక్సిడెంట్ లక్షణాలు కలిగి ఉంటుంది. కాబట్టి కొంత మేరకు మన ఆరోగ్యాన్ని కాపాడుతుందనీ అనుకుంటారు. కానీ, కొంతమంది అధికంగా తీసుకుంటే లేదా నిర్దిష్ట పరిస్థితుల్లో ఇది ప్రతికూల ప్రభావాలకి కారణం అయ్యే అవకాశం కూడా ఉంది. ఈ విషయంపై వైద్యులు ఏమంటున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.

పసుపు నీరు తాగడం వల్ల వచ్చే సైడ్‌ఎఫెక్ట్స్

1. రక్తాన్ని పలుచగా చేస్తుంది

పసుపులోని క్యూర్కుమిన్.. రక్తా్న్ని పలుచగా చేయడానికి సహాయపడుతుంది. ఇది కొంతవరకు బ్లడ్డ్ క్లాట్‌ను తగ్గించవచ్చు. కానీ బ్లడ్‌తిన్నర్ మందులు (warfarin వంటి) తీసుకుంటున్నవారికి మాత్రం ఇది మేలు చేయదు. ఎందుకంటే.. ఏదైనా గాయమైనప్పుడు ఎక్కువ రక్తం పోయే ప్రమాదం ఉంది.

2. జీర్ణ సంబంధిత సమస్యలు

పసుపు నీరు అధికంగా తీసుకుంటే కొందరి‌లో వాంతులు, అసిడిటీ, నిరాశ, కడుపు నొప్పి వంటి జీర్ణ సమస్యలు వచ్చే అవకాశమేనని కొన్ని అధ్యయనాలు సూచిస్తున్నాయి.

3. ఐరన్ శోషణ తగ్గిస్తుంది

పసుపు ఎక్కువగా తీసుకుంటే దానిలోని కొన్ని ఫలకాలు ఐరన్ అవశేషాల్ని శరీరంలో ఇమడకుండా చేస్తాయి. దీని వలన ఐరన్ ఉణికి (iron deficiency) సమస్యలు వచ్చే అవకాశముంది. ముఖ్యంగా ఎర్ర రక్తకణాల లోపం ఉన్నవారికి ఇది పెద్ద సమస్యగా మారుతుంది.

4. కాలేయంపై ప్రభావం

పసుపు నీరు సాధారణంగా చిన్న మోతాదులో ఆరోగ్యానికి మంచి అయినా.. ఆధిక మోతాదు లేదా ఎక్కువ కాలం అవసరం లేకుండా ప్రతీరోజు ఎక్కువగా తాగితే కాలేయం మీద అధిక భారం పడుతుంది. ఇది కాలేయ సమస్యలకు దారితీసే ప్రమాదం ఉందని కొన్ని నివేదికలు చెబుతున్నాయి.

5. అలర్జిక్ రియాక్షన్స్

కొంతమంది వ్యక్తులు పసుపు అలర్జీలు కలిగి ఉంటారు. వీరు పసుపు నీటిని తీసుకోవడం వల్ల చర్మం లేదా ఇతర ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి రావచ్చు. అలాంటి వారు పసుపు నీరుకు దూరంగా ఉంటే మంచిది.  అందుకే, పసుపు నీరును ఎక్కువ తీసుకోవడం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. అందుకే, లక్షణాలు, మందులు, ఆరోగ్య పరిస్థితులు అన్నింటిని తెలుసుకుని డాక్టర్‌తో మాట్లాడండి. బ్లడ్‌తిన్నర్ లేదా ఇతర మందులు తీసుకుంటున్నవారు పసుపు నీరు తాగవద్దు. లేదంటే వైద్యులను సంప్రదించి తీసుకోవచ్చు. ఎక్కువ మోతాదు కాకుండా తక్కువ మోతాదులో తీసుకోవడం చిన్న ఆరోగ్య ప్రయోజనాలను మాత్రమే ఇవ్వవచ్చు.

ఉదయాన్నే పసుపు నీరు తాగడం చాలా సార్లు ఆరోగ్యానికి మంచి చేయవచ్చు. కానీ ఒక్కో వ్యక్తి శరీర పరిస్థితి వేరు కావడంతో, అధికగా లేదా నేరుగా తొందరగా ఎక్కువగా తీసుకోవటం శ్రేయస్కరం కాదు. తక్కువ మోతాదులో తీసుకుని, ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకోవాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.

Loading...
Unable to load recommendations.
Follow Us