Hair Care Tips: ఈ హెర్బల్ వాటర్స్ మీ జుట్టు రాలడాన్ని తగ్గించేస్తుంది.. అవేంటంటే..

Hair Care Tips: జుట్టు సంరక్షణ కోసం అనేక హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వాటిని అప్లై చేయడం ద్వారా జుట్టు బలంగా, ఒత్తుగా మారుతుంది.

Hair Care Tips: ఈ హెర్బల్ వాటర్స్ మీ జుట్టు రాలడాన్ని తగ్గించేస్తుంది.. అవేంటంటే..
Herbal
Follow us

|

Updated on: Jul 28, 2022 | 6:56 AM

Hair Care Tips: జుట్టు సంరక్షణ కోసం అనేక హోమ్ రెమెడీస్ ఉన్నాయి. వాటిని అప్లై చేయడం ద్వారా జుట్టు బలంగా, ఒత్తుగా మారుతుంది. ఈ నేపత్యంలో ఇవాళ మనం హెయిర్ కేర్ హెర్బల్ వాటర్స్ గురించి తెలుసుకుందాం. వీటిని తీసుకోవడం వలన జుట్టు రాలే సమస్య పూర్తిగా తగ్గుతుంది.

ఉసిరి నీరు.. ఇందులో అద్భుతమైన ఆరోగ్య సంరక్షణ లక్షణాలు ఉన్నాయి. దీనికి ఆయుర్వేదంలో ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వబడింది. యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండే ఉసిరిని రాత్రి నీటిలో నానబెట్టి, ఉదయాన్నే తినాలి. ఆ వాటర్‌ను కూడా తాగాలి. దీంతో చుండ్రు, జుట్టు రాలడం వంటి సమస్యలు దూరమవుతాయి. అలాగే ఉదర సంబంధిత సమస్యలు కూడా పోతాయి.

ఉల్లిపాయ నీరు.. సల్ఫర్ జుట్టుకు ప్రయోజనకరంగా పరిగణించబడుతుంది. సల్ఫర్ ఉల్లిపాయలలో ఎక్కువగా ఉంటుంది. వెంట్రుకలు నల్లగా ఉండేందుకు తోడ్పడే ఉల్లిపాయను తురిమి, దాని రసం తీసి నీటిలో కలుపుకుని తాగాలి. కొద్ది రోజుల్లోనే తేడాను మీరు చూడగలరు.

బ్లాక్ టీ.. ఈ హెర్బల్ టీ ద్వారా జుట్టు నెరసిపోకుండా కాపాడుకోవచ్చు. దీన్ని తయారు చేయడం చాలా సులభం. ఇది అనేక ఆరోగ్య సమస్యలను దూరం చేస్తుంది.

కొబ్బరి నీరు.. కొబ్బరి నీరు జుట్టు సంరక్షణ పరంగా ఆల్‌రౌండర్‌గా పరిగణించబడుతుంది. ఇది జుట్టుకు మాత్రమే కాకుండా ఆరోగ్యానికి, చర్మానికి కూడా మేలు చేస్తుంది. రోజూ ఒక గ్లాసు కొబ్బరినీళ్లు తాగడం వల్ల పోషకాల లోపం తొలగిపోయి జుట్టు ఆరోగ్యంగా మారుతుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..