పిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయా.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసం..

|

Nov 28, 2022 | 7:22 AM

ఆధునిక జీవితంలో నిత్యం మనం తీసుకునే కల్తీ ఆహార పదార్థాలు, పొల్యూషన్, నిద్ర సమయాలు మారడం, తదితర విషయాల వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలలో నివసించే వారికి ఈ సమస్య..

పిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయా.. ఈ సింపుల్ టిప్స్ మీ కోసం..
Anti Aging Tips
Follow us on

ఆధునిక జీవితంలో నిత్యం మనం తీసుకునే కల్తీ ఆహార పదార్థాలు, పొల్యూషన్, నిద్ర సమయాలు మారడం, తదితర విషయాల వల్ల చాలామంది ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాలలో నివసించే వారికి ఈ సమస్య ఎక్కువగా ఉంటుంది. ఉరుకుల పరుగుల బిజీ లైఫ్‌లో అందంపై శ్రద్ధ పెట్టే సమయమే లేకుండా పోతుంది. దీంతో చిన్న వయసులోనే ముఖంపై ముడతలు వస్తున్నాయి. తక్కువ వయసులోనే ఎక్కువ వయసువారిలా కనిపిస్తున్నారు. వ‌ృద్ధాప్య చాయలతో ఇబ్బందిపడుతున్నారు. ఇలాంటి వారు తమ డైట్‌లో బాదం పప్పును చేర్చుకుంటే మంచి ఫలితాలు ఉంటాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముడతలతో వయసు పైబడిన వారిలా కనిపిస్తే… పిగ్మెంటేషన్ మచ్చలతో ముఖమంతా అంద విహీనంగా మారుతుంది. ఈ సమస్య నుంచి బయటపడడానికి కొన్ని టిప్స్ పాటించినా ఒక్కోసారి సైడ్ ఎపెక్ట్‌ భారిన పడే అవకాశం ఉంది. అందుకే బాదం పప్పును ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మహిళలు ఈ సమస్యలను అధిగమించవచ్చని పలు అధ్యయనాల్లో తేలింది. ముఖ్యంగా మహిళల ముఖాలపై ముడతలు, చర్మం రంగు మారడం వంటి సమస్యల తీవ్రతను తగ్గించడంలో బాదం దివ్య ఔషధంగా పనిచేస్తుందంటున్నారు నిపుణులు.

బాదం పప్పులో అధికంగా ఉండే ఆల్ఫా టోకోఫెరాల్‌ కారణంగానే మహిళల్లో ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యలను తగ్గించవచ్చని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. బాదంలో ఆల్ఫా టోకోఫెరాల్‌ (విటమిన్‌-ఇ), అన్‌శ్యాచురేటెడ్‌ కొవ్వులతో పాటు పలు పోషక పదార్థాలు పుష్కలంగా ఉంటాయి. ఆల్ఫాటోకోఫెరాల్‌లో యాంటీ ఆక్సిడెంట్‌ గుణాలు అధికంగా ఉంటాయి. ఇవి మెనోపాజ్ దశలో ఉన్న మహిళల ముఖాలపై ఉన్న ముడతలు, పిగ్మెంటేషన్ సమస్యల తీవ్రతను తగ్గించేస్తాయి అందుకోసమే డైట్‌లో బాదంను చేర్చుకోవాలి.

ప్రతిరోజూ బాదం పప్పులు తినడం వల్ల మహిళల ముఖంపై ముడతలు తగ్గడమే కాకుండా చర్మపు రంగులో కూడా మార్పులు వస్తున్నాయని భారతీయ సౌందర్య నిపుణుల అధ్వర్యంలో తేలింది. బాదం పప్పుల్లో విటమిన్‌-ఇ అధికంగా ఉంటుంది. వీటితో పాటు అత్యవసర ఫ్యాటీ ఆమ్లాలు, పాలీఫినాల్స్‌ కూడా సమృద్ధిగా ఉంటాయి. మహిళలు తమ చర్మ ఆరోగ్యాన్ని సంరక్షించుకునేందుకు ఈ పోషకాలు ఎంతగానో సహకరిస్తాయి. అందుకే బాదంపప్పు తిని నిత్యం యవ్వనంగా ఉండండని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం చూడండి..