Health: ఒత్తిడి శరీరానికి మంచిదే.. అది మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తుందా.. అధ్యయనంలో కీలక విషయాలు

|

Aug 26, 2022 | 2:54 PM

ఒత్తిడి (Stress) మన ఆరోగ్యానికి మంచిది కాదని, అది తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని మనందరికీ తెలిసిందే. కానీ ఓ అధ్యయనం ప్రకారం ఒత్తిడి ఆరోగ్యానికి మంచిదేనని తేలింది. తక్కువ నుంచి మితమైన స్థాయి ఒత్తిడి కలిగిన వ్యక్తుల మెదడు...

Health: ఒత్తిడి శరీరానికి మంచిదే.. అది మానసిక ఆరోగ్యాన్ని బలపరుస్తుందా.. అధ్యయనంలో కీలక విషయాలు
Depression
Follow us on

ఒత్తిడి (Stress) మన ఆరోగ్యానికి మంచిది కాదని, అది తీవ్ర ఆరోగ్య సమస్యలను కలిగిస్తుందని మనందరికీ తెలిసిందే. కానీ ఓ అధ్యయనం ప్రకారం ఒత్తిడి ఆరోగ్యానికి మంచిదేనని తేలింది. తక్కువ నుంచి మితమైన స్థాయి ఒత్తిడి కలిగిన వ్యక్తుల మెదడు (Mental Health) మంచి పనితీరును కనబరిచిందని నిర్ధరించారు. కొంత స్థాయి ఒత్తిడిని కలిగి ఉంటే ఆ సమయంలో దాని నుంచి బయటపడేదంకు మొదడు చక్కగా ఆలోచినస్తుందని నిపుణులు చెబుతున్నారు. పరీక్ష కోసం చదువుకోవడం, కుటుంబ పరిస్థితులు, సమావేశానికి రెడీ అవడం వంటివి సాధారణంగా ఒత్తిడికి కారణమవుతాయి. మంచి ఒత్తిడి భవిష్యత్తులో ప్రతికూల ప్రభావాలకు వ్యతిరేకంగా టీకాగా పనిచేస్తుందని గుర్తించారు. మానవ మెదడు ఎలా పనిచేస్తుందనే దానిపై అంతర్దృష్టిని అందించే లక్ష్యంతో నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ హెల్త్ నిధులు సమకూర్చిన జాతీయ ప్రాజెక్ట్ అయిన హ్యూమన్ కనెక్టోమ్ ప్రాజెక్ట్ నుంచి వచ్చిన డేటా ఆధారంగా పరిశోధకులు ఈ విషయాలను గ్రహించారు. ఇందు కోసం అధ్యయనం చేసేందుకు 1,200 మందిపై పరిశోధనలు చేశారు. వారి ఒత్తిడి లెవెల్స్ ను నమోదు చేశారు. నిర్దిష్ట ఆలోచనలు లేదా భావాలను ఎంత తరచుగా ఒత్తిడికి లోనవుతున్నారు అనే ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఉదాహరణకు “గత నెలలో, ఊహించని విధంగా జరిగిన దాని వలన మీరు ఎంత కలత చెందారు?” అలాంటివన్నమాట.

ప్రతిస్పందనలను అణిచివేసే సామర్థ్యాన్ని కొలిచే పరీక్షలను ఉపయోగించి వారి న్యూరోకాగ్నిటివ్ సామర్ధ్యాలను అంచనా వేశారు. పరిశోధకులు ఆ ఫలితాలను ఇతర ప్రవర్తనా భావోద్వేగ సమస్యలను ఇతర సాధారణ వ్యక్తులతో పోల్చారు. సాధారణంగా మనలో చాలా మందికి కొన్ని ప్రతికూల అనుభవాలు ఉంటాయి. అవి మనల్ని బలహీనపరుస్తాయని అనుకుంటాం. కానీ అవే మనల్ని బలపరుస్తాయి. కొంచెం ఒత్తిడి జ్ఞానానికి మంచిదే అయినప్పటికీ.. అధిక ఒత్తిడి మాత్రం శారీరకంగా, మానసికంగా చాలా హాని కలిగిస్తాయి.

నోట్.. ఈ కథనంలో పేర్కొన్న విషయాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. వీటిని పాటించే ముందు నిపుణుల సలహాలు తీసుకోవడం ఉత్తమం.

ఇవి కూడా చదవండి

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి