CPR Treatment: అప్పటి వరకు ఆడుతూ పాడుతూ కళ్లముందే తిరిగే వారు చూస్తుండగానే క్షణాల్లో ప్రాణాలు కోల్పోయిన ఘటలను చాలా చూస్తుంటాం. దానికి కారణం.. కార్డియాక్ అరెస్ట్. ఈ కార్డియాక్ అరెస్ట్ ద్వారా వ్యక్తులు క్షణాల్లోనే ప్రాణాలు కోల్పోతున్నారు. అయితే, ప్రమాదంలో పడిన గుండెకు సత్వర చికిత్స అత్యవసరం. గుండెపోటు వచ్చిందంటే.. ఆస్పత్రికి చేర్చి వైద్య చికిత్స అందించేలోపు ఏమైనా జరిగే ప్రమాదం ఉంది. అందుకే గుండెపోటుకు గురైన వారికి సత్వరంగా ప్రాథమిక చికిత్స అందించాలని వైద్యులు చెబుతున్నారు. ఈ ప్రాథమిక చికిత్సలో అత్యంత కీలకమైనది కార్డియో పల్మనరీ రీససిటేషన్(సిపిఆర్). హృదయ, శ్వాస సంబంధ బాధితులకు సి.పి.ఆర్, ఆటోమేటెడ్ ఎక్స్‌టర్నల్ డీఫిబ్రిలేషన్ చికిత్సలతో బాధితులను ప్రాణాపాయం నుంచి కాపాడే వీలుందని గుండె సంబంధిత వైద్య నిపుణులు చెబుతున్నారు.
వైద్య నిపుణులు తెలిపిన వివరాల ప్రుకారం.. వాస్తవానికి కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తులు కొలుకునే అవకాశాలు క్షణ క్షణానికి తగ్గుతాయి. అయితే, కార్డియాక్ అరెస్ట్‌కు గురైన వ్యక్తులకు వెంటనే సీపీఆర్ చేయడం ద్వారా ప్రాణాపాయం నుంచి బయటపడే అవకాశాల ఎక్కువగా ఉంటాయి. అందుకే గుండెపోటుకు గురైన వ్యక్తికి సత్వరమే సీపీఆర్ చేయాల్సి ఉంటుంది. ఇకపోతే.. కార్డియాక్ అరెస్ట్‌కు గురై ఆస్పత్రికి చేరుకునేలోపు సి.పి.ఆర్ అందుకుంటున్న బాధితుల సంఖ్య కేవలం 46 శాతమే ఉంటుండగా.. వారిలోనూ సీపీఆర్ చేసిన తర్వాత కేవలం 12 మంది మాత్రమే ప్రాణాపాయం నుంచి బయటపడుతున్నట్లు గణాంకాలు తెలుపుతున్నాయి.
ఇదిలాఉంటే.. ప్రపంచ వ్యాప్తంగా 1.7 కోట్ల మంది ప్రజలు గుండె జబ్బులతో మరణిస్తున్నారని డబ్ల్యూహెచ్ఓ చెబుతోంది. కార్డియాక్ అరెస్టుతో ప్రతి 90 సెకన్లకూ ఒకరు మరణిస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కేన్సర్ మరణాల కంటే గుండె జబ్బుల మరణాలు ఎక్కువగా నమోదవడం కలకలం రేగుతోంది. ఇక ప్రతి లక్ష మందిలో 4,280 మరణాలు సడెన్ కార్డియాక్ అరెస్టు వల్లే చోటు చేసుకుంటున్నట్టు భారత వైద్య ఆరోగ్య మంత్రిత్వ శాఖ గణాంకాలు చెప్తున్నాయి. అయితే ఈ మరణాలన్నింట్లో 30 శాతం ఆస్పత్రి చేరుకున్న తర్వాత సంభవిస్తుండగా.. 70 శాతం మరణాలు ఆస్పత్రికి చేరుకునే లోపు సంభిస్తున్నాయి. అందుకే ప్రతీ ఒక్కరూ సీపీఆర్, ఏఈడీపై అవగాహన కలిగి ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. పాశ్చాత్య దేశాల్లోని ప్రజలకు సీపీఆర్ పట్ల అవగాహన ఉందని, మన దేశంలోనూ ప్రజలకు దీనిపట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు.
Also read:
Migraine Relief Tips: మైగ్రేన్‌తో ఇబ్బంది పడుతున్నారా?.. అయితే ఇలా ఉపశమనం పొందండి..