AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

El Niño Health Alert: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైరిస్క్‌ జోన్‌లో భారత్‌.. WHO హెచ్చరిక!

El Niño Health Alert: WHO హెచ్చరిక ప్రకారం చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, వీధి వ్యాపారులు వంటి వారు ఎండలో..

El Niño Health Alert: ఎల్‌నినో ఎఫెక్ట్‌.. హైరిస్క్‌ జోన్‌లో భారత్‌.. WHO హెచ్చరిక!
Health Risks
Subhash Goud
|

Updated on: Nov 14, 2026 | 10:49 AM

Share

El Niño Health Alert: ప్రపంచవ్యాప్తంగా వాతావరణ మార్పులు ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే ప్రమాదం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) హెచ్చరించింది. ముఖ్యంగా ఎల్‌నినో ప్రభావంతో తీవ్రమైన వేడి, కరువు, అంటువ్యాధులు, ఆహార కొరత వంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉందని డబ్ల్యూహెచ్‌వో హెచ్చరిచింది. ఈ నేపథ్యంలో ఎల్‌నినోపై తన గ్లోబల్‌ స్పందనను అత్యున్నత స్థాయి అయిన గ్రేడ్‌-3 అత్యవసర స్థాయికి పెంచింది. భారత్‌ను కూడా అధిక లేదా అత్యధిక ఆరోగ్య ముప్పు ఉన్న దేశాల జాబితాలో చేర్చింది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సెప్టెంబర్ 2026 ప్రపంచ అంచనాలో అధిక లేదా అత్యధిక ఆరోగ్య ప్రమాదాలను ఎదుర్కొంటున్నట్లు గుర్తించిన దేశాలలో భారతదేశం కూడా ఒకటి. దక్షిణాసియాలోని చాలా ప్రాంతాలలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు, పొడి పరిస్థితులు నెలకొంటాయని అంచనా వేస్తున్నందున, దీని వలన సంభవించే పరిణామాలు కేవలం వడగాలులు, నీటి కొరతకే పరిమితం కాకుండా అంటువ్యాధులు, పోషకాహార లోపం, ఆరోగ్య సంరక్షణ సేవలకు అంతరాయాల వరకు విస్తరించవచ్చు.

ఎల్‌నినో అంటే ఏమిటి?

ఎల్‌నినో అనేది పసిఫిక్‌ మహాసముద్రంలోని మధ్య, తూర్పు ప్రాంతాల్లో సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే పెరగడం వల్ల ఏర్పడే సహజ వాతావరణ పరిణామం. దీని ప్రభావంతో ప్రపంచంలోని పలు ప్రాంతాల్లో వర్షపాతం, ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటుచేసుకుంటాయి. కొన్ని ప్రాంతాల్లో తీవ్రమైన ఎండలు, కరువు పరిస్థితులు ఏర్పడితే.. మరికొన్ని ప్రాంతాల్లో అధిక వర్షాలు, వరదలు సంభవించవచ్చు. ఈ మార్పులు ప్రజల ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతాయి. ఎల్‌నినో నేరుగా వ్యాధులను కలిగించదు. కానీ వ్యాధులు వ్యాప్తి చెందడానికి అనుకూలమైన పరిస్థితులను సృష్టించగలదు.

మారుతున్న వాతావరణ సరళి, ముఖ్యంగా పిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారిలో ఇప్పటికే ఉన్న ఆరోగ్య బలహీనతలను ఎలా తీవ్రతరం చేయగలదో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) అంచనా స్పష్టం చేస్తోంది. వాతావరణ మార్పుల వల్ల వచ్చే వ్యాధులు, ఆరోగ్య సంరక్షణ అందుబాటులో అసమానతలు, రుతుపవన వర్షాలపై ఆధారపడటం వంటివి సన్నద్ధతను అత్యంత కీలకం చేస్తున్న భారతదేశానికి ఈ సంస్థ హెచ్చరిక ప్రత్యేకంగా ముఖ్యమైనది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) తాజా నివేదిక ఏమి చెబుతోందో భారతదేశం గమనించవలసిన ఆరోగ్య ప్రమాదాలు ఏమిటో, సత్వర చర్యలు ఎందుకు ముఖ్యమో తెలుసుకుందాం..

భారత్‌కు ఎలాంటి ఆరోగ్య ముప్పులు ఉన్నాయి?

WHO సెప్టెంబర్‌ 5న విడుదల చేసిన 2026 గ్లోబల్‌ పబ్లిక్‌ హెల్త్‌ నివేదికలో భారత్‌ను అధిక లేదా అత్యధిక ఆరోగ్య ప్రమాదం ఉన్న దేశాల్లో ఒకటిగా గుర్తించింది. దక్షిణాసియాలో సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉండటంతో పలు సమస్యలు తలెత్తవచ్చని అంచనా వేసింది.

  1. తీవ్రమైన ఎండలు, వడదెబ్బ: ఉష్ణోగ్రతలు అధికంగా నమోదైతే డీహైడ్రేషన్‌, వడదెబ్బ, హీట్‌ స్ట్రోక్‌ వంటి సమస్యలు ఎదురుకావచ్చు. ముఖ్యంగా వృద్ధులు, చిన్నపిల్లలు, గర్భిణులు, బయట పనిచేసే కార్మికులు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. గుండె, శ్వాసకోశ, కిడ్నీ సంబంధిత సమస్యలు ఉన్నవారికి కూడా వేడి వల్ల ఇబ్బందులు పెరగవచ్చు.
  2. డెంగ్యూ, మలేరియా ముప్పు: వాతావరణంలో ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో మార్పులు దోమల సంతానోత్పత్తిపై ప్రభావం చూపుతాయి. దీంతో డెంగ్యూ వంటి వ్యాధుల వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. నీటి కొరత కారణంగా ఇళ్లలో నీటిని నిల్వ ఉంచినప్పుడు, వాటిని సరిగా మూతపెట్టకపోతే దోమలు పెరిగే ప్రమాదం ఉంటుంది. ఈశాన్య భారతదేశంలోని కొన్ని ప్రాంతాల్లో మలేరియా ముప్పు కూడా ఉందని WHO పేర్కొంది.
  3. కలుషిత నీటితో వ్యాధులు: అధిక వర్షాలు, వరదలు, పారిశుద్ధ్య సమస్యల కారణంగా తాగునీటి వనరులు కలుషితమయ్యే అవకాశం ఉంది. దీంతో నీటి ద్వారా వ్యాపించే ఇన్ఫెక్షన్లు పెరగవచ్చు. ముఖ్యంగా లెప్టోస్పిరోసిస్‌ వంటి వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని WHO సూచించింది.
  4. ఆహార కొరత, పోషకాహార లోపం: వర్షపాతం తగ్గడం, కరువు పరిస్థితులు వ్యవసాయ దిగుబడులపై ప్రభావం చూపవచ్చు. పంటల ఉత్పత్తి తగ్గితే ఆహార లభ్యత, ప్రజల జీవనోపాధిపై ప్రభావం పడే అవకాశం ఉంది. ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, బాలింతల్లో పోషకాహార లోపం పెరిగే ప్రమాదం ఉంది.
  5. వైద్య సేవలకు అంతరాయం: తీవ్రమైన వాతావరణ పరిస్థితుల వల్ల ఆసుపత్రులు, వైద్య మౌలిక సదుపాయాలు దెబ్బతినవచ్చు. మందుల సరఫరా, అత్యవసర వైద్య సేవలకు అంతరాయం కలగవచ్చు. దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారికి ఇది మరింత ఇబ్బందికరంగా మారే అవకాశం ఉంది.

ఎవరికి ఎక్కువ ప్రమాదం?:

WHO హెచ్చరిక ప్రకారం చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణులు, దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలున్నవారు, వికలాంగులు, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలు ఎక్కువగా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వ్యవసాయ కూలీలు, నిర్మాణ రంగ కార్మికులు, వీధి వ్యాపారులు వంటి వారు ఎండలో ఎక్కువసేపు పనిచేయడం వల్ల వడదెబ్బకు గురయ్యే ప్రమాదం ఎక్కువ. ఎల్‌నినో ప్రభావంతో ఆరోగ్య సమస్యలు తీవ్రమవకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని WHO సూచిస్తోంది. ఇందులో భాగంగా వ్యాధుల పర్యవేక్షణ వ్యవస్థలను బలోపేతం చేయడం, డెంగ్యూ, మలేరియా నివారణ చర్యలు చేపట్టడం, సురక్షితమైన తాగునీటిని అందుబాటులో ఉంచడం, ఆసుపత్రుల్లో అవసరమైన మందులు సిద్ధంగా ఉంచడం వంటి చర్యలు చేపట్టాలని పేర్కొంది.

మొత్తంగా ఎల్‌నినో ప్రభావం ప్రతి ప్రాంతంలో ఒకేలా ఉండదు. భారత్‌లో తప్పనిసరిగా ఆరోగ్య అత్యవసర పరిస్థితి ఏర్పడుతుందని దీని అర్థం కాదు. అయితే వేడి, నీటి కొరత, అంటువ్యాధుల ముప్పులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వాలు, ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని WHO హెచ్చరించింది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
సీన్‌ సక్సెస్‌తో హ్యాట్రిక్‌ హిట్‌ కొట్టిన సూర్య
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
డిసెంబర్‌ 4న బాలీవుడ్‌ బాక్సాఫీస్‌ దగ్గర భారీ క్లాష్‌
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
12 ఏళ్ల తర్వాత తమిళంలో రీఎంట్రీ ఇచ్చిన నజ్రియా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా? " రామాయణ" మేకర్స్ పై ముఖేష్ ఖన్నా
మీకు నచ్చినట్లు మార్చేస్తారా?
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
బాసర ట్రిపుల్ ఐటీలో మురుగునీటి కలకలం..చర్మవ్యాధులతో విద్యార్థులు
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఇంటి కిటికీకి చుట్టుకుని కూర్చున్న భారీ కొండచిలువ..!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
ఏపీ ప్రజలకు సంక్రాంతి కానుక.. తక్కువ ధరకే 3 నిత్యావసర సరుకులు!
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
బంగాళాఖాతంలో మళ్లీ అలజడి..ఏపీకి మళ్లీ తుఫాన్ ముప్పు..
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
ఆన్‌లైన్ లో ఫుడ్ ఆర్డర్ చేస్తున్నారా? ఇది చూస్తే ఛీ యాక్ అంటారు
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో
అమ్మో నడక మార్గంలో భారీ కొండ చిలువ.. చూస్తే వణకాల్సిందే వీడియో