AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రోజూ తినే అన్నంతో ఆరోగ్యానికి ముప్పా..! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు..!

ప్రతి రోజూ మనకు శక్తినిచ్చే అన్నం.. ఇప్పుడు ఆరోగ్యానికి ముప్పుగా మారుతోందని తాజా పరిశోధనలు హెచ్చరిస్తున్నాయి. వేగంగా మారిపోతున్న వాతావరణ పరిస్థితులు, ముఖ్యంగా ఉష్ణోగ్రతలు పెరగడం, గాలిలో కార్బన్ డయాక్సైడ్ స్థాయి పెరగడం లాంటి అంశాలు మన పంటలపై విపరీత ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా వరి ధాన్యం విషపదార్థాలను అధికంగా శోషించుకుంటుందని నిపుణులు పేర్కొంటున్నారు.

రోజూ తినే అన్నంతో ఆరోగ్యానికి ముప్పా..! తాజా పరిశోధనలో షాకింగ్ నిజాలు..!
Eating Rice
Prashanthi V
|

Updated on: Jun 26, 2025 | 5:31 PM

Share

గ్లోబల్ వైద్య జర్నల్‌ లో వచ్చిన అధ్యయన వివరాల ప్రకారం.. 2050 నాటికి ఆసియా ఖండంలోని అనేక దేశాల్లో ప్రధానంగా తినే అన్నం వల్ల క్యాన్సర్ ముప్పు పెరిగే అవకాశముందని తేలింది. వీటిలో భారత్, చైనా, బంగ్లాదేశ్, నేపాల్, వియత్నాం, థాయిలాండ్, ఫిలిప్పీన్స్ లాంటి దేశాలు ముందు వరుసలో ఉన్నాయి. ఈ పరిశోధన అమెరికాలోని కొలంబియా విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు నిర్వహించారు.

తాజా సమాచారం ప్రకారం.. వాతావరణంలో జరిగే మార్పుల వల్ల నేలలోని మూలకాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా ఆర్సెనిక్ అనే విషపదార్థం స్థాయి పెరుగుతోందని అధ్యయనంలో తేలింది. ఈ ఆర్సెనిక్ అన్నంలోకి చాలా సులభంగా చేరుతుంది. మట్టిలో ఉండే ఆర్సెనిక్, సాగునీటిలో ఉన్న ఆర్సెనిక్ వలన వరి ధాన్యంలో ఇది ఎక్కువగా నిల్వ ఉంటుంది. వండే సమయంలో ఉపయోగించే నీటిలో ఆర్సెనిక్ ఉంటే అది కూడా అన్నంలోకి చేరే అవకాశం ఉంటుంది.

మన శరీరంలో ఆర్సెనిక్ చేరితే ఇది ఊపిరితిత్తులు, మూత్రాశయం, చర్మం లాంటి అవయవాలలో క్యాన్సర్ ఏర్పడే అవకాశాన్ని పెంచుతుంది. ఇది మాత్రమే కాకుండా.. గుండె సంబంధిత వ్యాధులు, మధుమేహం లాంటి దీర్ఘకాలిక వ్యాధుల ముప్పు కూడా పెరుగుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు.

ఈ సమస్యను పరిష్కరించాలంటే ముందుగా మట్టి నీటి నాణ్యతపై కఠిన నియంత్రణ అవసరం. అలాగే వరి సాగు విధానాల్లో మార్పులు తీసుకురావాలి. ప్రాంతాల వారీగా పర్యావరణ పరిరక్షణ, శుద్ధి విధానాలు పాటించడం ద్వారా దీన్ని నియంత్రించవచ్చు. వర్షపు నీటి వాడకం, పదార్థాల శుద్ధి, ఆరోగ్యదాయక వంట నీటి వినియోగం లాంటి అంశాలపై గ్రామ స్థాయిలో అవగాహన పెరగాలి.

అన్నం మన జీవితంలో విడదీయరాని భాగం. అయితే మారుతున్న వాతావరణం అన్నంపై చూపే ప్రభావం మన ఆరోగ్యాన్ని ప్రశ్నార్థకం చేస్తోంది. కాబట్టి భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని అన్నం పండించడంలో, శుద్ధి చేయడంలో, వాడటంలో మార్పులు తీసుకురావడం చాలా అవసరం.

Follow Us
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో
ఆర్టీసీ బస్సు నడిపిన ఎమ్మెల్యే.. వైరల్ అవుతున్న వీడియో
రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మోసం గురించి..
రైల్వే స్టేషన్‌లో ఫోన్ ఛార్జింగ్ పెడుతున్నారా..? ఈ మోసం గురించి..
మందుల కొరత తప్పదా?LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!
మందుల కొరత తప్పదా?LPG సంక్షోభంతో ఆ మెడిసిన్స్‌ దొరుకుడు కష్టమే!
ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !
ఆ ప్లంబర్ సంపాదన.. ఏడాదికి రూ.18 లక్షలు !
ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..
ఎవర్రా మీరంతా.. ఇలా కూడా మోసం చేస్తారా.. ఇది తెలిస్తే..
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
ఉస్తాద్ భగత్ సింగ్ మూవీ రివ్యూ.. పవన్ కల్యాణ్ సినిమా ఎలా ఉందంటే?
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
అలర్ట్ :కొనసాగుతున్న ద్రోణి..తెలుగు రాష్ట్రాల్లో దంచికొట్టన వానలు
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
ధురంధర్ 2 తెలుగు షోలన్నీ రద్దు.. కారణమిదే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
కోట్లు కాదు వందల కోట్లు.. ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన జంతువులు ఇవే
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం
సెకన్లలోనే రైల్వే టికెట్ పొందొచ్చు.. రైల్వేశాఖ కీలక నిర్ణయం