Raw Milk: పచ్చి పాలు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి..

| Edited By: Ram Naramaneni

Dec 16, 2024 | 6:30 PM

అందరూ ఆరోగ్యం కోసం ప్రతిరోజు పాలు తాగాలని నిపుణులు ఎప్పుడు చెబుతుంటారు. ముఖ్యంగా ఎదిగో పిల్లలు తప్పనిసరిగా పాలను తాగాలని సూచిస్తుంటారు. అయితే ప్రస్తుత జనరేషన్‌లో కొంతమంది ఆరోగ్యానికి మంచివని రోగ నిరోధక శక్తి పెరుగుతుందని పచ్చిపాలు తాగుతున్నారు. ఇలా పచ్చిపాలను తాగడం వల్ల ఆరోగ్య ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మరి పచ్చి పాలు తాగడం వల్ల కలిగే అనారోగ్య సమస్యలు ఏంటి పాలను ఎలా తాగితే మంచిది..?

Raw Milk: పచ్చి పాలు తాగుతున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి..
Raw Milk
Follow us on

పాల వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఎక్కువగా చెప్పాల్సిన పనిలేదు. ప్రతిరోజు గ్లాస్ పాలు తాగితే శరీరానికి కావాల్సినంత బలం అందుతుంది. పళ్లు హెల్దిగా తయారవుతాయి. మన ఎముకలు కూడా స్ట్రాంగ్ అవుతాయి. పాలు తాగడం వల్ల చర్మం కూడా ఆరోగ్యంగా ఉంటుంది, హృదయ నాలాల ఆరోగ్యానికి పాలు ఎంతో మంచిది. పాలు తాగితే జుట్టు కూడా హెల్తీగా ఉంటుంది. జీర్ణక్రియకు తోడ్పడుటమే కాకుండా నిరాశను ఎదుర్కోవడానికి సహాయం చేస్తాయి. అయితే ఇన్ని ప్రయోజనాలు ఉన్న పాలను వేడి చేసుకుని తాగితే ఏమీ కాదు. కానీ పచ్చిపాలు తాగకూడదంటున్నారు వైద్య నిపుణులు. ఎందుకు తాగకూడదని చాలామందికి డౌట్ వస్తుంది.  దీనికి సైంటిఫిక్ రీజన్ ఉంది.

పచ్చి పాలలో ఫ్లూ వైరస్ దాదాపు ఐదు రోజుల వరకు సజీవంగా ఉంటుందని.. వాటిని తాగాలంటే పలు జాగ్రత్తలు అవసరమని తాజాగా స్టాండ్ ఫోర్డ్ యూనివర్సిటీ పరిశోధకులు వెల్లడించారు. కాచిన పాల కంటే పచ్చి పాలల్లో ఎంజైమ్స్, పోషకాలు, ప్రోబయోటిక్స్ ఎక్కువగా ఉంటాయని అందరూ అనుకుంటారు. కానీ అలా తాగితే ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అంతేకాకుండా పచ్చిపాలు తాగితే దాదాపు 200కు పైగా వ్యాధులు వచ్చే అవకాశం ఉందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

సాల్మొనెల్ల, కొలై లాంటి బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు వస్తాయని చెబుతున్నారు. పాలు తాగాలనుకునేవారు..  గ్యాస్ మంటను సిమ్‌లో ఉంది ఓ మాదిరి ఉష్ణోగ్రత పెరిగే వరకు వేడి చేయడం వల్ల క్రిములు నశిస్తాయని చెబుతున్నారు. పోషకాలు కూడా మిస్ అవ్వకుండా ఉంటాయని నిపుణులు సూచిస్తున్నారు.

(నోట్‌: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణుల సలహాలు, సూచనల మేరకు అందించడం జరిగింది. ఏవైనా సందేహాలు ఉంటే ఆరోగ్య నిపుణులను నేరుగా సంప్రదించండి.)

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి.