చిన్న వయసులో తరచుగా ఆందోళనకు గురయ్యే వాతావరణంలో పెరగడం.. అధిక ఒత్తిడిని ఎదుర్కోవడం వల్ల తర్వాత కాలంలో ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. చిన్నప్పుడు స్థాయికి మించిన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి అనుభవాలు పెద్దయ్యాక కానీ.. ఆ తర్వాత కానీ.. రిపీట్ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని న్యూయార్క్ సైకాలజిస్టుల అధ్యయనంలో తెలిసింది. ఓల్డ్ ఏజ్‌లో జ్ఞాపక శక్తి తగ్గడానికి అవి కారణం అవుతాయని తాజా అధ్యయనం తెలిపింది.
బిజీ లైఫ్ షెడ్యూల్ వర్క్ ప్రెషర్, పేదరికం, కుటుంబ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, పర్సనల్ ప్రాబ్లమ్స్ లాంటివి 30 ఏళ్ల లోపువారిలో ఆందోళనకు, ఒత్తిడికి కారణం అవుతున్నాయి. చిన్నప్పుడు స్థాయికి మించిన ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్ వంటి అనుభవాలు పెద్దయ్యాక కానీ.. ఆ తర్వాత కానీ.. రిపీట్ అయ్యే ఛాన్స్‌లు ఎక్కువగా ఉన్నాయని న్యూయార్క్ సైకాలజిస్టుల అధ్యయనంలో తెలిసింది. ఓల్డ్ ఏజ్‌లో జ్ఞాపక శక్తి తగ్గడానికి అవి కారణం అవుతాయని తాజా అధ్యయనం తెలిపింది. అలాగే 18 ఏళ్లలోపు వారిని చదువుకునే సమయంలో పేదరికం, సామాజిక ఒంటరితనం వంటివి మానసికంగా ఇబ్బంది పెడుతున్నాయి. కొందరిని డిప్రెషన్‌లోకి నేడుతున్నాయి. దీని ప్రభావం వలన వారు మధ్య వయస్సులోనూ, వృద్యాప్యంలోనూ మానసిక సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు.
జ్ఞాపక శక్తిని బలహీనపరచడంలో చిన్న వయస్సులో ఎదుర్కొనే అధిక ఒత్తిడి అనుభవాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని ఫ్రాన్స్‌లోని బోర్డిఎక్స్ యూనివర్సిటీ నిపుణులు తెలిపారు. అధ్యయనంలో భాగంగా వీరు నిద్ర, ఆకలి, ఏకాగ్రత, సోషల్ ఐసోలేషన్ ,డిప్రెషన్, సామర్థ్యం, విచారం, వంటి అంశాలను ఎనలైజ్ చేశారు. ఈ సందర్భంగా యవ్వనంలో డిప్రెషన్‌తో బాధపడినవారు మధ్య వయస్సులో బలహీనమైన జ్ఞాపకశక్తిని కలిగి ఉన్నట్లు గుర్తించారు. అయితే ఈ డిప్రెసివ్ డిజార్డర్ లక్షణాలు అందరిలో ఒకేలా ఉండడం లేదు. ఆ వ్యక్తులు పుట్టి పెరిగిన వాతావరణం.. ఒత్తిడిని వారు స్వీకరించి, ఫీలయ్యే విధానాన్ని బట్టి కూడా ప్రభావం చూపుతాయని వైద్యులు అంటున్నారు. తమ అధ్యయనం వృద్ధాప్యంలో వచ్చే డెమెన్షియాను మరింత విస్తృతంగా అర్థం చేసుకునేందుకు దోహదపడిందని పరిశోధకులు చెబుతున్నారు.
(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. తదుపరి జరిగే ఎలాంటి పరిణామాలకు TV9 Telugu.com బాధ్యత వహించదు.)