Diabetes Care: డయాబెటిక్ బాధితులకు అలర్ట్.. శరీరంపై ఇలాంటి పుండ్లు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..

|

Apr 08, 2022 | 9:22 AM

Diabetes patients: డయాబెటిక్ బాధితులు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మధుమేహ బాధితుల్లో ఫుట్ అల్సర్ అనేది చాలా కాలం పాటు ఉంటుంది. ఈ సమస్య రక్తంలో చక్కెర స్థాయిలు

Diabetes Care: డయాబెటిక్ బాధితులకు అలర్ట్.. శరీరంపై ఇలాంటి పుండ్లు కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకండి..
Diabetes Care
Follow us on

Diabetes patients: డయాబెటిక్ బాధితులు ఎప్పుడూ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. మధుమేహ బాధితుల్లో ఫుట్ అల్సర్ అనేది చాలా కాలం పాటు ఉంటుంది. ఈ సమస్య రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం వల్ల ఏర్పడుతుంది. సాధారణంగా ఈ అల్సర్ పుండ్లు బొటనవేలు, కాలి కింద భాగన ఏర్పడతాయి. అటువంటి పరిస్థితిలో చర్మం కింద కణాలు దెబ్బతిని.. దాని కింద పొరలుగా కనిపించడం (diabetic foot ulcer) ప్రారంభమవుతుంది. ఈ పుండు మీ ఎముకలను కూడా ప్రభావితం చేస్తుంది. అయితే.. డయాబెటిక్ పేషెంట్లు మీ పాదంలో ఏదైనా గాయం లేదా పుండ్లు ఉంటే అజాగ్రత్తగా అస్సలు ఉండకూడదని నిపుణులు సూచిస్తున్నారు. వెంటనే నిపుణులను సంప్రదించి చికిత్స తీసుకోవాలని.. లేకుంటే అది తీవ్రరూపం దాల్చుతుందని హెచ్చరిస్తున్నారు.

డయాబెటిక్ ఫుట్ అల్సర్.. కారణాలు

డయాబెటిక్ ఫుట్ అల్సర్ రావడానికి ప్రధాన కారణం రక్తంలో చక్కెర స్థాయిలు పెరగడం. చక్కెర స్థాయి పెరుగుదల కారణంగా కొన్నిసార్లు పాదాలలో, శరీరంలోని ఇతర భాగాలలో చిన్న చిన్న గాయాలు (పుండ్లు) కనిపిస్తాయి. సకాలంలో చికిత్స చేయకపోతే అవి తీవ్రంగా మారవచ్చు. కొన్నిసార్లు శస్త్రచికిత్స కూడా అవసరం కావచ్చు. డయాబెటిస్ ఉండి.. అలాగే అధిక బరువు, విటమిన్ డి లోపం ఉన్నట్లయితే వారికి డయాబెటిక్ ఫుట్ అల్సర్ వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

ఈ లక్షణాలు వస్తాయి

పాదాలలో అసాధారణమైన వాపు, మంట, ఎరుపు, దుర్వాసన, పుండ్ల నుంచి నీరు కారడం, చర్మం రంగులో మార్పు, పాదాలలో తిమ్మిరి, తిమ్మిర్లు, నొప్పి, పుండ్లు లాంటి లక్షణాలు కనిపిస్తాయి. కొన్నిసార్లు ఇలాంటి లక్షణాలు కనిపించకపోయినా.. చర్మం రంగు మాత్రమే మారుతుంది లేదా నొప్పి వస్తుంది. అటువంటి పరిస్థితిలో కూడా మీరు వెంటనే నిపుణుడిని సంప్రదించాలి.

చికిత్స 

డయాబెటిక్ ఫుట్ అల్సర్ నిపుణులు వ్యాధి పరిస్థితిని అంచనా వేసి నిర్ణయం తీసుకుంటారు. ప్రారంభ దశలో మందుల ద్వారా చికిత్స చేయవచ్చు. కానీ పరిస్థితి తీవ్రంగా ఉంటే శస్త్రచికిత్స కూడా చేయాల్సి ఉంటుంది. పరిస్థితి తీవ్రం కాకుండా ఉండటానికి మధుమేహాన్ని నియంత్రించడం, ఇన్ఫెక్షన్ నుంచి గాయాన్ని రక్షించడం చాలా ముఖ్యం.

రక్షణకు ఇలా చేయండి.. 

– పాదాలను క్రమం తప్పకుండా శుభ్రం చేసుకోవాలి.

– కాలి గోళ్లను క్రమం తప్పకుండా కత్తిరించండి.

– షుగర్‌ని అదుపులో ఉంచుకోవడానికి, వర్కవుట్‌లు చేయండి. సమతుల్య ఆహారం తీసుకోండి .

– అరికాళ్లను పొడిగా ఉంచాలి .

– శరీరంలో విటమిన్ డి లోపం ఉండకూడదు. ప్రతిరోజూ ఉదయం 9 గంటల వరకు సూర్యకాంతిలో కాసేపు ఉంటే విటమిన్ డీ లోపం నుంచి అధిగమించవచ్చు.

(ఈ కథనంలో అందించిన సమాచారం కేవలం సమచారం కోసం మాత్రమే.. నిపుణులను సంప్రదించిన తర్వాత మాత్రమే వీటిని అనుసరించడం మంచిది.)

Also Read:

Health Tips: మండే ఎండలు.. మీకు తరచూ వేడి చేస్తుందా.. ఇదిగో టిప్స్

Eye Tips: వయసు పెరుగుతున్నకొద్ది కళ్లు దెబ్బతింటాయి.. ఈ నాలుగు జాగ్రత్తలు పాటిస్తే కళ్లు ఆరోగ్యవంతం