Health Tips: నాలుగే నాలుగు ఆకులు చాలు.. ఉదయాన్నే ఈ ఒక్క పని చేస్తే మీ జీవితమే మారిపోతుంది..

కరివేపాకు తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో కొన్ని కరివేపాకుల్ని నమలడం ద్వారా జుట్టు రాలడం తగ్గుతుంది.. జీర్ణక్రియ మెరుగుపడుతుంది.. బరువు తగ్గుతారు.. కరివేపాకులు చెడు కొలెస్ట్రాల్‌ ను కూడా నియంత్రిస్తాయి.. అంతేకాకుండా, కంటిచూపు మెరుగుపరచడానికి కూడా ఇవి సహాయపడతాయి.

Health Tips: నాలుగే నాలుగు ఆకులు చాలు.. ఉదయాన్నే ఈ ఒక్క పని చేస్తే మీ జీవితమే మారిపోతుంది..
Curry Leaves Benefits

Updated on: Feb 06, 2026 | 9:24 PM

మన నిత్య జీవితంలో చిన్నపాటి మార్పులు చేసుకోవడం వల్ల కొన్నిసార్లు అనూహ్యమైన ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన మార్గం ఉదయాన్నే కొన్ని కరివేపాకుల్ని తినడం.. అవును.. కరివేపాకు ఆకులను ఉదయాన్నే తింటే ఎన్నో ప్రయోజనాలను పొందవచ్చు.. మన వంట ఇంట్లో నిత్యం ఉండే కరివేపాకులు కేవలం కూరలకు రుచి, సువాసనను మాత్రమే కాదు, సంపూర్ణ ఆరోగ్యానికి ఎన్నో లాభాలను అందిస్తాయి. చాలామంది కూరల్లో కరివేపాకుల్ని పక్కన పెట్టేస్తుంటారు.. కానీ వాటి ప్రయోజనాలు తెలిస్తే ఎవరూ వాటిని వదులుకోరు. ఇవి మన చర్మం, జుట్టు ఆరోగ్యంతో పాటు మొత్తం శారీరక వ్యవస్థకు రక్షణ కల్పిస్తాయి. అందుకే వంటల్లో వాడటంతో పాటు, ఉదయాన్నే ఖాళీ పొట్టతో కొన్ని కరివేపాకుల్ని తినడం అత్యంత మేలు చేస్తుంది. మొదట్లో కాస్త చేదుగా అనిపించినా, క్రమంగా అలవాటు పడిపోతారు.

కరివేపాకుల్లో ఎన్నో పోషకాలు..

కరివేపాకుల్లో విటమిన్ సి, ఫాస్ఫరస్, ఐరన్, కాల్షియం, నికోటినిక్ యాసిడ్ వంటి ముఖ్యమైన పోషకాలు సమృద్ధిగా ఉంటాయి. ఈ పోషకాలు శరీరానికి అనేక విధాలుగా సహాయపడతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

జుట్టు ఆరోగ్యానికి మంచిది: జుట్టు రాలే సమస్యతో బాధపడేవారు ఉదయం నిద్ర లేవగానే ముందుగా ఒక గ్లాసు మంచినీరు తాగాలి. కొన్ని నిమిషాల తర్వాత నాలుగైదు కరివేపాకుల్ని నోట్లో వేసుకొని బాగా నమిలేయాలి. ఆ తర్వాత అరగంట పాటు ఏమీ తినకుండా ఉండాలి. ఈ విధానం జుట్టు రాలడాన్ని తగ్గించి, దాని ఎదుగుదలకు తోడ్పడుతుంది. కూరల్లో కరివేపాకుల్ని ఎక్కువగా వాడటం కూడా జుట్టు రాలే సమస్యను తగ్గించడంలో సహాయపడుతుంది.

జీర్ణక్రియ మెరుగుదలకు మంచిది: కరివేపాకుల్ని తినడం వల్ల పొట్టలో జీర్ణక్రియ మెరుగుపడుతుంది. ఖాళీ పొట్టతో వీటిని నమలడం వల్ల జీర్ణ వ్యవస్థలోని ఎంజైమ్‌లు క్రమబద్ధీకరించబడతాయి. ఇది మూత్రనాళం చక్కగా పనిచేసేలా చేసి, మలబద్ధకం వంటి సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తుంది. కొందరికి ఉదయం లేవగానే బద్ధకంగా, వికారంగా అనిపిస్తుంది. ఈ సమస్య కరివేపాకులతో తీరిపోతుంది. జీర్ణక్రియ వ్యవస్థ సక్రమంగా పనిచేయడం వల్ల వికారం, వాంతులు అయ్యే పరిస్థితి నుండి బయటపడవచ్చు.

బరువు తగ్గడంలో – కొలెస్ట్రాల్ నియంత్రణలో సహాపడుతుంది: బరువు తగ్గాలని కోరుకునేవారు కరివేపాకుల్ని తమ ఆహారంలో భాగంగా చేసుకోవాలి. ఇవి శరీరంలో పేరుకుపోయిన చెడు వ్యర్థాలను బయటకు పంపడంలో సహాయపడతాయి. ముఖ్యంగా, చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించి, కొలెస్ట్రాల్ స్థాయిలను సమతుల్యంగా ఉంచడంలో కరివేపాకులు ప్రభావవంతంగా పనిచేస్తాయి. ఇది గుండె ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది.

కంటి చూపు మెరుగుదలకు మంచిది: కరివేపాకులకు కంటి చూపుతో ప్రత్యక్ష సంబంధం ఉంది. ఎంత ఎక్కువగా కరివేపాకుల్ని తింటే కంటి చూపు అంత ఎక్కువగా మెరుగుపడుతుందని నిపుణులు సూచిస్తున్నారు. ముఖ్యంగా, పాఠశాలకు వెళ్లే పిల్లల ఆహారంలో కరివేపాకు తప్పనిసరిగా ఉండేలా చూసుకోవడం వారి కంటి ఆరోగ్యానికి చాలా అవసరం. కరివేపాకులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కంటి సంబంధిత సమస్యలను నివారించవచ్చు.

ఈ విధంగా కరివేపాకులను మన రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా జుట్టు ఆరోగ్యం నుండి జీర్ణక్రియ, బరువు నియంత్రణ, కంటి చూపు వరకు అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

మీరు ఏమైనా అనారోగ్య సమస్యలతో బాధపడుతుంటే… నిపుణులను సంప్రదించండి..

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..