Common cold: ఏంటి జలుబుతో ఇబ్బందిగా ఉందా..? ఈ సూప్ ఒక కప్పు తాగండి.. ఖతం

|

Jul 08, 2024 | 4:07 PM

ఇప్పుడసలే రెయినీ సీజన్. సీజనల్ వ్యాధులు తెగ అటాక్ చేస్తాయి. అందులో ముఖ్యమైనవి ప్లూ, జలుబు. ఇక జలుబు వచ్చిందంటే.. ఆ ఇబ్బంది మాములుగా ఉండదు. రెండు రోజుల వరకు ముక్కు కారుతూనే ఉంటుంది. అయితే ఈ హోం రెమిడీ ఫాలో అయితే రిలీఫ్ పొందవచ్చు.

Common cold: ఏంటి జలుబుతో ఇబ్బందిగా ఉందా..? ఈ సూప్ ఒక కప్పు తాగండి.. ఖతం
Chicken Soup
Follow us on

జలుబు, ముక్కు దిబ్బడ, గొంతులో గరగర లాంటి సమస్యలకు మన ఇంట్లోని పెద్దలు హోం రెమిడిస్ చెబుతూ ఉంటారు. పసుపు కలిపిన పాలు తాగమని.. వేడివేడి సూప్ తాగమని సజీషన్స్ ఇస్తూ ఉంటారు. ఇలాంటి ఇబ్బందులు ఉన్నప్పుడు వేడి వేడి చికెన్ సూప్ తాగితే చాలా రిలీఫ్ ఉంటుంది. కాగా చికెన్ సూప్ తీసుకోవడం వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మాములుగా మనకు జలుబు చేస్తే.. ఏం తినబుద్ది కాదు. ఇలాంటి చికెన్ సూప్ అయితే టేస్టీగా లోపలకి వెళ్లిపోతుంది. అంతేకాదు శరీరానికి మంచి ఎనర్జీ కూడా లభిస్తుంది. ఇలా సూప్ తీసుకోవడం వల్ల.. శరీరానికి కావాల్సిన అమినో యాసిడ్లు అందుతాయి.

అంతేకాదు ఎప్పుడూ ఆకలిగా లేదు అని చెప్పేవారు.. చికెన్ సూప్ తీసుకుంటే.. ఆకలిగా అనిపించినట్లు తెలిపారని పలు పరిశోధనల ద్వారా వెల్లడైంది. మాంసపు రుచి(ఉమామి)తో కూడిన సూప్‌ను  తీసుకున్నప్పుడు మెదడులో ఉండే నరాలు యాక్టివ్ అయి నాలుకకు టేస్ట్ తెలియచేస్తాయి. అందుకు అనుగుణంగా మన బాడీ కూడా  ఆహారాన్ని సంగ్రహించేందుకు రెడీ అయిపోతుంది.  ఫ్లూ, ముక్కుదిబ్బడ, మందపాటి శ్లేష్మం, జలుబు వంటి సమస్యలు.. తలెత్తినప్పుడు బాడీఅలోని తెల్ల రక్తకణాలు రక్తంలో కలిసి, ఎఫెక్ట్ అయిన శరీర భాగానికి  చేరుకుని తమ పని మొదలుపెడతాయి. తెల్ల రక్తకణాలు ఆ పనిని యాక్టివ్‌గా చేసేందుకు చికెన్ సూప్ బాగా హెల్ప్ చేస్తుందని డైటీషియన్లు చెబుతున్నారు.

అయితే సూప్ తయారు చేసేటప్పుడు చికెన్‌తో పాటు మీ ఇమ్యూనిటీని బూస్ట్ చేసేలా కొన్ని రకాల కూరగాయలు, దినుసులు, సుగంధ ద్రవ్యాలు కూడా వాడుకోవాలి. వేడివేడి చికెన్ సూప్‌ నుంచి వచ్చే వాసన పీల్చడం మూలాన నాసిక, శ్వాసకోశ నాళాల టెంపరేచర్స్ కూడా పెరుగుతాయి. తద్వారా శ్వాసకోశ వ్యాధుల వలన వచ్చే శ్లేష్మం నుంచి కూడా రిలీఫ్ ఉంటుంది.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

(ఇది నిపుణుల నుంచి సేకరించిన సమాచారం. ఫాలో అయ్యేముందు డైటీషియన్లు సలహా తీసుకోండి)