Health: ఏవో పిచ్చి ఆకులు అనుకుంటే మీరు నిజంగా పిచ్చోళ్లే.. తెలుసా వీటి గురించి..?

|

Oct 06, 2024 | 7:03 PM

అరె.. ఈ ఆకులు మా ప్రాంతాల్లో కనిపిస్తాయ్.. పిచ్చి మొక్కలు అనుకున్నాం అని అందరూ మనసులో అనుకుంటూ ఉంటారు. కానీ తరచూ ఈ ఆకులు ఏదో విధంగా ఆహారంగా తీసుకోవడం వలన ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండవచ్చని నిపుణులు అంటున్నారు.

Health: ఏవో పిచ్చి ఆకులు అనుకుంటే మీరు నిజంగా పిచ్చోళ్లే.. తెలుసా వీటి గురించి..?
Ganga Bayalu Kura
Follow us on

ఈ ప్రకృతి మనకు ఎన్నో నేచురల్ మెడిసిన్స్ ఇచ్చింది. మనకే వాటి విలువ తెలియక నిరుపయోగమైనవి అనుకుంటున్నాం. మనకు రోడ్ల పక్కన, పొలాల గెట్ల వెంట.. ఎన్నో ఔషధ గుణాలు ఉన్న మొక్కలు కనిపిస్తూనే ఉంటాయి. వాటిని తెలియక చాలామంది గడ్డి.. పిచ్చి మొక్కలుగా భావిస్తారు. అలా చాలా ప్రాంతాల్లో పాకుతూ పెరిగే మొక్క ఒకటి ఉంది. దాని పేరు గంగ పాయల కూర. పల్లెటూరి వాళ్లకు దీని గురించి తెల్సు. ఈ మొక్క కాడల.. ఆకులు చాలా దళసరిగా ఉంటాయి. ఈ మొక్కలు పసుపు రంగు పూలు పూస్తాయి. దీనిని గోళి కూర, గంగ పాయ అని కూడా పిలుస్తుంటారు. మరికొన్ని ప్రాంతాల్లో.. పెద్ద పావిలి, బొడ్డు పాయల,  పుల్ల పాయల వంటి పేర్లతో కూడా సంభోదిస్తూ ఉంటారు. ఈ ఆకుతో పులుసు కూర చేసుకుంటారు. మరికొందరు పప్పులో వేసుకుంటారు. ఈ ఆకు కూర తినడం వల్ల ఎలాంటి బెనిఫిట్స్ ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం…

  •  గంగపాయల ఆకులో పీచు పదార్ధం ఎక్కువ మోతాదులో ఉంటుంది. ఇక , విటమిన్ A ,విటమిన్ బి , ఒమేగా ౩ ఫాటి ఆమ్లాలు, ఐరన్, పొటాషియం, కాల్షియంలతో పాటు యాంటి ఆక్సిడెంట్స్ కూడా ఈ ఆకుకూర ద్వారా లభిస్తాయి.
  • ఆహారంలో కుదిరినప్పుడు ఈ గంగపాయల కూర చేర్చుకోవడం వల్ల శరీరంలో రక్త శాతం పెరుగుతుంది.
  • ఆ ఆకు కూరలో విటమిన్ ఏ ఉండటంవల్ల కంటి సంబంధిత సమస్యలకు చెక్ పెట్టవచ్చు
  • ఈ ఆకుల్లో పొటాషియం, క్యాల్షియంలు మంచి మొతాడు ఉండటం  వల్ల బాడీలోని ఎముకలు, దంతాలు దృఢంగా ఉంటాయి.
  • ఈ ఆకు కూరలు యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం వల్ల.. వివిధ వ్యాధులకు దూరంగా ఉండవచ్చు
  •  గంగపాయల ఆకులో ఒమేగా 3 ఫాటి ఆమ్లాలు ఉండటం వల్ల బాడీలో పేరుకుపోయిన బ్యాడ్ కొలెస్ట్రాల్ తగ్గించి గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా  కాపాడుతుంది. ఈ ఆకు కూరలో ఉండే జింక్ ఫ్రీరాడికల్స్‌ను నాశనం చేస్తుంది.
  • ఆకులో పీచు పదార్థం ఎక్కువగా ఉండటం వల్ల జీర్ణక్రియకు ఉపయుక్తంగా ఉంటుంది..
  • ఈ ఆకుల నుంచి రసం తీసి పుండ్లు, గాయాలు ఉన్నచోట రాస్తే త్వరగా రిలీఫ్ ఉంటుంది..

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.

మరిన్ని లైఫ్‌ స్టైల్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి..