Weight Loss Tips: బరువు తగ్గేందుకు రాత్రిపూట భోజనంలో ఈ ఆహారాలు చేర్చుకోండి.. ఆరోగ్యకరం కూడా..

|

Jun 17, 2022 | 3:08 PM

Weight Loss Tips: బరువు పెరగడానికి, ఊబకాయానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే. సరైన డైట్ లేకుంటే.. బరువు పెరగడం కూడా అనేక వ్యాధులకు దారితీస్తుంది.

Weight Loss Tips: బరువు తగ్గేందుకు రాత్రిపూట భోజనంలో ఈ ఆహారాలు చేర్చుకోండి.. ఆరోగ్యకరం కూడా..
Weight Loss Foods
Follow us on

Weight Loss Tips: బరువు పెరగడానికి, ఊబకాయానికి ప్రధాన కారణం మన ఆహారపు అలవాట్లే. సరైన డైట్ లేకుంటే.. బరువు పెరగడం కూడా అనేక వ్యాధులకు దారితీస్తుంది. ప్రజలు ఫిట్‌గా ఉండటానికి జిమ్‌కి వెళ్లడం ప్రారంభిస్తారు. వారు తమ జీవనశైలిలో మార్పులు చేసుకుంటుంటారు. అయితే దీనితో పాటు మీరు తినే ఆహారపు అలవాట్లను కూడా మార్చుకోవాల్సి ఉంటుంది. చాలా మంది ప్రజలు జిమ్ కి ముందు, తర్వాత ఏమి తినాలి అనే విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. అయితే ఈ క్రమంలో వారు తీసుకునే అల్పాహారం, లంచ్, డిన్నర్ కూడా ఆరోగ్యంగా ఉండటం కూడా చాలా ముఖ్యం. ప్రజలు ఇప్పటికీ అల్పాహారం, మధ్యాహ్న భోజనంపై ఎక్కువ శ్రద్ధ చూపుతారు. కానీ రోజు అలసట కారణంగా, చాలా మంది రాత్రి భోజనాన్ని తేలికగా తీసుకుంటుంటారు.

మీరు బరువు తగ్గాలనుకుంటే, ఆరోగ్యకరమైన డిన్నర్ ఎంపికల కోసం చూస్తున్నట్లయితే మేము తెలియజేసే కొన్ని విషయాలు మీకు చాలా ఉపయోగకరంగా ఉండవచ్చు. మేము మీకు అలాంటి కొన్ని సులభమైన డిన్నర్ వంటకాల గురించి ఇప్పుడు చెబుతాము. ఇవి రుచికరమైనవి, ఆరోగ్యకరమైనవి, తేలికగా జీర్ణమయ్యేవిగా ఉంటాయి. వాటి వివరాలు ఏమిటంటే..

ఓట్స్ ఇడ్లీ:

ఈ ఆహారంలో ప్రోటీన్లు అలాగే పిండి పదార్థాలు ఉంటాయి. రాత్రి భోజనంలో మాత్రమే కాకుండా అల్పాహారంలో కూడా తినడం ఆరోగ్యకరమైనదిగా పరిగణించబడుతోంది. మీరు డిన్నర్‌లో ఓట్స్ తినాలనుకుంటే.. మీరు దీనికి భిన్నంగా ప్రయత్నించాలి. ఓట్స్ ఇడ్లీ కూడా ఆరోగ్యకరమైనది. రుచిగా కూడా ఉంటుంది. విశేషమేమిటంటే పోషకాలు సమృద్ధిగా ఉండే ఓట్స్ ఇడ్లీ  తయారు చేయడం చాలా సులభం.

కీటో కోకోనట్ రైస్:

ఇది తేలికైన, సులభమైన, రుచికరమైన వంటకం. ఈ రోజుల్లో దీనిని తినమని లేదా ప్రయత్నించమని డైటీషియన్లు కూడా సలహా ఇస్తున్నారు. కీటో కోకోనట్ రైజ్‌లో క్యాబేజీని జోడించడం ద్వారా మీరు దీన్ని మరింత ఆరోగ్యవంతంగా చేయవచ్చు. ఈ వంటకాన్ని తయారు చేయడం చాలా సులభం. ప్రత్యేకత ఏమిటంటే.. ఈసారి మీరు డిన్నర్‌లో ప్రత్యేకమైనదాన్ని ప్రయత్నించవచ్చు.

ఎగ్ చాట్:

ప్రోటీన్లు, ఆరోగ్యకరమైన కొవ్వులు, విటమిన్లు సమృద్ధిగా ఉన్న గుడ్లను సరైన మొత్తంలో ప్రతిరోజూ తీసుకోవాలి. జిమ్ చేసేవాళ్లే కాదు.. సాధారణ వ్యక్తులు కూడా గుడ్లు తినాలి. బరువును నియంత్రించుకోవడానికి మీరు రాత్రి భోజనంలో ఎగ్ చాట్ తినవచ్చు. దీని కోసం.. గుడ్లను ఉడకబెట్టి, వాటిని ఒక గిన్నెలో మెత్తగా చేయాలి. అందులో బచ్చలికూర, టమోటా, ఉల్లిపాయతో పాటు ఇతర కూరగాయలను కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇది కూడా రుచిగా ఉంటుంది. దీన్ని తయారు చేయడంలో మీరు పెద్దగా ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు.

మరిన్ని హెల్త్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.