మౌనంగా ఉండడం చాలా గొప్ప విషయమని చెబుతుంటారు. ఎన్నో రకాల సమస్యలకు అతిగా మాట్లాడడమే కారణమని అంటుంటారు. అందుకే వీలైనంత వరకు మౌనంగా ఉండాలని, మాటలను పొదుపుగా వాడాలని చెబుతుంటారు. అయితే అన్ని సందర్బాల్లో మౌనంగా ఉంటానంటే కుదరదని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా చాణక్య నీతిలో ఇందుకు సంబంధించి కొన్ని విషయాలను స్పష్టంగా పేర్కొన్నారు. కొన్ని విషయాల్లో మౌనంగా ఉండడం వల్ల మరిన్ని సమస్యలు కొని తెచ్చుకున్నట్లు అవుతుందంటా. ఇంతకీ మౌనంగా ఉండకూడదని ఆ సందర్భాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
* అన్యాయం జరుగుతున్న సమయంలో మౌనంగా ఉండడం తప్పని ఆచార్య చాణక్య తెలిపారు. కేవలం మీకు మాత్రమే కాకుండా మీ పక్కన వారికి అన్యాయం జరుగుతున్నా స్పందించకపోవడం అది మంచి పద్ధతి కాదని చెబుతున్నారు. అన్యాయాన్ని చూస్తూ గొంతు విప్పకపోవడం నేరంతో సమానమనేది చాణక్య అభిప్రాయం.
* ఇక మౌనంగా ఉండకూడని మరో సందర్బం మీ హక్కులు దూరమవుతుంటే. హక్కుల కోసం నిర్భయంగా పోరాడాలి. హక్కు దూరమవుతున్నా మౌనంగా ఉంటానంటే కుదరదని చాణక్య తెలిపారు.
* మౌనంగా ఉండడం అంటే తప్పు జరుగుతోన్నా ప్రశ్నించకపోవడం కాదని చాణక్య అన్నారు. సత్యం వైపు కచ్చితంగా నిలబడాలి, అందుకు గొంతు కలపాలి అని చెబుతారు. సత్యం వైపు మాట్లాడడం మనిషి బాధ్యత.
* మీకు అవమానం జరుగుతోన్నా మౌనంగా ఉంటానంటే కుదరదు. మీ తప్పు లేకున్నా మిమ్మల్ని ఎవరైనా నిందిస్తుంటే కచ్చితంగా ఎదురించాల్సిందే. ఆత్మగౌరవంతో ఉంటేనే మన జీవితానికి ఒక అర్థం ఉంటుందని గుర్తించాలి.
* మీ మౌనం కారణంగా బంధాలు దూరమవుతాయంటే అది మంచి పద్ధతి కాదని అంటారు చాణక్య. మన మౌనం బంధాలు బలోపేతం చేయడానికి ఉపయోగపడాలి తప్ప, బంధాలను దూరం చేయడానికి కాదని అంటారు.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం క్లిక్ చేయండి..